Back
Home » విహారం
నదిలో ముగిగి ఉండే క్షేత్రం సహస్ర లింగాల, సందర్శనతో సంతాన సౌభాగ్యం
Native Planet | 12th Jul, 2018 12:30 PM
 • శల్మల నదే దేవాయం

  P.C: You Tube

  ఈ క్షేత్రంలో నది దేవాలయంగా మారింది. అదే శల్మల నది. పేరుకి తగ్గట్టుగానే అందమైన సంగీత నాదం చేస్తూ ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగవల్లి నదికి ఉపనదిగా ఉన్న ఈ నదిలోనే మన పరమశివుడు కొలువై ఉన్నాడు. శల్మల నదిలో వేయి శివలింగాలు, వేయి నందులు దర్శనమిస్తాయి. పేరుకి మాత్రమే వెయ్యి. వాస్తవానికి ఆ నందులను, శివలింగాలను మనం లెక్కపెట్టలేము.


 • ఔషద మూలికలు

  P.C: You Tube

  నదీ నీటి మట్టం కొద్దిగా తగ్గగానే అన్ని లింగాలు మనకు కనువిందును చేస్తాయి. ప్రతి శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. శివరాత్రి సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇక ఈ నది చుట్టు ఉన్న అడవిలో అమూల్యమైన వన, ఔష మూలికలు ఉండటం వల్ల ఈ నదిలో స్నానం చేస్తే ఎటువంటి రోగాలైన నయమవుతాయని నమ్ముతారు.


 • సంతానం కోసం

  P.C: You Tube

  విజయనగర సామ్రాజ్యానికి సామంతుడిగా ఉన్న సదాశివరాయులు అనే రాజు శిరిసి ప్రాంతాన్ని పాలించేవాడు. అతడికి ఎంతకూ సంతానం కలుగలేదు. దీంతో తనకు సంతానం కలిగితే సహస్ర లింగాలను చెక్కిస్తానని మెక్కుకొన్నాడు. కొన్నాళ్లకు కుమార్తె పెట్టింది. మెక్కులో భాగంగా అతడు శల్మల నదీ తీరంలో ఉన్న రాతి శిల పై సహస్ర లింగాలను చెక్కించాడు. నదీ ప్రవాహనం నిండుగా ఉన్నప్పుడు నది లోపల ఉండే ఈ లింగాలు ప్రవాహం పూర్తిగా తగ్గాక బయటకు వస్తాయి.


 • మిగిలిన చోట్ల ఉన్నా

  P.C: You Tube

  భారత దేశంలోని కొన్ని చోట్ల ఇలా వందలాది లింగాలు ప్రతిష్టించిన దాఖాలు ఉన్నాయి. అయితే అవన్నీ మాములు భూ భాగం ఉన్నవి. అయితే ఈ సహస్ర లింగాల మాత్రం మనకు నది లోపల ఉంటుంది. ఒరుస్సాలోని పరుశురామేశ్వర దేవాలయంలో ఒక పెద్ద శివలింగం పై 1008 లింగాలు కనిపిస్తాయి. అదే విధంగా హంపీలోని తుంగభద్ర నదీ తీరం వెంబడి వందల సంఖ్యలో కూడా మనకు శివలింగాలు కనిపిస్తాయి.


 • ఇలా చేరుకోవాలి

  P.C: You Tube

  ఉత్తర కర్నాటకలోని శిరిసి నుంచి ఎల్లాపూర్ వెళ్లే మార్గంలో 17 కిలోమీటర్ల దూరంలో మనకు సహస్ర లింగాల క్షేత్రం కనిపిస్తుంది. శిరిసి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. సందర్శకులు తినడానికి కావలసిన ఆహారపదార్థాలను వారే తెచ్చుకోవడం మంచిది. ఇక్కడ ఆహారం లభించదు.
పరమశివుడు నిరాకారుడు, నిరాడంబరుడు, లింగాకారంలో దర్శనమిచ్చే ఆదిభిక్షువు. ఆయన ఏకాంత ప్రదేశాల్లో సంచరించడానికి ఇష్టపడుతాడు. అందుకే మన దేశంలో చాలా శైవక్షేత్రాలు ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. ఇటువంటి కోవకు చెందినదే సహస్ర లింగాల క్షేత్రం కూడా. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసి పట్టణాకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ సహస్ర లింగాల మహాక్షేత్రం ఉంది.

ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. అయితే ఈ క్షేత్రంలోని శివయ్యను ఎప్పుడూ సందర్శించుకోవడానికి వీలు కాదు. కేవలం అక్కడ నదిలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే మనం ఈ క్షేత్రాన్ని సందర్శించగలం. ఇందుకు సంబంధించిన విశేషాలన్నింటితో కూడిన కథనం మీ కోసం...