Back
Home » సంబంధాలు
ఆమెకు ఒక బాబు ఉన్నాడు, అయినా సహజీవనం చేశా, ఏ భయం లేని నేను అందరికీ దూరంగా పారిపోయా #mystory193
Oneindia | 10th Jul, 2018 12:10 PM
 • క్యాబ్ డ్రైవర్‌ వేషంలోకి

  ఇంతలో నన్ను ఒక రోజు క్యాబ్ డ్రైవర్‌ వేషంలోకి మారిపొమ్మని చెప్పారు మా గ్యాంగ్ సభ్యులు. మాకు ఒక టీమ్ ఉండేది. ఒక లీడర్ ఉండేవారు. మా లీడర్ ఎలా చెబితే అలాగే ప్రవర్తించేవాణ్ని. ఆ రోజు నా ప్యాంట్‌లో గన్‌ పెట్టుకున్నాను. క్యాబ్ పక్కన్నే నిలబడి చుట్టూ గమనిస్తున్నా.


 • నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి

  కొద్దిసేపట్లో అక్కడికొచ్చే ఒక వ్యక్తిని కాల్చి చంపాలి. ఇది ప్లాన్. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడనే విషయంపై నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంతలో ఒక ముప్పై ఏళ్లు ఉన్న ఆమె నా దగ్గరకు వచ్చింది. నన్ను కాస్త క్యాబ్ లో హాస్పిటల్‌కి తీసుకెళ్తావా అంది. సారీ అండీ.. వేరే క్యాబ్ బుక్ చేసుకోండి అని చెప్పాను.


 • హాస్పిటల్‌కి అర్జెంట్ గా వెళ్లాలి

  లేదండీ... నేను హాస్పిటల్‌కి అర్జెంట్ గా వెళ్లాలి అంది. లేదండీ వేరే క్యాబ్ చూస్కోండి అన్నాను. తర్వాత ఆమె మెల్లిగా నడుచుకుంటూ ముందుకెళ్ల సాగింది. ఆమె కడుపుతో ఉందని గమనించాను. ఎలాగూ ఇంకాసేపట్లో ఒక వ్యక్తిని చంపబోతున్నాను ఆ పాపాన్ని ఈమెకు సాయం చేసి భర్తీ చేసుకుందామనుకున్నాను.


 • క్యాబ్ లో ఎక్కించుకుని

  ఆమెను క్యాబ్ లో ఎక్కించుకుని హాస్పిటల్‌లో డ్రాప్‌ చేశాను. నేను చేసిన సాయానికి ఆమె థ్యాంక్స్‌ చెప్పి నాకు ఒక వంద రూపాయలు ఇచ్చింది. నేను చాలా రోజులుగా రోజూ కొన్ని లక్షల రూపాయలు చూస్తున్నాను కానీ ఫస్ట్ టైమ్ ఒక వంద రూపాయలు తీసుకుని ఆనందించాను.
  మొత్తానికి ఆ రోజు నేను వేసుకున్న ప్లాన్ ప్లాప్ అయ్యింది.


 • మార్కెట్లో కలిసింది

  ఒకరోజు ఆమె నాకు మార్కెట్లో కలిసింది. కాసేపు మాట్లాడాను. ఆ రోజు నేను చేసిన సాయానికి మళ్లీ థ్యాంక్స్ చెప్పింది. తన భర్తతో విడాకులు తీసుకున్నానంటూ ఏడ్చింది. కొన్ని రోజులకు తనకు బాబు పుట్టాడు. ఒక రోజు నా గురించి తనకు మొత్తం చెప్పాను. మా బాబు ఆ రోజు సేఫ్‌గా పుట్టడానికి మీరే కారణం... మిమ్మల్నెప్పటికీ మర్చిపోలేను అంది. బాబును నా చేతుల్లోకి తీసుకొని కాసేపు ఆడుకున్నా. ఆ తర్వాత కొద్దిరోజులు నేను ఆమె గురించే ఆలోచించాను.


