Back
Home » విహారం
ఉడిపి చుట్టుపక్కల ఈ అందాలను మిస్ చేసుకోకండి
Native Planet | 10th Jul, 2018 03:23 PM
 • కుద్రేముఖ్ నేషనల్ పార్క్

  P.C: You Tube

  కుద్రేముఖ్ అంటే గుర్రపు మోహం అని అర్థం. ఇక్కడి పర్వత శిఖరం గుర్రం మొహం రూపంలో కనిపించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటు వంటి అభయారణ్యం పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి అత్యంత విస్తీర్ణమైన అభయారణ్యాల్లో మొదటి స్థానం ఆక్రమిస్తుంది. ఇక్కడ ప్రధానంగా పులుల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. వీకెండ్ లో ఎక్కువ మంది ట్రెక్కర్స్ ఇక్కడకు వస్తుంటారు. ఉడిపి నుంచి 96 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఈ కుద్రేముఖ్ నేషనల్ పార్క్ ఉంది.


 • సీతానది నేచర్ క్యాంప్

  P.C: You Tube

  ఉడిపికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే సీతానది ఉంటుంది. మొత్తం పొడవు 70 కిలోమీటర్లు. ఈ నదివేగం, అక్కడి భౌగోళిక పరిస్థితులు రివర్ రాఫ్టింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. అందువల్లే ఒక్క కర్నాటక నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సాహసక్రీడలంటే ఇష్టపడేవారు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు.


 • మాల్పే బీచ్

  P.C: You Tube

  ఒక్క కర్నాటకలోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగా మాల్పే బీచ్ ప్రాచూర్యం పొందింది. ముఖ్యంగా ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలోని ఇసుక బంగారు వర్ణంలో ఉండగా నీరు స్వచ్ఛమైన నీలి రంగులో ఉంటాయి. ఉడిపి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని మాల్పేలోనే ఈ మాల్పే బీచ్ ఉంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఒక వైపు సూర్యుడు అస్తమించే ద`ష్యాలను చూస్తూ నచ్చిన నెచ్చలి చేయి పట్టుకొని కాలాన్ని మరిచిపోయి ముందుకు వెళ్లాలనుకొనేవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది.


 • సెయింట్ మేరిస్ ఐ ల్యాండ్

  P.C: You Tube

  నాలుగు చిన్న ద్వీపాలను కలిపి సెయింట్ మేరిస్ ఐ ల్యాండ్ అని అంటారు. పోర్చుగీసుకు చెందిన వాస్కోడిగామా మొదట ఇక్కడకు వచ్చి ఇక్కడి అందాలకు ముగ్దుడైనాడని చెబుతారు. అందువల్ల అతనే ఈ ప్రాంతానికి ఓ పద్రా డీ సాంత మరియా' అని పేరుపెట్టారు. అంటే మదర్ ఆఫ్ మేరి అని అర్థం. ఈ పదం నుంచే సెయింట్ మేరీస్ ఐ ల్యాండ్ అని పేరువచ్చిందని చెబుతారు. ఇక్కడి స్వచ్ఛమైన నీరు, ఇసుక తెన్నెల మీద విహారం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ప్లాస్టీక్ వాడకం ఈ ఐ ల్యాండ్ లో పూర్తిగా నిషిద్ధం


 • అరబ్బి జలపాతం

  P.C: You Tube

  ఈ అరబ్బి జలపాతం ఉడిపి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంజాల్ థర్ నదీ పై ఏర్పడుతుంది. చూడటానికి అంత పెద్దది కాకపోయినా దీని అందం పర్యాటకులను కట్టిపడేస్తుంది. అందువల్లే ఉడిపి వెళ్లిన వారు తప్పకుండా ఈ అరబ్బి జలపాతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అయితే ఈ జలపాతం పై భాగానికి చేరుకోవడం కొంత ప్రమాదంతో కూడుకున్నది. ఎల్లప్పుడు నీరు ఉండటం వల్ల ఈ జలపాతం వద్ద పాచి ఎక్కువగా ఉంటుంది.
ప్రకృతి అందాలకు కర్నాటక నెలవు అన్న విషయం తెలిసిందే. ఒక వైపున సముద్ర తీర ప్రాంతం ఉండగా మరోవైపున ఎతైన పచ్చటి పర్వత శిఖరాలు ఉన్నాయి. అయితే ఆ రెండు ప్రాంతాలు అంటే లోతైన సముద్రం, ఎతైన పర్వత శిఖరాలు ఒకే చోట ఉన్న ప్రాంతం ఉడిపి. ఈ ఉడిపికి దగ్గరగా ఉన్న బీచ్ లు విదేశీయులను సైతం ఆకర్షిస్తున్నాయి. అదే విధంగా పర్వత శిఖరాలు ట్రెక్కర్స్ కు స్వర్గధామం. ఇక పర్యావరణ ప్రేమికులకు ఉడిపికి దగ్గరగా ఉన్న పర్వతాలు, జలపాతాలు కనివిందును చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉడిపికి దగ్గరగా వీకెండ్ సమయంలో సందర్శించదగిన పర్యాటక కేంద్రాల్లో ఐదు ప్రాంతాలను మీ కోసం ఈ కథనంలో క్లుప్తంగా...