Back
Home » సంబంధాలు
ఆమె నాకంటే ఐదేళ్లు పెద్దది, పెళ్లి చేసుకుంటే సెక్స్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమైనా సమస్యలు వస్తాయా
Oneindia | 10th Nov, 2018 03:43 PM
  • నీకు అభ్యంతరం లేకుంటే

    ఆఫీస్ లో అందరిపై కోప్పడుతుందిగానీ నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనదు. అయితే కొన్ని రోజుల క్రితం తను నన్ను ఇంటికి పిలిచి ఒక మాట చెప్పింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీకు అభ్యంతరం లేకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది.


  • 5 ఏళ్లు పెద్దది

    తను అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయితే తన వయస్సు 30 ఏళ్లు. నాకంటే 5 ఏళ్లు పెద్దది. తనని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నాకు అర్థం కావడం లేదు. మగవారు తమకంటే వయస్సులో పెద్దవాళ్లని చేసుకుంటే సమస్యలు వస్తాయని విన్నాను. సెక్స్ లో కూడా ఎంజాయ్ చేయమని విన్నాను. నిజమేనా?


  • తక్కువ వయస్సు అమ్మాయిలను

    సమాధానం : పెళ్లి విషయంలో వయస్సు ముఖ్యమే. భార్యాభర్తల మధ్య కాస్త వయస్సు విషయంలో అంతరం ఉండాలంటారు. దానికి చాలా కారణాలున్నాయి. మగవారి కంటే ఆడవారికి కాస్త నాలెడ్జ్ పవర్, ఆలోచన తీరు మెరుగ్గా ఉండడం వల్ల తమకంటే కాస్త తక్కువ వయస్సు అమ్మాయిలను అబ్బాయిలు చేసుకుంటూ ఉంటారు. భర్త వయస్సు ఎక్కువ, భార్య వయస్సు తక్కువగా ఉండేలా చూసుకుంటారు.

    Most Read : ఈ దీపావళికి మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వదగిన ఉత్తమమైన స్మార్ట్ ఫోన్


  • ఎక్కువ వయస్సున్న వారిని

    అయితే ప్రస్తుతం బాగా ఎక్కువ వయస్సున్న మగవారిని ఆడవారు పెళ్లి చేసుకోవడం లేదంటే బాగా ఎక్కువ వయస్సున్న ఆడవారిని మగవారు పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. చాలా సెలెబ్రెటీలు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.


  • ఎలాంటి ఇబ్బంది ఉండదు

    వయస్సులో పెద్దవారైనా అమ్మాయిని చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఆమె మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలదు. అలాంటి కాపురాలు సజావుగానే సాగుతాయి. లైంగికంగా కూడా ఎలాంటి ఇబ్బందులుండవు. ఐదు సంవత్సరాల గ్యాపే కాబట్టి సెక్స్ లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవు.




ప్రశ్న : నా వయసు 25 ఏళ్లు. నాకు ఆఫీస్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆమె నాకంటే చాలా పెద్దామే. ఆమె నా సుపీరియర్. అయితే తను ఎప్పుడు నాతో చనువుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను అంటే తనకు చాలా ప్రేమ.