Back
Home » సంబంధాలు
వారెందుకు మీ ప్రవర్తన విసుగు పుట్టిస్తుందని అంటున్నారు? మీ యొక్క ఏ విధమైన అలవాట్లు ఈ అభిప్రాయానికి కారణమవుతున్నాయి?
Oneindia | 30th Jun, 2018 08:00 AM
 • 1. మీరు వారిపట్ల ఉత్సాహం కలిగి ఉండకపోవడం మరియు ఆసక్తి చూపకపోవడం -

  మీరు ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఆ సంభాషణలో మనసు పెట్టండి. మీ భావనలు, ఆలోచనలు, నమ్మకాలు మరియు అభిప్రాయాలను ఇతరులకు గంభీరమైన స్వరముతో,కథలా చెప్పుకుంటూ పోకండి. ఎదుటివారితో మాట్లాడటం మీకెంత ఉత్సాహాన్ని అందిస్తుందో, వారితో సంభాషించడం, బంధం ఏర్పరచుకోవడం కొరకు మీరెంత ఆత్రంగా ఉన్నారో, మీ మాటల్లోనే తెలిసిపోవాలి. నిర్జీవమైన మాటలు, చేష్టలతో ఎదుటివారికి విసుగు తెప్పించకండి.


 • 2. మీరు అస్పష్టతతో కూడిన ప్రశ్నలు వేసినప్పుడు-

  మీరు అడిగే ప్రశ్నలు అస్పష్టమైనవిగా, ఎదుటివారి స్థాయికి తగ్గట్టు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తిపై కాస్తంత ఆసక్తి కనపరచండి. వారిని మీరు స్వాగతిస్తున్నట్లు ప్రవర్తించండి. మీరు భిన్నమైనవారు కాదని, వారిపట్ల స్వచ్ఛమైన శ్రద్ధను కలిగి ఉన్నారని తెలిసేటట్టు ప్రవర్తించండి. మీరు వారికంటే భిన్నమైనవారు అనే విధంగా ప్రవర్తించినట్లైతే, మీ ప్రేమను స్వీకరించేందుకు అవసరమైన ప్రేరేపణ కలుగదు కనుక మీ ప్రేమను స్వాగతించలేరు.


 • 3. మీ ముఖంపై చాలా అరుదుగా చిరునవ్వు కనిపిస్తే-

  ఇతరుల పట్ల మీ ప్రేమ హృదయ పూర్వకమైనది అయితే మీ ముఖం చెదరని చిరునవ్వుకు చిరునామాగా ఉంటుంది. మీరు నవ్వుతూ ఉంటే ఎదుటివారు మా సమక్షంలో, సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా మరియు ఆనందంగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా ఎదుటివారితో సంభాషణ సాగిస్తున్నప్పుడు నవ్వకపోతే, అది నిరుత్సాహం కలిగిస్తుంది.


 • 4. మీ శరీర భాష మీ మనసులో భావాలకు భిన్నంగా ఉంటే-

  మీ శరీర భాషకు, మీ మనసులోని భావాలకు పొంతన లేకపోవడం పెద్ద లోపంగా మారవచ్చు. మీ చేతులెప్పుడు రక్షణ కోసం తయారుగా ఉన్నట్లు అడ్డుగా పెట్టుకుని మాట్లాడటం, కళ్ళను అటూఇటూ తిప్పుతూ ఎదువారిపై దృష్టిని నిలపకపోవడం వంటి చర్యల ద్వారా మీరెప్పటికీ ఎదుటివారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. మీ దృష్టి ఎప్పుడు గతి తప్పినట్లే ఉంటుంది. ఇటువంటి శరీర భాష ద్వారా మీ మనసును తెలియజేయాలనుకుంటే, ఎటువంటి వారైనా మీకు దూరంగా పారిపోతారు. మీరు వారిని దగ్గరవ్వడానికి అనుమతించట్లేదని భావిస్తారు. కనుక మీ శరీర భాష, హావభావాలువారిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు చూసుకోండి.


