Back
Home » సంబంధాలు
మీ భర్తకు ఉత్తమ భార్యగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే
Oneindia | 12th Jul, 2018 04:02 PM
 • పరిపూర్ణ భార్యకు పరిపూర్ణ చిట్కాలు:

  1. ముక్కుసూటిగా ఉండండి

  వినడానికి ప్రతికూలంగా కనిపించవచ్చు. కానీ ఈ విధానం మంచిది, మీరు ఏమనుకుంటున్నారో వివరించేందుకు ఉత్తమమైన మార్గమిది అని తెలుసుకోండి. పరిపూర్ణ భార్య ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో, తను కోరుకుంటున్న మార్పులను అడిగి సాధించుకోవడంలో ముందుగా ఉంటుంది. తగాదాలు వచ్చేలా అహంకార శైలిని జోడించకుండా, ఉన్నది ఉన్నట్లు చెప్పగల విధానాన్ని అలవరచుకోవడం మంచిది.


  మీరు అనుకున్న విషయాలను మీ భాగస్వామితో నేరుగా పంచుకోలేని ఎడల కాస్త అసౌకర్యానికి లోనవడం పరిపాటిగా మారుతుంది. క్రమంగా కొన్ని ప్రతికూలతలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున, ఏది ఏమైనా మీ భావాలను నేరుగా మీ భర్తతో పంచుకునేలా ఉండాలి.


 • 2. మంచి శ్రవణ నైపుణ్యాలు: ప్రతి మాటను క్షుణ్ణంగా వినండి

  మీరు మంచి సంభాషణ నైపుణ్యాలను కలిగి ఉండటం అవసరం. కానీ మీకు కావలసిన ముఖ్యమైన నైపుణ్యం వినడం. శ్రవణ నైపుణ్యాలు వివాహ సంబంధంలో అత్యంత ముఖ్యమైనది. మీ భాగస్వామి యొక్క సమస్యను అర్థం చేసుకునే క్రమంలో మంచి శ్రవణ నైపుణ్యాలు మీకు సహాయపడతాయి. మీరు పరిపూర్ణ భార్యగా ఉండే క్రమంలో మీకు సహాయపడే మరొకమార్గం ఇది.


 • 3. నిజాయితీగా ఉండండి:

  మీరు నిజాయితీగా ఉండటం చాలా అవసరం. మీ సంబంధాలను నిలబెట్టడంలో అన్నిటికన్నా ఉత్తమ మార్గం ఇదే. మీరు మీ భాగస్వామికి అబద్ధం చెప్పినట్లయితే, ఏరోజైనా మీరు చెప్పింది అబద్దం అని తెలిసినప్పుడు, మీపై అపనమ్మకం ఏర్పడడం సర్వసాధారణం. చిన్న చిన్న అబద్దాలే, పెద్ద పెద్ద తగాదాలకు కూడా దారితీయవచ్చు.

  మీ భాగస్వామి మీతో ఉండే విధానాన్ని అనుసరించి మీరు కూడా ఉండేలా ప్రయత్నించాలి. క్రమంగా మీ భర్త కూడా మీ మాటలకు విలువివ్వడం జరుగుతుంది. కొంతమంది చిన్ని చిన్ని విషయాలకు కూడా అబద్దాలు, కుంటిసాకులు చెప్పడం చేస్తుంటారు. ఇవి ఆక్షణంలో ఫలితాలను చూపించినా, నెమ్మదిగా మీపై అపనమ్మకాలకు దారితీస్తాయి. ఏదైనా మీ భర్తతో పంచుకునేలా ఉండాలి. అప్పుడే ఒక అర్ధవంతమైన సంబంధం ఏర్పడుతుంది.


 • 4. నమ్మకాన్ని కలిగించండి

  యదార్ధవాది లోక విరోధి అంటారు, కానీ దాంపత్యంలో యదార్ధవాదిగా ఉండడమే మీ పట్ల నమ్మకం ఏర్పడడానికి కారణమవుతుంది. ఇక్కడ లోకం మీ కుటుంబం. మీ కుటుంబం పట్ల మీరు ప్రదర్శించే నిబద్దత, విధేయత మీపై నమ్మకం ఏర్పడేందుకు సహకరిస్తుంది.

  ఒక ఆదర్శవంతమైన భార్యకు ప్రధాన ఆభరణాలు నమ్మకం, నిజాయితీ అని మరువకండి.

  మరియు దంపతుల మద్య విశ్వసనీయత ఉండాలి, ఏరోజైతే ఆ విశ్వసనీయతకు గండి పడుతుందో వాగ్వాదాలకు తావిచ్చినట్లే. కోర్టు మెట్లెక్కుతున్న అనేక దంపతుల గొడవలకు ప్రధాన కారణం విశ్వసనీయత లోపించడమే. కొందరు కోర్టు మెట్లు ఎక్కకపోయినా, జీవితాంతం ఒకరినొకరు నిందించుకుంటూ కాలం వెళ్ళదీస్తుంటారు.

  మీరు మీ భాగస్వామిని ఎంతగా అభిమానిస్తారో అంత విశ్వసనీయతను కలిగి ఉంటారు, క్రమంగా మీ భాగస్వామి నుండి కూడా ఆశించిన ప్రేమను పొందగలరు కూడా.

