Back
Home » విహారం
సముద్రంలోపలి ప్రపంచం చూడాలా?
Native Planet | 16th Oct, 2018 10:32 AM
 • హ్యావ్లాక్ ద్వీపం, అండమాన్ నికోబార్

  P.C: You Tube

  తెల్లటి ఇసుక తెన్నులు, చుట్టూ కనుచూపుమేరలో నీలం రంగుతో మెరిసిపోతే సముద్ర తీరం ఒక్కమాటలో చెప్పాలంటే ఇది హ్యావ్లాక్ ద్వీపం స్వరూపం. దాదాపు 113 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ హ్యావ్లాక్ ద్వీపం అండమాన్ నికోబర్ ద్వీప సముదాయంలో ఒకటి.

  బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..


 • బ్రిటీష్ జనరల్ పేరు

  P.C: You Tube

  ఈ హ్యావ్లాక్ ద్వీపం పోర్ట్ బ్లెయిర్ నుంచి దాదాపు 39 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బ్రిటీష్ జనరల్ సర్ హెన్రీ హావ్లాక్ పేరు పై ఈ ద్వీపానికి హ్లావ్లాక్ ద్వీపం అని పేరు పెట్టారు. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ఆయన విశేష సేవలు అందించారు.


 • భారతీయుడి పేరు

  P.C: You Tube

  అదే విధంగా 1857 సిపాయుల తిరుగుబాటు సమయంలో ఆయన బ్రిటీష్ సైన్యానికి న్యాయకత్వం వహించారు. ప్రస్తుతం ఈ ద్వాపానికీ భారతీయ ప్రముఖుడి పేరు పెట్టాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. హ్వావ్లాక్ ద్వీపం ఒక విశిష్టతతో కూడుకున్నది.

  హిమాలయాలలో ఇప్పటికీ రహస్యంగానే వున్న టవర్స్


 • దాగుడు మూతలు

  P.C: You Tube

  ఇక్కడి సముద్రంలోని నీటిమట్టం ఉదయం పూట తక్కువగా ఉంటుంది. అయితే మధ్యహ్నం సమయానికి కొంత పెరిగి సాయంత్రం పూట ఎక్కువవుతుంది. సూర్య, చంద్రుల ఆకర్షణ ఫలితంగా ఈ విధంగా ఏర్పడుతుందని చెబుతారు.


 • బీచ్ నం 7

  P.C: You Tube

  ఇక పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న రాధానగర్ బీచ్ ను 7 బీచ్ అని పిలుస్తారు. హ్యావ్లాక్ ద్వీపంలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ద్వీపాల్లో దీనిదే మొదటిస్థానం. ఆసియాలో అత్యుత్తమ బీచ్ లో ఒకటిగా 2004లో ఈ బీచ్ ఎంపికయ్యింది.

  ఈ శ్రీ కృష్ణుని దేవాలయానికి కానీ పొరపాటున కానీ వెళితే మరణం ఖచ్చితం...


 • ఇంకా ఎన్నో బీచ్ లు

  P.C: You Tube

  అంతేకాకుండా ఈ ద్వీపానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న ఎలిఫెంటా బీచ్, తూర్పు భాగంలో ఉన్న విజయనగర బీచ్ దీనిని బీచ్ నంబర్ 5 అని కూడా పిలుస్తారు. అదే విధంగా బీచ్ నంబర్ 3, బీచ్ నం 1 లు కూడా అత్యంత ప్రజాధరణ పొందాయి.


 • గేట్ వే

  P.C: You Tube

  వీటితో పాటు కాలాపత్తర్ బీచ్ కూడా చూడదగినది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవుల పాలనపరమైన రాజధాని. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలోని తూర్పు తీరంలో ఉంది. పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ ద్వీపాలకు గేట్ వే అనే పేరును సంపాదించుకొంది.


 • జలక్రీడలు

  P.C: You Tube

  పోర్ట్ బ్లెయిర్ కూడా ద్వీప పట్టణం. ఇక్కడ సైక్లింగ్, స్కూబా డైవింగ్, సముద్రపు క్రూజర్, వంటి ఎన్నో జలక్రీడలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక అండమాన్ నికోబర్ సముద్రపు వంటకాల రుచులను అందించే ఎన్నో రెస్టోరెంట్లు, హోటల్స్ ఉన్న అబర్డీన్ బజార్ చూడదగినదే.


 • అబర్డీన్ బజార్

  P.C: You Tube

  ప్రధాన బస్ స్టాప్ కూడా ఈ అబర్డీన్ బజార్ కు 4 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశలో ఉన్నాయి. అదే విధంగా విమానాశ్రయం కూడా ఈ అబర్డీన్ బజార్ కు దగ్గర్లోనే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత అందమైన ప్రకృతి అద్భుతాల్లో బయోలమినైసెన్స్ కూడా విభిన్నమైనది.


 • బయోలమినైసెన్స్

  P.C: You Tube

  ఈ అద్భుతమైన ఆవిష్కరణ నీటిలోపల చలించే నీలి రంగులోని చిన్న జీవుల వల్ల ఇది ఏర్పడుతుంది. చంద్రుడు భూమికి అత్యతం దగ్గరగా ఉన్నప్పుడు ఈ బయోలమినైసెన్స్ ను బాగా చూడటానికి వీలవుతుంది.


 • కయాకింగ్

  P.C: You Tube

  అండమాన్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్ తో పోలిస్తే హ్యావ్లాక్ ద్వీపం పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. అందువల్ల మీ పర్యాటకాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. రాత్రి సమయంలో ఇక్కడ కయాకింగ్ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

  విమాన ప్రయాణంలో ఖచ్చితంగా చేయకూడని పనులు


 • రాత్రి బస అక్కడే

  P.C: You Tube

  పెడలింగ్ చేస్తూ ఆకాశంలోని నక్షత్రాల ప్రతిబింబాలను నీటి పై చూస్తూ అలా ముందుకు సాగిపోవడం ఎవరికైనా అందులేని ఆనందాన్ని కలిగిస్తుంది. అందుల్లే ఈ ద్వీపానికి వెళ్లినవారు రాత్రి సమయంలో ఇక్కడ బసచేసి బోటింగ్ చేయడానికి ఇష్టపడుతారు.

  బెంగళూరు లో ఇటువంటి ప్రదేశాన్ని చూసారా ?
హావ్లాక్ ద్వీపం. స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలను ఇష్టపడేవారికి ఈ ప్రాంతం స్వర్గధామం. అండమాన్ నికోబార్ ద్వీపాల సముద్రంలో ఇది కూడా ఒక ద్వీపం. పోర్ట్ బ్లెయిర్ తో పోలిస్తే రద్దీ తక్కువగానే ఉంటుంది. ఇక ఇక్కడ సముద్రనీరు మీతో దాగుడుమూతలు ఆడుతుంది. ఈ విశేషాలన్నింటికి సంబంధించిన కథనం మీ కోసం...