 • 5. మీ ప్రవర్తనసరళి ప్రతికూలాత్మకంగా ఉంటే-

  మీరు ఎంతో అందమైన వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ మీలో నుండి వెలువడే వైబ్స్, మీ ఆత్మకు ఉన్న ఆకర్షణ తెలియజేస్తాయి. మీ ప్రవర్తన ప్రతికూలంగా ఉంటే,మీరెంత అందంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని ఆకట్టుకోలేరు. ఒక వ్యక్తిని అర్ధం చేసుకోవడానికి వారి ప్రవర్తన సరళి దోహదపడుతుంది. వారికై మీ తాపత్రయం బయటకు తెలిసేటట్టు ప్రవర్తించండి.


  ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకొని, మీ డేట్ లో మీ ప్రవర్తనను తదనుగుణంగా మలుచుకోండి. ఇలా చేస్తే మీ బంధానికి ఉత్ప్రేరకం ఇచ్చిన వారవుతారు. ఎదో సమయం వెళ్లబుచ్చడానికి డేటింగ్లో పాల్గొనకండి. ఒక రాజు లేదా రాణి మాదిరిగా డేట్ చేయండి. ఇద్దరిలో ఉత్సాహాన్ని చల్లారనివ్వకండి.

  మీకు ఈ వ్యాసం నచ్చినట్లైతే, షేర్ చేయండి.
మీ కళ్ళ ముందే డేటింగ్ సమయంలో, మీ బంధం కుప్ప కూలిపోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇదివరకు మీలో ఉన్న ఈ లక్షణాలు ఇప్పుడు లేకుండా చూసుకోండి. డేటింగ్ సమయంలో కొన్ని రకాల ప్రవర్తనలు ఎదుటివారి మూడు పాడుచేస్తాయి. అవేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలిసుకోవాలనుకుంటున్నారా?

లోకంలో రకరకాల వ్యక్తుల యొక్క రకరకాల ప్రవర్తన శైలి, ఇతరులకు విసుగు పుట్టిస్తుంది. డేటింగ్ కి వెళ్ళినప్పుడు, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీరు తొలిసారిగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నట్లైతే, మీరు మీలా ఉంటూ, మీ సహజ లక్షణాలను ఎదుటి వ్యక్తికి చూపించడం అవసరం. అలా అని మీలో మూర్ఖత్వాన్ని ఎదుటిమనిషి పై రూడీపీ, అది మీ ముక్కుసూటి ప్రవర్తన కింద సాకు చూపడం తప్పు. డేటింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరెప్పుడు విశిష్టంగా ప్రదర్శించుకుని, ఎదుటివారి మనసులో స్థానం పొందటానికి ప్రయత్నించాలి. అటువంటి సమయంలో , మీ ప్రవర్తన అసమంజసంగా ఉంటే, ఎదుటి వ్యక్తి మన్నన పొందే అవకాశం కోల్పోయినట్లే!

డేటింగ్ సమయంలో, ఈ రకమైన ప్రవర్తన ఇతరుల మూడును ఏ విధంగా పాడుచేస్తుందో తెలుసుకోండి!

కొన్ని చిన్న చిన్న చేష్టలు మరియు హావభావాలు ఎదుటివారిని ఆకట్టుకొనివ్వకుండా చేస్తాయి. వీటిలో మీ నవ్వు, చేతుక కదలికలు, మీరు సంభాషించే విధానం మరియు ఇతర మీరు మార్గాల ద్వారా ఇతరుల వద్ద మిమ్మల్ని మీరు ఎలా చిత్రీకరించుకుంటారు అనేవి ముఖ్య భూమిక పోషిస్తాయి.

ఇప్పుడు మనం డేటింగ్ లో మీ ప్రవర్తన ఏ విధంగా ఉండకుండా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం.