Back
Home » సంబంధాలు
బ‌ల‌వంతంగా పెళ్లి చేశారు... ఆ త‌ర్వాత ఏమైందంటే...!
Oneindia | 28th Jun, 2018 04:31 PM
 • 1. పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లి

  మ‌న స‌మాజంలో అటు ఏడు త‌రాలు ఇటు ఏడు త‌రాలు చూశాకే పెద్ద‌లు పిల్ల‌ల‌కు పెళ్లి కుదురుస్తారు. ఆలు మ‌గ‌లు మూడు ముళ్ల బంధంతో మ‌మేక‌మ‌య్యేందుకు ఇరు కుటుంబాల పద్ధ‌తులు న‌చ్చితీరాలి. ఆ త‌ర్వాత జాత‌కాలు కుద‌రాలి. కాబోయే వ‌రుడిదో, వ‌ధువు సంపాద‌న గురించి తెలిసి ఉండాలి. ఒక్కోసారి అదృష్టం కొద్దీ పెళ్లి చేసుకునేవారి అభిప్రాయాల‌కు విలువ‌నిస్తారు. నా విష‌యంలోనూ మా త‌ల్లిదండ్రులు 2 ఏళ్ల‌పాటు మంచి వ‌రుడి కోసం బాగా వెతికారు. పైగా అన్ని ప‌ద్ధ‌తులు, సంప్ర‌దాయాల‌ను పాటించాలి క‌దా! నా మిస్ట‌ర్ పర్‌ఫెక్ట్ దొరికే వ‌ర‌కు ఈ వెతుకులాట ఆగ‌లేదు. ఆ త‌ర్వాత నా సంసార జీవితం ఎలా సాగిందో మీరే చద‌వండి!


 • 2. మొత్తానికి పెళ్లి అన్వేష‌ణ ముగిసింది...

  ఒక‌రోజు మ్యాట్రిమోనియ‌ల్ సైట్‌లో నా గురించి వివ‌రాలు తెలుసుకొని మా నాన్న‌ను ఒక కుటుంబం సంప్ర‌దించింది. వాళ్లంతా మాకు స‌రైన జోడిలా క‌నిపించింది. మా పూజారి సైతం మేమిద్ద‌రం దంప‌తుల‌మైతే స‌రైన జోడీ కాగ‌ల‌ద‌ని భాష్యం చెప్పారు. అబ్బాయి కూడా మంచి విద్యావంతుడు. పెళ్లికి ముందు అత‌డ్ని రెండు సార్లు క‌లిశాను. అత‌డు డీసెంట్ కానీ కాస్తంత సంకుచిత భావం క‌లిగిన‌వాడిలా అనిపించింది. నా ఆశ‌యాల గురించి అత‌డికే చెబితే త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌నీ... జీవితం ఎలా సాగితే అలా వెళ‌దామ‌ని అన్నాడు. సంబంధం ఖాయం అయిన రెండు నెల‌ల‌కు మా పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత నా జీవితం ఊహించ‌ని మ‌లుపు తిరిగింది.


 • 3. తొలి వారం అలా గ‌డిచింది...

  పెళ్లి తంతులో చాలా బిజీ అయిపోయాను. స‌రైన వ‌స్త్రాలు, వేదిక‌, మేక‌ప్ లాంటివ‌న్నీ చూసుకోవాలి క‌దా! ఒక‌ర్నొక‌రు తెలుసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం దొర‌క‌లేదు. నాకేమో నా కాబోయే భ‌ర్త‌తో కొంచెం రొమాంటిక్ టైమ్ గ‌డ‌పాల‌ని ఉండేది. కానీ ఏ బంధంలోనూ జ‌ర‌గ‌న‌టువంటి ప‌రిస్థితి నాకు ఎదురైంది. ఒక్క‌సారిగా మా ఆయ‌న న‌న్ను వేరే విధంగా చూడ‌టం మొద‌లుపెట్టారు. నాతో ఏదైనా అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఎక్కువ‌గా మాట్లాడ‌క‌పోయేవాడు. వాళ్ల కుటుంబం మాత్రం నన్ను కోడ‌లిగా స్వీక‌రించి బాగానే చూసుకునేవారు. ఎటొచ్చీ ఆయ‌నే న‌న్ను గుర్తించ‌డం లేదు.


 • 4. ప‌డ‌క గ‌దికి వ‌చ్చి...

  పెళ్లి అయిన తొలివారం నాకు న‌ర‌క‌మే క‌నిపించింది. అత‌డు ప‌డ‌క గ‌దికి వ‌చ్చీ రాగానే క‌నీసం నా మొహం చూడ‌కుండానే గుర్రుపెట్టి నిద్ర‌పోయేవాడు. విష‌యం ఏమిటని ఆయ‌నను అడిగిన ప్ర‌తీసారీ బాగా అల‌సిపోయాను అని చెప్పి ప‌డుకునేవాడు. అస‌లు ఆయ‌న‌కు నా ప‌ట్ల ఏం అభిప్రాయం ఉందో అర్థం కాక‌పోయేది. దీని గురించి ఎవ‌రికైనా ఏం చెప్పుకోగ‌ల‌ను చెప్పండి.


 • 5. అల‌సిన నా క‌ళ్లే చెప్పాయి...

