Back
Home » విహారం
నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం
Native Planet | 11th Jul, 2018 10:48 AM
 • ఒకరు అలా, మరొకరు ఇలా...

  P.C: You Tube

  పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.


 • దేవతల వినతి

  P.C: You Tube

  దేవతల వినతి మేరకు మేరుపర్వతం గర్వమనచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు. ఆక్రమంలోనే అగస్త్యమహర్షి క`ష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు.


 • పుట్ట నుంచి దివ్య దేజస్సు

  P.C: You Tube

  ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు. విషయం తెలుసుకొన్న దేవతలందరూఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.


 • సర్పాల చుట్టు పై శివలింగం

  P.C: You Tube

  తూర్పుదిశగా ఆలయ గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిలో సర్పాల చుట్ట పై శివుడు లింగరూపంలో ఉన్నారు. ఈ సర్పాట చుట్టనే పానపట్టం అని పిలుస్తారు. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు పాలతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. ఈ గర్భగుడిలో దేవతా సర్పం సంచరిస్తుందని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు.


 • అనేక రాజ వంశీయులు

  P.C: You Tube

  కాగా కార్తికేయుడే శివలింగం రూపంలో వెలిశాడన్న వాదన కూడా ఉంది. ఏదిఏమైనా ఇలా కార్తికేయుడు, శివుడు ఒకే ఆలయంలో కొలువై ఉండటం చాలా అరుదైన విషయం. అందువల్లే ఈ క్షేత్రానికి అత్యంత మహిమలు ఉన్నాయని చెబుతారు. ఇక స్వామివారిని పూజించనవారికి అన్ని శుభాలే జరుగుతుండటంతో దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ స్వామివారికి భక్తులయ్యారు.


 • నాగుల చవితి

  P.C: You Tube

  నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని భక్తులు నమ్ముతారు. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు రావని ప్రతీతి. అందువల్లే నాగుల చవితిరోజుల దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు. ఇదక ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలుస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...