Back
Home » విహారం
ఇక్కడ శివలింగం సాదారణంగా కనిపించదు, కనిపించిందో?
Native Planet | 12th Oct, 2018 09:55 AM
 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఆ వింతైన దేవాలయం కేరళలోని ప్రముఖ పట్టణమైన త్రిసూర్ లో ఉంది. త్రిసూర్ లో పెరియార్ నది, చలకుడి నది, కురుమలి నది, పున్నై తదితర ఎన్నో పుణ్యనదులు ఇక్కడ ప్రవహిస్తుంటాయి.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఈ నదుల్లో దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అందువల్లే కేరళకు గాడ్స్ ఓన్ కంట్రి అని పేరు. ఈ పవిత్రమైన నదులన్నీ తూర్పు కనుమల్లో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సమద్రంలో కలుస్తుంటాయి.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఇందులో చాలా నదులకు ఉపనదులు కూడా ఉన్నాయి. ఇక త్రిసూర్ లోనే భారతదేశ నయాగర జలపాతంగా పేరుగాంచిన అథిరపల్లి జలపాతాన్ని మనం చూడవచ్చు. ఇది అత్యంత రమణీయంగా ఉంటుంది.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఇక్కడికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక త్రిసూర్ చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. అంతేకాకుండా కేరళ ఆచార వ్యవహారాలకు ఈ త్రిసూర్ రాజధాని అని కూడా చెబుతారు.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ముఖ్యంగా కేరళ సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. మిగిలిన భారత దేశ రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్ర సంప్రదాయాలు విభిన్నత ఎక్కువ. అందుకు పురాణ ప్రాధాన్యత కలిగి ఉండటం కూడా ప్రధాన కారణం.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  కేరళలోని త్రిసూర్ జిల్లాలో ముఖ్యంగా మూడు ఆ పరమేశ్వరుడి దేవాలయాలు ఉన్నాయి. అవి వరుసగా వడక్కునాథ దేవాలయం, అశ్వకేశ్వర శివాలయం, ఇరత్తవీర శివాలయం. ఈ మూడు శివాలయాల వల్లే త్రిసూర్ కు ఆ పేరు వచ్చినట్లు చెబుతారు.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  తిరు-శివ-పరూర్ అనే పేర్ల కలయిక వల్లే త్రిసూర్ అనే పేరువచ్చినట్టు కథనం. అంటే మూడు శివాలయాలు కలిగిన ప్రాంతం అని అర్థం. ఇక మూడు శివాలయాల్లో వడక్కునాథ దేవాలయం విభిన్నమైనది.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఇక్కడ ఉన్న శివలింగానికి వేల సంవత్సరాలుగా నేతితో అభిషేకం చేయడం వల్ల శివలింగం పూర్తిగా మూసుకుపోయింది. ఇక ఆ నేయి గడ్డకట్టుకు పోయింది. దీంతో శివలింగం చూడటానికి ఒక గుడ్డు వలే కనిపిస్తుంది.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఈ శివలింగం ఎత్తు సుమారు 5 మీటర్లు. అయితే కొంతమంది స్థానికుల కథనం మేరకు ఈ ఆ తెల్లటి గుడ్డు అడుగు భాగంలో శివలింగం ఉందని అది అందరికీ కనిపించదని చెబుతారు.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  వందల ఏళ్లకు ఒకసారి మాత్రం ఆ నెయ్యి కరిగి ఒక్క క్షణం పాటు అది కూడా కొంతమందికి మాత్రమే శివలింగం కనిపిస్తుందని చెబుతారు. అలా ఆ క్షణంలో శివలింగం చూసినవారికి మోక్షం ఖచ్చితమని స్థానికుల నమ్మకం.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  అంతేకాకుండా ఈ దేవాలయం లోపలికి ఏడాది కంటే తక్కువ వయస్సున్న పిల్లలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక డ్రస్ కోడ్ తప్పనిసరి.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  శివరాత్రి పర్వదినాన ఈ దేవాలయం విద్యుత్ దీప కాంతితో అలరారుతూ ఉంటుంది. ఆ సమయంలో విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి వచ్చిన విదేశీయులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ప్రపంచంలో శివలింగం కనబడకపోయినా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకొనేది ఇక్కడ మాత్రమే. ప్రపంచలో ఇటువంటి దేవాలయం మరొక్కటి లేదు. అందువల్లే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  త్రిసూర్ దేవాలయాన్ని క్రీస్తుశకం 9 నుంచి 12 శతాబ్ద మధ్య కాలంలో కులశేఖర వర్మ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ త్రిసూర్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోనే గురువాయూర్ అనే ప్రాంతంలో ప్రఖ్యాతి చెందిన ఆ నల్లనయ్య దేవాలయం ఉంది.


 • వడక్కునాథ దేవాలయం, కేరళ

  P.C: You Tube

  ఇక త్రిసూర్ లోనే జామా మసీదు ఉంది. ఇది ప్రపంచంలోనే మదీన తర్వాత హిందూ దేవాలయాల శైలి వాస్తును వినియోగించి నిర్మించిన మసీదు అని చెబుతారు. ఈ మసీదును చూడటానికి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
శివాలయం అంటే శివలింగం, లేదా పరమేశ్వరుడు మూలవిరాట్టుగా ఉండటం. అయితే కేరళలోని ఒక శివాలయంలో మాత్రం శివలింగం ఉన్నా మన కంటికి కనిపించదు. అయితే కేవలం పుణ్యాత్ములకు మాత్రం ఆ శివలింగం కనిపిస్తుందని చెబుతారు. ఒక వేళ ఆ శివలింగం ఎవరికైతే కనిపిస్తుందో వారికి మోక్షం ఖచ్చితమని స్థానికుల నమ్మకం. అందుకే దేశ విదేశాల నుంచి ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అటువంటి వింతైన దేవాలయానికి సంబంధించిన వివరాలతో పాటు చుట్టు పక్కల ఉన్న కొన్ని పర్యాటక కేంద్రాల వివరాలు మీ కోసం...

ప్రధాని నరేంద్రమోదీ ప్రశ్నలకు సమాధానం చెప్పిన దేవత ఇక్కడే