Back
Home » సంబంధాలు
ఈ 6గురు భార్య‌లు త‌మ‌ను మోసం చేసిన భ‌ర్త‌ను ఎలా క‌నిపెట్టారో చూడండి..
Oneindia | 29th Jun, 2018 06:02 PM
 • 1. స్కూల్ అడ్మిష‌న్ లెట‌ర్ ప‌ట్టిచ్చింది...

  ఒక‌సారి నేను నా భ‌ర్త డెస్క్ శుభ్రం చేస్తున్నాను. ఒక పుస్త‌కంలో స్కూల్ అడ్మిష‌న్ ఫారం క‌నిపించింది. నా ఊహ‌కు ఇది ఎంత మాత్రమూ అంద‌లేదు ఎందుకంటే మా ఇద్ద‌రు పిల్ల‌లు కాలేజీలోనే చ‌దువుతున్నారు. ఇక ఇదెవ‌రిది అని అడిగేస‌రికి ఆయ‌న వ‌ద్ద స‌మాధానం లేదు. త‌న స్నేహితుడి కొడుకుది అని చెప్పాడు కానీ వాళ్లిద్ద‌రి పేర్లు ఒక‌టే ఎలా అయి ఉంటుంది అని నా సందేహం. అదే అత‌డి ద‌గ్గ‌ర వ్య‌క్తం చేశాను. దానికి ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేక‌పోయాడు. ఆ ఫారం తండ్రి బ‌యోడేటా పూర్తి చేయాల్సింది.


 • 2. కండోమ్‌లు దొరికాయి...

  ఒక‌సారి నా భ‌ర్త జేబులో స్ట్రాబెర్రీ ఫ్లేవ‌ర్ కండోమ్‌లు దొరికాయి. అది చూస్తేనే న‌న్ను మోసం చేస్తున్నాడ‌ని గుర్తుపట్టేశాను. ఇది నా కోసమే అనుకోవ‌చ్చుగా అని మీర‌నవ‌చ్చు. అస‌లు సంగ‌తేమిటంటే స్ట్రాబెర్రీలంటే నాకు చెడ్డ‌చిరాకు. ఇక కండోమ్‌లంటే అస్స‌లు ప‌డ‌దు. ఆ పింక్ క‌ల‌ర్ కండోమ్‌లు ఎవ‌రికోస‌మో అన్న సంగ‌తి ఇక వేరే చెప్పాలా?


 • 3. ర‌హ‌స్య బ్యాంకు ఖాతా

  అనుకోకుండా నా భ‌ర్త‌కు మ‌రొక బ్యాంకు ఖాతా ఉన్న‌ట్టు క‌నుగొన్నాను. దాని పైన గృహ‌రుణం కూడా తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అంటే నాకు తెలియ‌కుండానే ఇన్నేళ్లు వేరే ఇల్లు ఉంద‌న్న‌మాట‌. ఆయ‌న‌ను నిల‌దీసే స‌రికి వేరే మ‌హిళ‌తో వేరు కాపురం పెట్టిన‌ట్టు ఒప్పుకున్నాడు.


 • 4. ఫొటోలో నీడ ప‌ట్టిచ్చింది...

  నా భ‌ర్త ఉద్యోగ నిమిత్తం ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చేస్తుంటారు. ఒక‌సారి హోట‌ల్ రూమ్ నుంచి ఫొటో పంపించాడు. అంతా బాగానే క‌నిపించింది. కిటికీ నీడ‌లో ఒక మ‌హిళ అండ‌ర్‌వేర్‌లో లీల‌గా క‌నిపించింది. జూమ్ చేసి చూస్తే ఆమె ఎవ‌రో కాదు త‌న భ‌ర్త కొలీగ్‌.


 • 5. ఆ ప‌నిలో ఉండ‌గా వేరే పేరుతో ప‌లికాడు..

  ఒక సారి బాగా సెక్స్ చేసుకుంటున్నాం. చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేశాం. ఆయ‌న నా పేరు కాకుండా నా క‌జిన్ పేరు ప‌లికాడు. పొరపాటు గ్ర‌హించేలోపు చాలా ఆల‌స్య‌మైంది. నాకు నిజం తెలిసిపోయింది. ఎన్ని ర‌కాలుగా స‌ముదాయించినా నా అభిప్రాయం మార‌లేదు.


 • 6. ప‌ర్‌ఫ్యూమ్ ప‌ట్టిచ్చింది..

  నాకు సుగంధ ప‌రిమ‌ళాలు అంటే ఎన‌లేని పిచ్చి. మేముండే న‌గ‌రంలో ఒక మంచి దుకాణం ఉంది. అందులో మంచి మంచి అత్త‌ర్లు దొరుకుతాయి. ఒకదాన్నే వెళితే ఎక్కువ‌గా కొనేస్తానేమో అన్న భ‌యంతో నా భ‌ర్త‌ను తోడు ర‌మ్మ‌న్నాను. ఆయ‌న‌కు ఇష్టంలేదు అయినా బ‌ల‌వంతంగా వ‌చ్చాడు. తీరా బిల్లు క‌ట్ట‌డానికి వ‌చ్చేట‌ప్పుడు షాపు అత‌ను మా వారిని అడిగారు.. గ‌త వారం కొన్న ప‌ర్‌ఫ్యూమ్ మీ కూతురికి న‌చ్చిందా అని.. ఇంకేం దొరికిపోయారు మా వారు. మా క‌స‌లు కూతురే లేదు. ఆయ‌న‌ను నిల‌దీసి అడిగేస‌రికి చెప్పాడు. యూనివ‌ర్సిటీలో త‌న స్టూడెంట్‌తో అఫైర్ ఉన్న‌ట్టు ఒప్పుకున్నాడు.
దాంప‌త్య జీవితంలో భార్యను మోసం చేస్తూ భ‌ర్త దొరికిపోవ‌డం చాలా సాధార‌ణ విష‌యంగా మారిపోతుంది. ఇలా మోస‌పోయాయ‌ని తెలిసిన భార్య ఒక్క‌సారిగా షాక్‌కు గురికావొచ్చు. ఒక్కోసారి మ‌న‌సు దెబ్బ‌తింటుంది. కొంద‌రేమో అయిష్టంగానే మోసంచేసినా స‌ర్దుకుపోతారు. అనుకోకుండా భ‌ర్త‌లు దొరికిపోతారు. మాంఛి ఉదాహ‌ర‌ణ ఏదంటే ష‌ర్ట్ కాల‌ర్‌కు లిప్‌స్టిక్ అంటిఉండ‌టం. కొంద‌రు భ‌ర్త‌లు తామే మోసం చేసిన‌ట్టుగా ఒప్పుకుంటారు. అన్ని సంద‌ర్భాల్లోనూ భార్య‌లు త‌మ భ‌ర్త‌లు మోసం చేశార‌నే విష‌యాన్ని త్వ‌ర‌గా జీర్ణించుకోలేక‌పోతారు. ఈ ఆరుగురు భార్య‌లు త‌మ స్వీయ అనుభ‌వాల‌ను చెపుతున్నారు. అయితే చ‌ద‌వండి మ‌రి...