 • ఆమె ఇంటికి వెళ్లాను

  తర్వాత ఒక రోజు మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె నా కళ్లకు చాలా అందంగా కనిపించింది. తర్వాత ఇద్దరం బయటకు కాఫీ తాగేందుకు వెళ్లాం. కాఫీ తాగుతూ ఇద్దం మా ప్లాష్ బ్యాక్ లు చెప్పుకున్నాం. తను చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉందని నాకు అర్థమైంది. ఆ తర్వాత తరచూ కలవడం మొదలైంది. ఇష్టాలు పంచుకున్నాం.


 • సహజీవనం చేయడం మొదలుపెట్టాం

  ఒకరినొకరు కలవకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. ఇద్దరం సహజీవనం చేయడం మొదలుపెట్టాం. తను పరిచయం అయ్యాక నేను అన్నీ మానేశాను. గొడవలకు వెళ్లడం బంద్ చేశాను. తన బాబు పెద్దవాడవుతూ ఉన్నాడు. ఒకరోజు చాలారోజులుగా నా మనసులో దాచుకున్న విషయాన్ని చెప్పాను. పెళ్లి చేసుకుందామా? అని అన్నాను. నేనే ఎప్పటి నుంచో ఈ మాట అడుగుదామనుకుంటున్నానని అంది తను. ఇప్పటికైనా మీరు అడిగినందుకు థ్యాంక్స్ అంది.


 • తను పెళ్లికి ఓకే చెప్పింది

  మా భవిష్యత్‌ ఎలా ఉండాలనుకుంటున్నామో ఇద్దరం చర్చించుకున్నాం. తను పెళ్లికి ఓకే చెప్పింది. కానీ సరిగ్గా ఆ పెళ్లిరోజే నా మీద కోపంతో ఉన్న మా గ్యాంగ్‌లోని కొందరు ఆమెను బెదిరించారు. చంపేస్తామన్నారు. నాకు కోపమొచ్చింది. నా ఫ్యామిలీనే టార్గెట్ చేశారా అని ఏదైనా చేయాలనిపించింది. కానీ నాకు నన్ను నమ్మి వచ్చిన ఆమె, ఆ చిన్నారి గుర్తొచ్చారు.


 • ఫస్ట్ టైమ్ డిప్రెషన్ లోకి వెళ్లాను

  నా జీవితంలో మొదటిసారి భయమేసింది. ఫస్ట్ టైమ్ డిప్రెషన్ లోకి వెళ్లాను. కానీ నా కళ్లలో నీరు రాలేదు. ఆ బాధ మొత్తం నా గుండెల్లోనే ఉంది. నేను వెంటనే నన్ను నమ్మి వచ్చిన ఆమె, బాబుతో అందరికీ దూరంగా పారిపోయాను. నా సమయాన్నంతా నా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాను. మనకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక పగలు, ప్రతీకాలు అన్నవి ఏవీ ఉండవని నాకు అర్థమైంది.
నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. టెన్త్ ఫెయిల్ అయిన వెంటనే ఇంట్లో మా నాన్న తిట్లు భరించలేక ట్రాక్టర్ పనికి వెళ్లేవాణ్ని. అలా లేబర్ గా వెళ్తూ నేను ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. తర్వాత కారు డ్రైవర్ గా పని చేశాను. ఎప్పుడైనా ఏ కారుకైనా డ్రైవర్ లేకుంటే నేను టెంపరరీ డ్రైవర్ గా వెళ్లేవాణ్ని.

అలా డ్రైవర్ గా పని చేస్తున్నప్పుడు నాకు కొందరు పరిచయం అయ్యారు. వారి పరిచయంతో నేను డ్రైవింగ్ మానేసి కొత్త పనిలోకి జాయినయ్యాను. రోజూ చేతినిండా డబ్బు, కోరుకున్నదల్లా తినేంత సౌకర్యం ఇలా చాలానే ఉండేవి ఆ పనిలో. నేను కేవలం వాటి కోసమే వారితో స్నేహం చేశాను. వారు చెప్పిన ప్రతి పని చేసేవాణ్ని.