Back
Home » ഏറ്റവും പുതിയ
గూగుల్ నుంచి అత్యంత తక్కువ ధరకే ఫిక్సల్ ఫోన్లు
Gizbot | 9th Nov, 2018 11:24 AM
  • గూగుల్ కంపెనీ ఈ ఏడాదిలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది...

    లీకయిన రిపోర్టుల ప్రకారం గూగుల్ కంపెనీ ఈ ఏడాదిలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంందులో భాగంగా ARCore APK కోడ్ తో గూగుల్ కంపెనీ పేటెంట్లను పొందనట్లు తెలుస్తోంది.


  • గూగుల్ ఫిక్సల్ ఫోన్ల పేర్లు వరసగా Bonito, Sargoలుగా రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది...

    ఈ కోడ్ నేమ్ ల ప్రకారం రానున్న గూగుల్ ఫిక్సల్ ఫోన్ల పేర్లు వరసగా Bonito, Sargoలుగా రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో గూగుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ను పొందుపర్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం అందుబాటుల లేదు. రిపోర్టులు మాత్రం లీకయ్యాయి.


  • Pixel 3, Pixel 3XL...

    కాగా గూగుల్ గత నెలలో Pixel 3, Pixel 3XL ఫోన్లను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిససిందే. గూగుల్ ఫిక్సల్ 3 ధర రూ.71,000గానూ Pixel 3XL ధరను 83,000గానూ నిర్ణయించింది.


  • ఆండ్రాయిడ్ 9.0 మీద ఆపరేట్ కానున్నాయి...

    ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 9.0 మీద ఆపరేట్ కానున్నాయి. అలాగే Qualcomm Snapdragon 845 processorతో అందుబాటులోకి వచ్చాయి. 4 జిబి ర్యామ్ అలాగే 64జిబి, 128జిబిలతో వచ్చాయి.


  • గూగుల్ నుంచి డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి ఫోన్లు కూడా ఇవే...

    కాగా గూగుల్ నుంచి డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో వచ్చిన మొట్ట మొదటి ఫోన్లు కూడా ఇవేనని తెలుస్తోంది. ఫిక్సల్ 3 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా f/2.2 aperture and 97-degree field of viewతో వచ్చింది. సెకండరీ కెమెరా కింద 8 ఎంపీ f/1.8 aperture and 75-degree field of viewతో పాటు phase detection autofocusతో వచ్చింది. 4కెలో వీడియోలను షూట్ చేయవచ్చు.




టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మిడ్ రేంజ్ ధరలో పిక్సల్ ఫోన్లను విడుదల చేయనుందని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ల ద్వారా కంపెనీ అత్యంత తక్కువ మార్కెట్లోనూ సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంతో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. గూగుల్ కంపెనీ కూడా దీనిమీద ఎటువంటి వివరాలను బహిర్గతం చేయలేదు. కాగా హైఎండ్ ఫోన్లను కంపెనీ ఈ మధ్య విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా మిడ్ రేంజ్ ధరలో కూడా ఫోన్లను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా..?