Back
Home » సంబంధాలు
మీ గార్ల్ ఫ్రెండ్ సున్నిత మనస్కురాలా? అయితే ఈ విషయాలలో జాగ్రత్త.
Oneindia | 4th Jul, 2018 01:17 PM
 • 1. ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శించకండి, వాస్తవిక ధోరణి కలిగి ఉండండి

  సున్నితమైన అమ్మాయి తన భావోద్వేగాలను, ఆలోచనలను ఎలా నడిపిస్తుందో మీకు తెలియదు. వాటికి వ్యతిరేకంగా మీ ప్రవర్తన తోడైతే, అది సంబంధంలో వారి ఆనందాన్ని చంపుతుంది. అంతేకాకుండా ప్రేమలో ఉండడమే తప్పు అన్న ఆలోచన కూడా మొదలవుతుంది. మీరు పంచుకోకూడని అంశాల గురించిన ప్రస్తావన తెచ్చినప్పుడు, వారు మీ పట్ల హేయభావాన్ని పెంచుకోవడం మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరియు ఆ అంశాలు సున్నితమైనవి అయితే, వారి కోపానికి గురికాక తప్పదు. కొందరు లోలోపల హేయభావాన్ని కలిగి ఉన్నా, కొందరు బాహాటంగానే యుద్ధం ప్రకటిస్తారు. ఈ ప్రకృతిలో సున్నిత మనస్కులైన మహిళలు, భావోద్వేగాలను సహజంగానే ఆభరణాలుగా కలిగి ఉంటారు. తమను అగౌరవ పరచే విషయాలు, లేదా మరేవైనా మనసుకు నచ్చని సునిసిత విషయాల గురించి మాట్లాడడం వీరు ఎన్నటికీ సహించలేరు.


 • 2. ఫాస్ట్ ఫార్వార్డ్ మంచిదే

  సున్నితమైన మనసు కలిగిన అమ్మాయి తన మనసుకు నచ్చని అంశాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నిస్తుంది. ఏ విషయంలో అయినా తగ్గ సమయాన్ని తీసుకుంటారు. సంబంధిత అంశాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, మరియు ఈ ఆలోచనా సమయమే వారి భావోద్వేగాలను నెమ్మదిగా అణిచివేస్తుంది. ఏ విషయం గురించైనా తీవ్రంగా ఆలోచించే వీరు, తమకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడం, సంబంధిత అంశాల గురించి ఆలోచించడం వంటివి చేస్తారు. వీరి నిర్ణయాలపట్ల తొందరతనం పనికి రాదు. ఈ తొందరపాటు ఒక్కోసారి ప్రతికూల సమస్యలను తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున కొన్ని అంశాలకు సమయాన్ని ఇస్తూ, పదే పదే అంశాలను ప్రస్తావించకుండా ఫాస్ట్ ఫార్వార్డ్ చేయడం మంచిది.


 • 3. అతిగా ఆలోచించకండి, చివరికి ఆలోచనలే మిగుల్తాయి

  నిజానికి అతిగా ఆలోచించడం అంటే, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అర్ధం చేసుకోవడం. కానీ తీవ్రమయ్యే కొలదీ సానుకూల అంశాలు పక్కకు వెళ్లి ప్రతికూల ఫలితాలే గోచరిస్తుంటాయి. కావున తీవ్రమైన ఆలోచనలకు చెక్ పెట్టడం మంచిది. ప్రకృతిలో సున్నిత మనస్కులైన మహిళల ఆలోచనలు ఎక్కువగా అత్యంత బహిర్గతమై ఉంటాయి. పరిస్థితి యొక్క ప్రతి అంశాన్ని విశ్లేషించడానికి, సాధ్యమైన మార్గాలన్నిటినీ గుర్తించడానికి ఇష్టపడతారు. మీరు దీన్ని అర్థం చేసుకుని, మరింత సహాయకరంగా ఉండాలి. అంతేకానీ, వారి మనస్థితి పట్ల తీవ్రమైన ఆలోచనలు చేస్తే, మీకు నిద్ర లేని రాత్రులే తోడుగా నిలుస్తాయి.


 • 4. మీతో ఉండటం కష్టం

  సున్నిత మనస్కులైన మీ ప్రియురాలితో ఇటువంటి వాక్యాన్ని మాత్రం ఎప్పుడూ చెప్పకండి. ఇది ఆమె మనసును తునాతునకలు చేయగలదు. ఆమె మీకు భారంగా ఉందని భావించకండి. మీరు ఇలా అడిగినప్పుడు, ఆమె ఉనికినే ప్రశ్నిస్తున్నారని అర్ధం. మీరు ఈమాట అనడం మూలంగా ఆమె ఆత్మన్యూనతకు లోనయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కావున ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు అనకండి.