  కొన్ని వ్యసనాలు కూడా దాంపత్య జీవితానికి అవరోధాలుగా ఉంటాయి, మీమీద మరియు మీ మాట మీద నమ్మకం కలిగించుకోవడం ద్వారా మీ భర్త గౌరవాన్ని పొందగలరు. క్రమంగా మీరు కోరుకున్న మార్పులను కూడా మీ భాగస్వామిలో చూడగలరు.

  ఈ పైన చెప్పిన నాలుగు అంశాలు మీలో ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అంతకన్నా సంతోషం మరొకటి లేదు. కానీ సందర్భానుసారం తెలివితో కుటుంబాన్ని నడపగలిగే ఏ స్త్రీ కూడా ఆదర్శ గృహిణిగా నిలిచిపోతుంది.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక జీవన శైలి , ఆరోగ్య, ఆహార, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.
పెళ్లి చేసుకోవడం అంటే స్వాతంత్ర్యం కోల్పోవడం ఎన్నటికీ కాదు. ఒక భాద్యతను పంచుకోవడం. కానీ ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో లోపాలు, క్రమంగా మనస్పర్ధలు, చీటికీ మాటికీ గొడవలు మొదలైన అనేక అంశాల వలన కొన్ని పెళ్లి జంటలు కాళ్ళ పారాణి ఆరకముందే కోర్టు మెట్లను ఆశ్రయిస్తున్నాయి. ఒక పెళ్లిలో పురుషుడు ఎన్నో భాద్యతలతో సంబంధానికి సిద్దపడుతారు అంటారు, కానీ నిజానికి ఒక స్త్రీ అధిక భాద్యతలను కలిగి ఉంటుంది. ఒక కుటుంబం సంతోషంగా ఉంది అంటే, స్త్రీనే ప్రధాన కారణం. కావున ఉత్తమ భార్యగా ఉండే క్రమంలో భాగంగా ఈ వ్యాసం మీకు కొన్ని ఆలోచనలను అందివ్వగలదు.

నిజానికి ఒక వ్యక్తి యొక్క మనస్సును అర్థం చేసుకోవడం కష్టమని మీకు తెలుసు, అదేక్రమంలో సాధారణంగా మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిజానికి ఒక భార్యగా ఉండడమంత కష్టమైన పని మరొకటి లేదు అని అనేక మంది అభిప్రాయం కూడా. కానీ ఆత్మ గౌరవం ఉన్న ఏ స్త్రీ కూడా భార్యగా ఉన్న పక్షంలో అన్నిటికీ తలొగ్గి ఉండాలని కోరుకోదు. తప్పును ఎదిరిస్తుంది, మంచికి అండగా నిలబడుతుంది. భర్త అడుగుజాడలలో నడవాలని చెప్తుంటారు, కానీ భర్తే అస్తవ్యస్తంగా మార్గాన్ని నడుపుతుంటే? భర్తను కూడా దారిలో పెట్టాల్సిన భాద్యత భార్యకు ఉంటుంది. క్రమంగా పరిపూర్ణమైన భార్యగా, ఆదర్శ గృహిణిగా ఉండగలరు.

ఈ అంశంపై లోతుగా వెళ్ళడానికి ముందు, మీ గురించి మీరు అంచనాకు రావాలి. మీ భర్త మీతో ఎలా ఉంటున్నారు? మీ భర్తకు తగిన భార్యగా ఉండగలుగుతున్నారా? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ భర్త భాద్యతలలో మీ బాద్యత ఎంత? ఇలా అనేక ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండాలి. మీ భర్తకు మీరు ఉత్తమమైన భార్యగా కనిపించే ప్రక్రియలో మిమ్ములను మీరు కోల్పోనవసరం లేదు. మరియు ఆత్మగౌరవాన్ని చంపుకుని మారాల్సిన అవసరం కూడా లేదు.

మీభర్త దృష్టిలో పరిపూర్ణ భార్యగా మారడానికి, ఎప్పటికీ ప్రయత్నించకూడదు. మీ భర్త మీరెలా ఉన్నారో అలానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, తన ఇష్టానుసారం మార్చుకోవడానికి కాదు అని నిర్ధారించుకోండి. మీ భర్త ఆలోచనలో మీ స్థానం మీకు తెలిసినప్పుడు, ఇంకాస్త పరిపూర్ణత జోడించి నిబద్దతను ప్రదర్శించడం కూడా సంబంధాలను పటిష్టం చేయడంలో సహాయం చేస్తుంది. అవునా కాదా?

మీరు రోజువారీ జీవన ప్రాతిపదికన అనుసరించగల కొన్ని సాధారణ మరియు సులభమైన విషయాలు లేదా పద్దతులు ఉన్నాయి. ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మీ ఆలోచనా విధానాలకు ప్రేరణ ఇచ్చేలా సహాయపడగలవు. మీ దాంపత్య జీవితoలో పరిపూర్ణ భార్యగా ఉండేలా ఈ అంశాలు దోహదంచేయడమే కాకుండా, వ్యక్తిగా కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా కనిపించవచ్చు.

మీ భర్తకు ఉత్తమ భార్యగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ క్రింది చిట్కాలు మీకోసమే