Back
Home » విహారం
సాయి జీవసమాధి చెందినది ఎప్పుడో తెలుసో
Native Planet | 13th Oct, 2018 08:19 PM
 • ఔరంగాబాద్

  P.C: You Tube

  మొఘల్ చక్రవర్తి దీనిని పాలనా కేంద్రంగా చేసుకొని దక్షిణాది వ్యవహారాలను చూసేవారు. అందుకే దీనికి ఔరంగాబాద్ అని పేరు వచ్చింది. ఈ ఔరంగా బాద్ షిర్డీ నుంచి 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చూడాల్సినవాటిలో బీబీ కా మాక్బరా, దౌలతాబాద్ కోట ముఖ్యమైనవి. బీబీ కా మాక్బరా ను దక్కన్ తాజ్ మహల్ అని కూడా అంటారు.


 • అజంతా ఎల్లోరా

  P.C: You Tube

  ఇది ఔరంగాబాద్ భార్య రబియా దురానీ సమాధి. ఔరంగాబాద్ సమీపంలో ప్రఖ్యాత అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి. ఇందులో అజంతా 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఎల్లోరా 32 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కొండలను తొలిచి నిర్మించిన దేవాలయాలు, అద్భుత శిల్పకలకు, కడ్య చిత్రాలకు ఈ అజంతా ఎల్లోరాలు ప్రతీకలు.


 • ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

  P.C: You Tube

  అంతేకాకుండా ఇక్కడ హిందు ధర్మంతో పాటు బౌద్ధ, జైన మతాల ఆనవాళ్లు కూడా కనిపించడం విశేషం. ఈ ఔరంగాబద్ కు దగ్గర్లో అంటే 58 కిలోమీటర్ల దూరంలో ఘ`ష్ణేశ్వర్ అనే శైవ క్షేత్రం కూడా ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం డిల్లీ సుల్తానుల దాడిలో ధ్వంసం కాగా ఈ ఆలయాన్ని తిరిగి 18 వశతాబ్దంలో పునరుద్ధరించారు.


 • సాయి సమాధి

  P.C: You Tube

  ఇక షిరిడీ టూర్ లో ప్రముఖమైనది షిరిడిలోని సాయినాధుని సన్నిధాన దర్శనం. 100 ఏళ్ల క్రితం ఆ సాయినాధుడు దసరా రోజునే మహాసమాధి చెందారని చెబుతారు. అందువల్లే విజయదశమి రోజున షిరిడీలోని ఆయన సమాధిని దర్శించుకోవడం పుణ్యఫలమని చెబుతూ ఎక్కువ మంది అక్కడికి వెలుతుంటారు.

  ఈ దేవత వల్లే ధోనికి ఇంతటి పేరు


 • వందేళ్లు

  P.C: You Tube

  కాగా, ఆయన మహాసమాధి చెందిన రానున్న దసరాకు వందేళ్లు పూర్తవుతాయి. అందుకే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది అక్కడకు చేరుకోవడానికి ఇప్పటికే సిద్ధమయిపోతున్నారు. ఇక ఈ షిరిడీలో ఆయన శతాబ్ధి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. కేవలం బాబా సమాధి దర్శనంతో షిరడీ యాత్ర పూర్తి కాదు.

  ఆకాశ వీధిలో ప్యారగ్లైడింగ్ చేస్తారా


 • ఖండోబా దేవాలయం

  P.C: You Tube

  బాబాను తొలిసారి సాయి అని పిలిచిన మహల్సాపతి అర్చకత్వం వహించిన ఖండోబా దేవాలయం, సాయి స్వయంగా పెంచిన పూదోట లెండీ వనం, బాబా నివాసమున్న ద్వారకామయి మసీదు, బాబా చావడీ ఎలా ఎన్నో స్థలాలు ఇప్పుడు పర్యాటక స్థలాలుగా ఉన్నాయి.


 • రవాణా సదుపాయం

  P.C: You Tube

  అదే విధంగా సాయి హెరిటేజ్ విలేజ్ లో బాబా జీవితంలోని ముఖ్య ఘట్టాలను శిల్పాల రూపంలో చూడవచ్చు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి నేరుగా షిరిడీకి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.


 • శని శింగణాపూర్

  P.C: You Tube

  షిరిడీ యాత్రలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసే క్షేత్రం శని శింగణాపూర్. శనైశ్చరుడు స్వయంభువుగా వెలిసిన ఈ శని శింగణాపూర్ షిరడీ నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిరిడీ నుంచి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రానుపోను ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.350 తీసుకొంటారు.


 • దొంగతనాలే జరగవు

  P.C: You Tube

  ఇక్కడి శనైశ్చరుడికి తైలాభిషేకం నిర్వహించడం వల్ల శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ గ్రామంలోని ఇళ్లకు ఎటువంటి ద్వారాలు ఉండవు. శనిదేవుడి మహిమ కారణంగా ఇక్కడ ఇళ్లకు ద్వారాలు లేకపోయినా ఇప్పటి వరకూ దొంగతనాలు జరగలేదని చెబుతారు.


 • షిరిడీ పర్యటనలో మరో మజిలీ నాసిక్

  P.C: You Tube

  గ్రేప్ సిటీగా కూడా నాసిక్ కు పేరు. షిరిడీ నుంచి 86 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంటుంది. నాసిక్ చుట్టూ చరిత్రతో పాటు పురాణ కథలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడనీ అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చినట్లు చెబుతారు.


 • పంచవటి

  P.C: You Tube

  ఈ పట్టణంలోని పంచవటి ప్రముఖ పర్యాటక కేంద్రం. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఇక్కడే ఉన్నారని స్థలపురాణం చెబుతుంది. ఇక్కడ ఉన్న సీతా గుఫా లేదా సీతా గుహ ప్రాంతంలోనే రావణుడు సీతను అపహరించినట్లు చెబుతారు. ఇక కాలారామ్ ఆలయం కూడా చూసి తీరాల్సిన దేవాలయం.


 • రాక్ క్లైంబింగ్ ఈవెంట్లు కూడా

  P.C: You Tube

  అదే విధంగా పట్టణంలో ముక్తిధామ్ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు. నాసిక్ కు 10 కిలోమీటర్ల దూరంలో పాండవ గుహలు కూడా ఉన్నాయి. వీటిలో బౌద్ధం, జైన మతాలకు చెందిన శిల్పాలకు కూడా చూడవచ్చు. రాక్ క్లైంబింగ్ ఈవెంట్లు జరుగుతుంటాయి.


 • గోవారి పుట్టేది ఇక్కడే

  P.C: You Tube

  నాసిక్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకం వస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఆలయ నిర్మాణశైలి చాలా బాగుంటుంది. ఇక గోదవారి జన్మించేది కూడా ఇక్కడే.

  ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు


 • గోముఖం నుంచి

  P.C: You Tube

  గోముఖం నుంచి ఉద్భవించిన గోదవారి మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. త్రయంబక్ పర్యాటనకు వచ్చిన సాహసయాత్రికుల్లో చాలా మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఇలా షిరిడీ పర్యటనతో మొత్తం ముగుస్తుంది.
దసరా సెలవులు ఇప్పటికే ఇచ్చేశారు. దీంతో చాలా మంది టూర్ ప్లాన్ చేసుకొని ఉంటారు. అటు ఆధ్యాత్మికంగా ఇటూ ఆహ్లాదకరంగా ఉండే మార్గాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలను చూసి రావాలనుకొనేవారికి షిర్డీ టూర్ ప్యాకేజ్ సరిగా సరిపోతుంది. అన్నట్టు ప్రతి ఏడాది విజయదశమి రోజునే షిర్డీని చాలా మంది దర్శిస్తుంటారు? అలా దర్శించడం వెనుక ఉన్న కారణం ఏమిటన్న విషయంతో పాటు షిర్డీ చుట్టూ ఉన్నా పర్యాటక ప్రాంతాల గురించిన పూర్తి వివరాలు మీ కోసం...