 • 5. మీరు ఎప్పుడూ ఆమె దృష్టి మీమీదే ఉండాలని కోరుకుంటున్నారా?

  సున్నిత మనస్థితి కలిగిన వారు ఎప్పటికీ ఒకరి శ్రద్ధ తమ మీదే ఉండాలని కోరుకోరు. అలాగే తాము కూడా ఒకరిమీద అదేపనిగా దృష్టి సారించే లక్షణాలను కలిగి ఉండరు. ఒకవేళ ఇతరులు తమ పట్ల శ్రద్ద చూపినా, లేదా శ్రద్ధను కోరుకుంటున్నా, తాము ఒకరి సహాయాన్ని అర్దిస్తున్నామన్న భావనని కలుగజేస్తున్నామేమో అన్న ఆలోచన వారిని నిద్ర కూడా పోనివ్వదు. సున్నిత మనస్థితి కలిగిన వారు స్నేహితుల మరియు సన్నిహితుల సహాయం కోరుకుంటారు కాని, శ్రద్ధని కాదు. ఇటువంటివి మీ పట్ల హేయభావాన్ని కలుగజేయవచ్చు.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకై బోల్డ్స్కీ పేజీని సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.
మీరు మీ భాగస్వామికి చెప్పాల్సిన విషయాలు ఉన్నట్లే, ఎప్పటికీ చెప్పకూడనివి కూడా ఉంటాయని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ భాగస్వామి లేదా ప్రియురాలు అత్యంత సున్నిత మనస్కురాలు లేదా తీవ్రంగా ఆలోచించే స్వభావం కలిగిన అమ్మాయి అయితే ? కాస్త జాగ్రత్త తప్పనిసరి. ఈ ప్రకృతిలో సున్నిత మనస్కుల పట్ల, మరింత శ్రద్ధ మరియు నిజాయితీని కలిగి ఉండాలి. తద్వారా నమ్మదగిన భాగస్వాములుగా ఉంటారు. లేకపోతే, కోరి కొరివితో తల గోక్కున్నట్లే అన్న సామెతకు పూర్తి అర్ధం మీ కళ్ళల్లో మెదులుతుంది. కాదంటారా?

మీరు ఏదో ఒక సమయంలో లేదా ఏదేని సందర్భంలో అనుకోకుండానే ప్రేమలో పడడం జరుగుతుంది. కానీ వారు సున్నిత మనస్కులో లేదో మీకు వెంటనే అవగాహన ఉండకపోవచ్చు, కొంత కాలానికే అన్నీ తెలుస్తాయి. సున్నిత మనస్కులు అరుదైన వర్గానికి చెందిన వారు. అంతఃసౌందర్యాన్ని, ప్రేమని అధికంగా కలిగి ఉండే వీరి కోసం ఏమైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది.

వారు ఎల్లప్పుడూ భద్రతా వలయాన్ని కలిగి ఉండి, వారి సంబంధం పట్ల మంచి జాగ్రత్తను తీసుకునే వారిగా ఉంటారు. సమస్యలను అర్థం చేసుకుంటారు, సలహాలను జోడిస్తూ, మిమ్మల్ని మీ పధంలో ప్రోత్సహిస్తారు మరియు ఎక్కువగా మీతో ప్రేమగా ఉంటారు.

ఇలా అనేక లాభాలను కలిగి ఉండే వీరు, అదే మోతాదులో కొన్ని చిన్న అసౌకర్యాలను కూడా కలిగి ఉంటారు. అవి నష్టాలు మాత్రం కాదు. అర్ధం చేసుకునే మనసు ఉండాలే కానీ, చిన్ని సమస్యలు ఎన్నటికీ చిన్నివిగానే ఉంటాయి, జీవితాంతం జ్ఞాపకాలుగా ఉంటాయి.

వారు భావోద్వేగాలను చాలా బాగా అర్థం చేసుకుంటారు మరియు వారు ప్రేమను బయటకు వ్యక్తపరచడంలో, మరియు అదే సమయంలో ఇతర అవాంఛిత భావోద్వేగాలను బయటికి తీసే ప్రతి ఎమోషన్ యొక్క అనుభూతిని లోతుగా పొందుతారు. కావున ఇటువంటి సున్నిత మనస్కుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడకూడని, చేయకూడని, అనవసరమైన అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అవేమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మీ గార్ల్ ఫ్రెండ్ సున్నిత మనస్కురాలా? అయితే ఈ విషయాలలో జాగ్రత్త.