  పెళ్లయి అప్ప‌టికి నెల గ‌డిచింది. మా అత్త‌వారు మ‌మ్మ‌ల్ని బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు డిన్న‌ర్‌కు పంపించారు. అల‌సిన నా క‌ళ్లు, ఆయ‌న డిఫ‌రెంట్‌గా బిహేవ్ చేయ‌డాన్ని కుటుంబ‌స‌భ్యులు గ‌మ‌నించారు కాబోలు. మా ఇద్ద‌రికీ చాలా రోజుల త‌ర్వాత ఏకాంతం దొరికింది. కారు ఎక్క‌గానే నేను క‌న్నీళ్లు పెట్టుకొని నా వ‌ల్ల ఏమైనా త‌ప్పు జ‌రిగిందా అని వేడుకున్నాను. అత‌డు నా నిస్స‌హాయ‌త‌కు క‌రిగిపోయి త‌న విష‌యం చెప్పాడు. త‌ను అప్ప‌టికే ఎవ‌రితోనూ ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు అయినా కూడా త‌ల్లిదండ్రులు ప్రేమ‌ను కాద‌ని ఇలా పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేశార‌ని వాపోయాడు. దానికి ఆ య‌న సారీ కూడా చెప్పాడు.


 • 6. నా ప్ర‌పంచం కుదేలైంది

  నేను కోరుకున్న జీవితం కుదేలైన్న‌ట్టు అనిపించింది. మోస‌పోయాన‌ని బాధ‌ప‌డ్డాను. పెళ్లి బంధాన్ని తెంచుకొని మా పుట్టింటికి వెళితే నా గురించి బంధువులు ఏమ‌నుకుంటారు. ఇలాంటి ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌ల‌తో పిచ్చి ఎక్కిపోయింది. ఆ త‌ర్వాత ధైర్యం కూడ‌గ‌ట్టుకొని త‌ర్వాత ఏం చేద్దామ‌ని ఆయ‌న‌ను అడిగాను. ఆశ్చ‌ర్య‌క‌రంగా అత‌డు త‌న గ‌తాన్ని మ‌ర్చిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. అత‌డి క‌ళ్ల‌లో అప‌రాధ‌భావం, మాట‌లో నిజాయ‌తీని గ‌మ‌నించాను. మా పెళ్లికి మ‌రొక చాన్స్ ఇద్దామ‌ని అప్పుడే అనుకున్నాం.


 • 7. స్నేహితులుగా ఉందామ‌నుకున్నాం...

  రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. కొన్ని రోజులు భార్యా భ‌ర్త‌లు అన్న విష‌యం ప‌క్క‌న పెట్టి స్నేహితులుగా ఉందామ‌ని నిశ్చ‌యించుకున్నాం. ఒక‌రి అభిరుచులు గురించి మ‌రొక‌రం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాం. నాణ్య‌మైన స‌మ‌యం గ‌డ‌పడానికి ట్రై చేశాం. మెల్ల‌మెల్ల‌గా మా అనుబంధం బ‌లంగా మార‌సాగింది. తెలియ‌కుండానే ఒక‌ర్నొక‌రం ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెట్టాం. మా ఇద్ద‌రి మ‌ధ్య ఏదో తెలియ‌ని భావోద్వేగం మొద‌లైంది. రోజంతా ప‌నిలో అల‌సిపోయాక ఒక‌ర్నొక‌రం క‌లుసుకునేందుకు త‌హ‌త‌హ‌లాడేవాళ్లం.


 • 8. ఎనిమిది నెల‌ల త‌ర్వాత‌...

  పెళ్ల‌యి 8 నెల‌లు గ‌డిచాయి. ఏదో తెలియ‌ని అద్భుతంలా అనిపిస్తుంది. మేమిద్ద‌రం ఇప్పుడు ప్రేమ‌లో ఉన్నాం. మాకో అంద‌మైన భ‌విష్య‌త్ ఉన్న‌ట్టు అనిపిస్తుంది. గ‌త‌మంతా చేదుగా ఉండ‌వ‌చ్చు గాక‌... కానీ కాస్తంత ఓపిక‌, అర్థంచేసుకోగ‌లిగే త‌త్వం మాలో ఉన్నాయి. ఇదేమంత సాదాసీదాగా అయిపోలేదు. ఇద్ద‌రి గురించి తెలుసుకోవ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇప్ప‌టికీ కొన్ని చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ ప‌డుతూనే ఉన్నాం. అయినా మా గ‌తం గురించి బెంగ లేదు. మా ప్ర‌స్తుత జీవితమే నాకు ముఖ్యంగా అనిపిస్తుంది. సంతోష‌క‌ర‌మైన సంసార జీవితం గ‌డుపుతున్నందుకు ఆనందంగా ఉంది.
మా ఆయ‌న‌కు ఇష్టం లేకుండానే నా పెళ్లి చేశారు. మొద‌ట్లో ముభావంగా ఉండేవారు. అస‌లు విష‌యం తెలిసిన నేను కుదేల‌య్యాను. ఆ త‌ర్వాత మా సంసారం ఎలా చ‌క్క‌దిద్దుకున్నానో మీరే చ‌ద‌వండి.