Back
Home » విహారం
ఈ దేవత మోదీ సందేహాలను తీర్చిందంటా?
Native Planet | 12th Oct, 2018 09:58 AM
 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో ఉన్నారు. బెంగళూరు నుంచి తుమకూరుకు 72 కిలోమీటర్లు కాగా తుమకూరు నుంచి తిపటూరుకు 74 కిలోమీటర్లు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  సమస్యల్లో ఉన్నవారికి ఇక్కడికి వెళితే తప్పకుండా పరిహారం దొరుకుతుందని చెబుతారు. ఈ దేవాలయంలోని అమ్మవారు అత్యంత మహిమాన్వితులని చెబుతారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఇక్కడకు కర్నాటక, భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తమ ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి ఇక్కడికి వస్తుంటారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  చౌడేశ్వరి దేవి దేవాలయంలో తమ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలనుకొన్నవారు ప్రత్యేక టికెట్ తీసుకొని దేవాలయ ప్రాంగణంలో కుర్చోవాల్సి ఉంటుంది.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని ఒక బియ్యపు పళ్లెంప పై ఉంచుతారు. అటు పై ప్రశ్నను ఓ కాగితం పై రాసి ఆ కాగితాన్ని పంచలోహ విగ్రమం పై ఉంచుతారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  అటు పై పూజారులు కళ్లుమూసుకొని ఆ దేవతను ప్రార్థిస్తారు. అదే సమయంలో ఒక కళశాన్ని ఆ బియ్యం పళ్లం పై తిప్పుతారు. అప్పుడు అక్కడ అక్షరాలు ఏర్పడుతాయి.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఆ అక్షరాలును బట్టి వారి సమస్యకు ఆ దేవత ఏ సమాధానం చెప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమాధానం ఆకలశం ద్వారా దేవతే చెప్పించిందని భక్తుల విశ్వాసం.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్ల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి తన సమస్యలకు సరైన సమాధానం తెలుసుకొని వెళ్లాడని స్థానికులు చెబుతుంటారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ముఖ్యంగా తాను ప్రధాని అవుతానో లేదో తెలుసుకొని వెళ్లాడని చెబుతుంటారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడకు రావచ్చునని చెబుతున్నారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఇక్కడికి వచ్చిన భక్తులు తమ ప్రశ్నలను కన్నడ, ఆంగ్లం, హింది, కొంకణి, తెలుగు తదితర ఏ భాషలో అడిగినా కూడా చౌడేశ్వరీ దేవి కన్నడలోనే సమాధానం చెబుతారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఈ దేవాలయానికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. వందల ఏళ్ల క్రితం కర్నాటకలోని రాయచూరు జిల్లాలో తుంగా నదీ తీరంలో నంద అనే సామ్రాజ్యం ఉండేది.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఈ సామాజ్యాన్ని పరిపాలించే రాజు శక్తి దేవతలను పూజించేవాడు. దీంతో అనేక మంత్ర తంత్ర శక్తులు కూడా ఆ రాజుకు తెలిసి ఉండేవి. దీంతో తనకున్న మంత్ర శక్తితో ఎంతో దూరంలో ఉన్న కాశీకి తెల్లవారుజాము నాలుగు గంటలకే వెళ్లేవాడు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  అక్కడ స్నానం చేసి మరలా తిరిగి రాజ్యానికి చేరుకొనేవాడు. ప్రతి రోజు తనకు తెలియకుండా రాజు ఎక్కడికి వెలుతున్నాడో అని అతని భార్య అనుమానం పడుతుంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో రాజు తాను నిత్యం ఎక్కడికి వెలుతుండేది చెబుతుంది.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  దీంతో ఈ విషయాన్ని నమ్మని రాణి తాను మీరు కాశీకి వెలుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతానని పట్టుపడుతుంది. దీంతో రాజు విధిలేని పరిస్థితుల్లో రాణిని మరుసటి రోజు కాశీకి తీసుకువెలుతాడు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఇలా ఇద్దరూ కాశీలో ఉన్నప్పుడు రాణికి రుతుచక్రం వస్తుంది. దీంతో రాజు తన మంత్ర శక్తులన్నీ కోల్పోతాడు. దీంతో గంగా నది ఒడ్డున కుర్చొని చింతిస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మణులు విషయాన్ని తెలుసుకొని చండీయాగం చేసి రాణిని పవిత్రురాలుని చేస్తారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  అదే సమయంలో రాజు ముందు తమ మనస్సులో ఉన్న ఒక కోరికను బయటపెడుతారు. దాని ప్రకారం వారు కోరినప్పుడు రాజ్యంలో కొంత భూమిని వారికి ఇస్తానని మాట ఇస్తారు. అటు పై రాణి, రాజు ఇద్దరూ రాజ్యానికి తిరిగి వస్తారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  ఒక సమయంలో కాశీలో తీవ్ర క్షామం ఏర్పడుతుంది. దీంతో బ్రహ్మణులు రాజు వద్దకు వచ్చి వారి గతంలో కోరిన విధంగా భూమితోపాటు కొంత ధనం, దాన్యం ఇవ్వాల్సిందిగా కోరుతారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  అయితే గతాన్ని మరిచిపోయినరాజు వారి కోర్కెను మన్నించక పోగా వారిని నిందిస్తాడు. దీంతో బ్రహ్మణులు కాశీలో తమ ఒప్పందానికి సాక్షిగా ఉన్న చౌడేశ్వరీ దేవిని నంద రాజ్యానికి రావాల్సిందిగా కోరుతారు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  దీంతో చౌడేశ్వరీ దేవి ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. దీంతో రాజుకు తన తప్పు తెలిసి వస్తుంది. అటు పై బ్రహ్మణులకు మాట ఇచ్చినట్లు భూమితో పాటు బంగారం, వెండి, ధాన్యం కూడా ఇస్తాడు.


 • దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి

  P.C: You Tube

  అటు పై అమ్మవారిని ఇక్కడే ఉండమని చెప్పి ఆమెను ఆరాధించడం మొదలుపెడుతారు. అలా అమ్మవారు ఇక్కడ వెలిసారు. మామూలు రోజుల కంటే మంగళ శుక్రవారాల్లో ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.
దేవుడు, దెయ్యం అన్నది వారి వారి నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. అయితే మానవ నైజం ప్రకారం మనుష్యులకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకు వస్తారు. ఆ దేవుడి దగ్గరకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకొంటే పరిహారం దొరుకుతుందని చెబుతారు. సాధారణంగా దేవుడి గుడికి వెళ్లి మనం కష్టాలను చెప్పుకొని వెనుతిరుగుతాం. అయితే ఇక్కడ ఒక దేవాలయంలో మాత్రం మన సమస్యలకు, మన ప్రశ్నలకు అమ్మవారు నేరుగా జవాబు చెబుతారు. ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం....