Back
Home » విహారం
దయ్యాల హోటల్స్ చూశారా?
Native Planet | 15th Oct, 2018 09:46 AM
 • బ్రిజ్ భవన్, కోట, రాజస్థాన్

  P.C: You Tube

  రాజస్థాన్ లోని అత్యంత అంతమైన హోటల్ ఇది. ఈ భవనం నిర్మించి దాదాపు 250 ఏళ్లు. మొదట్లో ఈ భవనంలో రాజ కుటుంబీకులు నివశించేవారు. అటు పై ఇది బ్రిటీష్ పాలకుల పరమయ్యింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో మేజర్ బర్టన్ ఇక్కడ ఉండేవాడు. ఈ క్రమంలో ఆయన సిపాయిల చేతిలో హత్య గావించబడ్డాడు.


 • పర్యాటకులకు కూడా

  P.C: You Tube

  అప్పటి నుంచి ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉందని చెబుతారు. ఇప్పటికీ అక్కడ పనిచేసేవారితో పాటు అప్పుడప్పుడు పర్యాటకులకు కూడా ఆ ఆత్మకనిపిస్తుందంట. అయితే వారిని ఏమి చెయ్యక అలా ముందుకు వెళ్లిపోతుందని చెబుతారు. అంతేకాదు పనిచేసేవారికి ఆ పనిచెయ్యి , ఈ పని చెయ్యి అని ఆర్డర్ కూడా వేస్తుంటారు ఈ మాజీ మేజర్.


 • తాజ్, ముంబై

  P.C: You Tube

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముంబైలోని హోటల్ తాజ్ లో కూడా దెయ్యాలు ఉన్నాయంటే కొంత నమ్మడం కష్టమే. ఈ హోటల్ ను ఫ్రెంచ్ ఆర్కిటెక్షర్ డబ్లూ ఏ ఛేంబర్స్ డిజైన్ చేశాడు. అటు పై వారు ఇంగ్లాడ్ పర్యాటన ముగించుకొని తిరిగి వచ్చి తర్వాత ఈ హోటల్ ను చూసి షాక్ అయ్యాడు.


 • ఆయనే దయ్యమయ్యి

  P.C: You Tube

  తానిచ్చిన డిజైన్ లో కాకుండా అందులో మార్పులు చేసి ఈ హోటల్ ను నిర్మించారన్నది ఆయన ఆరోపణ. దీంతో ఇదే హోటల్ ఐదో అంతస్తు నుంచి ఆయన కిందికి దుమికి ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పటి నుంచి ఆయన ఆత్మ అదే హోటల్ లో తిరుగుతూ ఉందని చెబుతారు.


 • హోటల్ సవాయి

  P.C: You Tube

  ప్రముఖ పర్యాటక నగరం ముస్సోరిలో ని హోటల్ సవాయ్ లో చాలా కాలం క్రితం ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెకు విషం ఇచ్చి చంపించారన్నది ప్రధాన ఆరోపణ. ఆమె చనిపోయినప్పటి నుంచి ఆమె ఆత్మ ప్రేతాత్మగా మారి ఇదే హోటల్ లో తిరుగుతూ ఉందని చెబుతారు.


 • ఆ వైద్యులు

  P.C: You Tube
  అటు పై కొన్నేళ్ల తర్వాత ఆమెకు గతంలో చికిత్సఅందించిన వైద్యులు కూడా అదే హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇప్పటికీ రాత్రి సమయంలో ఆ హోటల్ లో నిద్రించిన వారికి కొన్ని విచిత్ర శబ్దాలు తరుచుగా వినిపిస్తుంటాయని చెబుతారు. అయితే పర్యాటకుల్లో ఇప్పటికీ ఒక్కరికీ హాని కలగకపోవడం గమనార్హం.


 • ఫర్న్ హిల్, ఊటి

  P.C: You Tube

  దక్షిణ భారత దేశంలోనే కాకుండా భారత దేశం మొత్తం మీద హనీమూన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఊటీనే. ముఖ్యంగా చుట్టూ ఉన్న పచ్చదనంతో మనస్సు ఇట్టే శృంగారం వైపు లాగుతుంది. ఈ విషయంలో రెండోమాటకు తావులేదు. ఇక ఊటీలోని హోటల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి.


 • షూటింగ్ సమయంలో

  P.C: You Tube

  ముఖ్యంగా ఫర్న్ హిల్ వాస్తు శైలి ఎటువంటివారినైనా ఇట్టే ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చాలా మంది నమ్మే ఘటనలు తరుచుగా జరుగుతూ ఉండేవి. ఇది మొదలయ్యింది కూడా రాజ్ సినిమా షూటింగ్ సమయంలో. దీంతో కొన్ని రోజులు ఈ హోటల్ ను మూసివేశారు.


 • హోటల్ రాజ్ కిరణ్

  P.C: You Tube

  మీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమా? అయితే ముంబై నుంచి రోడ్డు మార్గం ద్వారా కేవలం 2 గంటల ప్రయాణంలో రాజ్ కిరణ్ ను చేరుకోవచ్చు. ఇది లోనావాలో ఉంది. పారానార్మల్ యాక్టివిస్ట్ లు ఈ హోటల్ లో దయ్యాలు ఉన్నాయని చెబుతారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని రిసిప్షన్ పక్కన ఉన్న గదిలోనే అవి ఉన్నాయని చెబుతారు.


 • దుప్పట్లు లాగుతాయి

  P.C: You Tube

  పడుకొన్నప్పుడు తమ దుప్పట్లు తరుచుగా ఎవరో లాగుతున్నారని చాలా మంది పర్యాటకులు ఫిర్యాదులు చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరికొందరు ఆ గదిలోకి వెళ్లిన తక్షణం నీలిరంగు తమ పాదల వైపు పడుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ గదిని అద్దెకు ఇవ్వడం లేదు.
దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పడం కష్టం. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని చెబతితే మరికొంతమంది మాత్రం లేదని చెబుతారు. అయితే దయ్యాలు, భూతాలు కథలు మాత్రం అనేకం కొన్ని వేల ఏళ్ల నుంచి ప్రచారంలో ఉన్నాయి. అటువంటి వాటిలో శ్మశానాలు మొదలుకొని ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అటువంటి కొన్ని హోటల్స్ గురించిన సమాచారం మీ కోసం...