Back
Home » ഏറ്റവും പുതിയ
వన్‌ప్లస్ 6టీలో ఆ 5 ఫీచర్లు అదుర్స్!
Gizbot | 12th Oct, 2018 12:00 PM
 • స్ర్కీన్ అన్‌లాక్

  వన్‌ప్లస్ తన లేటెస్ట్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్ లాక్ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau అఫీషియల్ కన్ఫర్మ్ చేసారు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఓ టీజర్‌ను కూడా వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ 5 సెకన్ల వీడియోలో ఫోన్‌లోని ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా మరింత లోతుగా రివీల్ చేసే ప్రయత్నం చేసారు. వన్‌ప్లస్ తన ఫ్యూచరిస్టిక్ స్ర్కీన్ అన్‌లాక్ టెక్నాలజీ పై అనేక నెలలపాటు శ్రమించింది. దీంతో ఫోన్ అన్‌లాక్ సమయాన్ని మిల్లీ సెకన్లలోకి తీసుకురాగలిగింది.

  వన్‌ప్లస్ తన 6టీ ద్వారా ప్రపంచానికి పరిచయం కాబోతోన్న ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ రెగ్యులర్ బయోమెట్రిక్ స్కానర్స్‌తో పోలిస్తే మరింత అప్‌డేటెడ్‌గా ఉండటంతో పాటు మరింత యూక్యురేట్‌గా స్పందించగలుగుతుందట. ఈ టెక్నాలజీ ఒక సింగిల్ మాడ్యుల్‌గానే కాకుండా ఫోన్‌లోని ఇతర విభాగాలను కలపుకుని ముందుకు సాగుతుందట. యూజర్‌కు సంబంధించిన ఫింగర్ ప్రింట్ సమాచారాన్ని స్టోర్ చేసే క్రమంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌లోని 'Trust Zone' అనే డెడికేటెడ్ సాంకేతికతను వన్‌ప్లస్ ఇంజినీర్లు ఉపయోగించినట్లు తెలిసింది.

  ఈ ట్రస్ట్ జోన్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వర్చువల్ స్పేస్ యూజర్ ఫింగర్ ప్రింట్ డేటాకు పూర్తిస్థాయి భద్రతను కల్పిస్తుంది. యూజర్ వన్‌ప్లస్ 6టీ డిస్‌ప్లే పై చేతి వేలును ఉంచిన వెంటనే సెన్సార్స్ ఆ డేటాను రికార్డ్ చేసి అప్పటికే ట్రస్ట్ జోన్‌లో రికార్డ్ అయి ఉన్న డేటాతో పోల్చి చూస్తాయి. ఆ రెండు డేటాలు మ్యాచ్ అయితేనే అన్‌లాక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.


 • వేగవంతమైన డాష్ ఛార్జింగ్

  వన్‌ప్లస్ 6తో పోలిస్తే వన్‌ప్లస్ 6టీ పెద్దదైనా ఇంకా శక్తివంతమైన బ్యాటరీతో రాబోతోంది. ఇదే సమయంలో డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మరింతగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టమవుతోంది. బ్యాటరీ పనితీరు విషయంలో ఇప్పటికే మంచి రెప్యుటేషన్‌ను సొంతం చేసుకున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు భవిష్యత్‌లోనూ ఇదే విధమైన ట్రెండ్ ను కొనసాగిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.


 • ఆండ్రాయిడ్ (Android Pie) ఆపరేటింగ్ సిస్టం

  సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ, Android Pie అవుట్-ఆఫ్-బాక్స్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఈ అప్‌డేట్‌ను ఆక్సిజన్ ఓఎస్ స్కిన్‌తో వన్‌ప్లస్ అందించబోతోంది. ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టంతో భారత్‌లో లాంచ్ కాబోతోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ చరిత్రసృష్టించబోతోంది. ఈ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది. Android Pie అప్‌డేట్‌తో కూడిన ఆక్సిజన్ ఓఎస్ 9.0 స్కిన్ వన్‌ప్లస్ 6కు కూడా లభించబోతోంది.


 • సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

  వన్‌ప్లస్ 6టీ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ బీజిల్-లెస్ అమోల్డ్ డిస్‌ప్లేలో కలర్ రిప్రొడక్షన్‌తో పాటు వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ముఖ్యంగా గేమ్స్ అలానే మల్టీ టాస్కింగ్ సమయంలో డిస్‌ప్లే ఆఫర్ చేసే ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు యూజర్లు మంత్రముగ్థులవటం ఖాయం. డిస్‌ప్లే పై ఏర్పాటు చేసిన వాటర్ డ్రాప్‌లెట్ నాట్చ్‌లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హౌస్ అయి ఉంటుంది.


 • టైప్-సీ వన్‌ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్

  వన్ ప్లస్ తన 6టీ డివైస్ తో పాటుగా యూఎస్బీ టైప్-సీ సపోర్టుతో కూడిన బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. . ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌లో ఫెర్ఫామెన్స్, బ్యాటరీ‌లైఫ్ ఇంకా సోనిక్ సిగ్నేచర్ మరింత అప్‌డేటెడ్‌గా ఉండనున్నాయని సమాచారం. బీటీ32బీ అనే మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోన్న ఈ విప్లవాత్మక ఇయర్‌ఫోన్స్ ధర ఇండియన్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు అనేది తెలియాల్సి ఉంది.
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ క్వాలిటీ ఫోన్‌లను అందిస్తూ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మేకర్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్, OnePlus 6T పేరిట మరో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అక్టోబర్ 30వ తేదీన లాంచ్ కాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ ఫోన్‌లో ఎక్విప్ అయి ఉన్న స్పెసిఫికేషన్స్‌ కొన్ని అఫీషియల్‌గా వెల్లడవటంతో మార్కెట్ డిమాండ్ మరింత పెరిగినట్లయ్యింది.

అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా వన్‌ప్లస్ 6టీ ప్రీ-బుకింగ్స్‌ను అమెజాన్చ అఫీషియల్‌గా ప్రారంభించింది. సేల్ స్టార్ట్ అయిన 36 గంటల్లోపే రూ.400 కోట్లు ఖరీదు చేసే వన్‌ప్లస్ 6 ప్రీ-ఆర్డర్స్ తమకు లభించాయని అమెజాన్ తెలిపింది. వన్‌ప్లస్ చివరి ఫోన్ అయిన వన్‌ప్లస్ 6 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయి 5 నెలల కావొస్తోంది.

అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6 రికార్డ్ నెలకొల్పింది. ఇన్ని పాజిటివ్ రిజల్ట్స్ మధ్య మార్కెట్లోకి అడుగుపెట్టబోతోన్న వన్‌ప్లస్ 6టీ మరో మర్కెట్ వండర్‌గా నిలవటం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తు్నారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా వన్‌ప్లస్ 6టీని మరో మాస్టర్ పీస్‌గా నిలబెట్టిన 5 స్పెషల్ ఫీచర్స వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం....