Back
Home » విహారం
తలనొప్పిని తగ్గించే తాతయ్య, కిరీటం కలిగిన పరుశురాముడు అత్తిరాల విశేషాలు ఎన్నో...
Native Planet | 12th Jul, 2018 10:31 AM
 • పాపం అంటిన చేతిని

  P.C: You Tube

  తన తండ్రి జమదాగ్నిని కార్తవీర్యార్జుని కుమారులు సంహరించగా కోపోద్రిక్తుడైన పరుశరాముడు ఈ భూ మండలంలో 21 సార్లు దండయాత్రలు చేసి క్షత్రియులను తన గండ్రగొడ్డలితో సంహరిస్తాడు. క్షత్రియులను సంహరించడం వల్ల అంటుకున్న పాపంతో ఆ గండ్రగొడ్డలి పరుశురాముడి చేతి నుంచి కిందికి పడలేదు. దీంతో పరుశరాముడు శివుడి ఆదేశానుసారం దేశంలోని పుణ్య నదుల్లో స్నానమాడుతూ అత్తిరాలకు వస్తాడు. ఇక్కడ బహుదానదిలో స్నానం చేయగానే చేతికి అంటుకొని ఉన్న గండ్ర గొడ్డలి ఊడిపోతోంది.


 • అందువల్ల అత్తిరాల అయ్యింది

  P.C: You Tube

  క్షత్రియులను హత్య చేయడం వల్ల అంటుకొన్న గండ్రగొడ్డలి కిందికి పడిపోవడంతో ఆ ప్రాంతాన్ని అత్తిరాలగా పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధానంతరం జరిగిన రక్తపాతానికి నేనే కారణమని విచారంలో మునిగిపోయిన ధర్మరాజుకు శ్రీ వ్యాసభగవానుడు కర్తవ్యం భోదించే సమయంలో అత్తిరాల ప్రస్తావన వస్తుంది. (శాంతి పర్వం, ప్రథమాశ్వాసం). దీన్ని బట్టి ఈ క్షేత్రం ఎంతటి విశిష్టమైనదో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం అగ్ని గుండం నుంచి పుట్టిందని చెబుతారు. అందువల్లే ఇక్కడి పరమేశ్వరుడిని త్రేతేశ్వరుడని పిలుస్తారు.


 • విష్ణువు కూడా

  P.C: You Tube

  అదే విధంగా భ`గుమర్షి అత్తిరాలలో తపస్సు చేసి శ్రీహరిని మెప్పించాడు. ఆ మహర్షి కోరికమేరకు ఒక పాదాన్ని గయలో మరో పాదన్ని ఇక్కడ పెట్టాడు. అంతేకాకుండా ఇక్కడ శ్రీ గదాధర స్వామిగా వెలిశాడు. ఆ విధంగా ఇది శివకేశవుల క్షేత్రం అయ్యింది. ఇక్కడ ఉన్న బహుదానదిలో రక్త సంబంధీకులకు చేసే పిండ ప్రదానం, తర్పణం గయలో చేసిన వాటితో సమానమని చెబుతారు. అందువల్లే అత్తిరాలకు దక్షిణ గయ అన్న పేరు కూడా ఉంది.


 • శివరాత్రి రోజు

  P.C: You Tube

  ఒక పక్క జలజలా పారే బహుదా నది, చుట్టూ పచ్చటి మొక్కలతో కూడిన ఎతైన పర్వత శిఖరాలతో మనకు అత్తిరాల వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్కడ కొండమీద రాజగోపురం చేరుకోవడానికి మెట్లదారి ఉంది. ఇక్కడి త్రేతేశ్వరాస్వామి ఆలయంలో ఎతైన ప్రదేశంలో దీపారాధన చేస్తారు. ఇందు కోసం దాదాపు 15 అడుగుల ఎతైన ద్వీపస్తంభం ఉంది. ఈ వెలుగు రాజంపేటతో పాటు సుదూరాన ఉన్న ప్రాంతాలకు కూడా కనిపిస్తుంది. పూర్వం వెంకటగిరి రాజులు ఈ వెలుగుచూసే శివరాత్రి ఉపవాస దీక్షను విరమించేవారని చెబుతారు.


 • కిరీటం కలిగిన పరుశురాముడు

  P.C: You Tube

  గర్భాలయంలో త్రేతేశ్వరుడు మడమర ముఖంగా లింగరూపంలో ఉంటారు. ఇక్కడే శ్రీ కామాక్షి అమ్మవారికి వినాయకుడికి విడిగా చిన్న ఆలయాలను కూడా మనం చూడవచ్చు. గదాధర స్వామి కొంచెం ఎత్తైన పీఠం మీద స్థానక భంగిమలో కనిపిస్తారు. శ్రీ గదాధర స్వామి పేరుకు తగ్గట్టే శంఖు, చక్ర, గదాలను కలిగి అభయ ముద్రతో నయన మనోహరంగా దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న పరుశరామ ఆలయం చాలా పురాతనమైనది. పరుశురాముడు, శిఖ, గడ్డం, మీసాలతో, నారబట్టలతో ఉంటాడు. అయితే ఇక్కడ మాత్రమే పరుశురాముడు తలపైన కిరీటం, మెడలో ఆభరణాలు ధరించి ఉంటాడు. ఈ పరుశురామ దేవాలయం ప్రస్తుతం పురావస్తుశాఖ వారి ఆధీనంలో ఉంది.
భారత దేశంలో అత్యంత పురాతాన క్షేత్రాల్లో అత్తిరాల కూడా ఒకటి. దీని ప్రస్తావన మహాభారతంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ పరుశరాముడు కిరీటం, ఆభరణాలు కలిగి ఉంటారు. ఇటువంటి అరుదైన రూపం మనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణభారత దేశంలో మరెక్కడా కనిపించదు.

ఇక అత్తిరాల శివ, కేశవ క్షేత్రం. ఇక్కడ ఉన్నటు వంటి ఏకా తాతయ్య విగ్రహానికి మన తలను తాకిస్తే తలనొప్పి, పార్శ్వనొప్పి పోతుందని నమ్ముతారు. అందువల్లే చాల దూరం నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారు. అత్తిరాల కడప జిల్లా రాజంపేటకు ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడపకు 56 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు బస్సు మార్గాల ద్వారా సులభంగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇక ఈ క్షేత్రానికి సంబంధిచిన మరికొన్ని వివరాలు మీ కోసం....