Back
Home » సంబంధాలు
ఆమె భర్త మా స్నేహాన్ని అర్థం చేసుకున్నాడు కానీ అతనికీ అనుమానం వచ్చింది, దూరంపెట్టాడు #mystory300
Oneindia | 14th Nov, 2018 12:32 PM
 • తప్పుగా అర్థం చేసుకునేవారు

  అలాగే మా ఫ్రెండ్ షిప్ ను కూడా తెలియని వారు తప్పుగా అర్థం చేసుకునేవారు. మీ మధ్య ఏదో లేకుంటే ఎందుకంత చనువుగా ఉంటారనేవారు. వాస్తవానికి మా ఇద్దరి మనస్సుల్లో అలాంటి ఆలోచనలు ఉండేవి కావు.


 • చేసుకో.. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది

  డిగ్రీ పూర్తికాగానే గీతకు మా ఊర్లోనే ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని మొదట గీత నన్నే అడిగింది. నేను ఆ అబ్బాయి గురించి తెలుసుకున్నా. మంచి కుర్రాడు అని తెలిసింది. చేసుకో.. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పాను. గీతకు కూడా అతను బాగా నచ్చడంతో అతన్నే చేసుకుంది.


 • వాల్లింటికి నేరుగా వెళ్లేవాణ్ని

  గీత అత్తగారిళ్లు కూడా మా ఊర్లోనే ఉండడంతో పెళ్లయిన కూడా గీత ఊర్లోనే ఉండేది. దీంతో అప్పుడప్పుడు వెళ్లి తనని పలకరించేవాణ్ని. వాల్లింటికి నేరుగా వెళ్లేవాణ్ని. మొదట్లో నన్ను ఎవరూ ఏమీ అనేవాళ్లు కాదు. కానీ గీత మెట్టినింటి వాళ్లకు నాతీరు నచ్చలేదు. దీంతో వాళ్లు నాపై కోప్పడ్డారు.


 • గీతతోనే గడిపేవాణ్ని

  ఇక ఒక వారం పాటు గీత ఇంటికి వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి 365 రోజులు ప్రతి క్షణం నేను గీతతోనే గడిపేవాణ్ని. కష్టమొచ్చినా.. సుఖమొచ్చినా తనకే ఫస్ట్ చెప్పేవాణ్ని.

  కానీ ఇప్పుడు తనకు పెళ్లయ్యింది. నేను గతంలో మాదిరిగానే తనతో చనువుగా ఉంటే తన సంసారం నాశనం అవుతుంది. అందుకే దూరంగా ఉండాలనుకున్నాను. కానీ అస్సలు ఉండలేకపోయాను.

  MostRead : పట్టెమంచంపైనే ఫస్ట్ నైట్, నాకు ఏమేమీ కావాలో అన్నీ చేసింది, నన్ను మైమరిపించింది #mystory299


 • భార్య గురించి నాకు తెలుసు

  ఇక గీత భర్త మాత్రం.. మా ఇంట్లో వారు అనే మాటలను ఏమీ పట్టించుకోకు బాసూ.. నీ గురించి, నా భార్య గురించి నాకు తెలుసు. మీరు మాట్లాడుకుంటూ పట్టించుకోవద్దన్నాడు.


 • నువ్వు కలవడానికి వీల్లేదు

  ఆయనకు మాపై ఉన్న నమ్మకంతో నేను గీతతో ధైర్యంగా మాట్లాడేవాణ్ని. అయితే సడన్ గా గీత భర్త కూడా మారిపోయాడు. గీతను నువ్వు కలవడానికి వీల్లేదు అని చెప్పాడు. నాపై కొన్ని ఆరోపణలు కూడా చేశాడు.


 • మాట్లాడడం మంచిదికాదని

  దాంతో మళ్లీ గీతకు దూరంగా ఉంటూ వచ్చాను. కానీ అంత అకస్మాత్తుగా ఎందుకు తను మారిపోయాడో నాకు అర్థం కాలేదు.
  రోజూ గీత గుర్తొచ్చేది. అయినా తనకు పెళ్లయిపోయింది కదా... తనతో మాట్లాడడం మంచిదికాదని నాకు కూడా అనిపించేది.


 • హద్దులు దాటి ప్రవర్తించలేదు

  అయితే మేమిద్దరం ఎప్పుడూ కూడా హద్దులు దాటి ప్రవర్తించలేదు అయినా ఎందుకు వీళ్లంతా తప్పుగా అర్థం చేసుకున్నారనిపించింది.


 • బజ్జీలు తింటూ

  ఒక రోజు గీత భర్త మా ఇంటికొచ్చాడు. నీతో కాసేపు మాట్లాడాలన్నాడు. ఇద్దరం మా ఇంటి పైన కూర్చొన్నాం. కాసేపు మా అమ్మ చేసిన బజ్జీలు తింటూ మాట్లాడుతూ కూర్చొన్నాం.

  MostRead:ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే అక్కడ బాగా నొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, కారణం ఏమిటి


 • డ్రింక్ చేసే అలవాటు ఉందా

  నీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా అన్నాడు. లేదు అన్నాను. నాకు కూడా తెలుసు .. నీకు లేదని, ఎందుకంటే గీత రోజూ నీ గురించే చెబుతుంటుంది. నీ అలవాట్లు నీ క్యారెక్టర్ అంతా నాకు గీత చెబుతూనే ఉంటుందన్నాడు.


 • పెగ్ పడితేగానీ

  తర్వాత తను జేబులో నుంచి ఒక చిన్న మద్యం బాటిల్ తీశాడు. ఏం అనుకోవొద్దు బ్రదర్.. నాకు పెగ్ పడితేగానీ మనస్సులోని మాటలు బయటకురావు అంటూ ఒక పెగ్ వేశాడు. నిన్ను, గీతను చూస్తుంటే నాకే జలసీ పుడుతుంది.


 • తప్పుడు ఆలోచన వస్తుంది

  నిజంగా మీ ఇద్దరి ఫ్రెండ్ షిప్ చాలా గ్రేట్. నాకు కూడా చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉందిగానీ ఎప్పుడో ఒక్కసారైనా నా మనస్సులో వారిపై తప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది.

  Most Read : నాకు ఫాంటసీ సెక్స్ అంటే బాగా ఇష్టం, నేను రోజుకొకరితో శృంగారంలో పాల్గొంటాను, బాగా సంతృప్తికలుగుతుంది


 • నా భార్య నన్నే ఎక్కువగా ఇష్టపడాలి

  కానీ మీ ఇద్దరిదీ స్వచ్ఛమైన స్నేహం.. మీలాగా నేనెవర్నీ చూడలేదు. కానీ నా భయం నాది. నీకు నా భార్యతో నా కంటే ఎక్కువ చనువు ఉంది. నా కంటే నా భార్య నువ్వే ఎక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను మీ స్నేహాన్ని తప్పుబట్టను కానీ నా భార్య నన్నే ఎక్కువగా ఇష్టపడాలని నాకు కూడా ఉంటుంది కదా.


 • భయం వేసింది

  మొదట్లో నేను కూడా నిన్ను ఏమీ అనలేదు. కానీ రోజురోజుకు నా భార్య నాకంటే ఎక్కువగా నిన్నే తలుచుకోవడం చూసి నాకు భయం వేసింది. ఎప్పుడు చూసినా నీ గురించే చెబుతూ ఉంటుంది. నీ అంత మంచివాడు ఇంకెవ్వరూ లేనట్లుగా పొగుడుతూ ఉంటుంది.


 • ప్రేమ కలుగుతుందేమోనని

  అందుకే నేను నిన్ను ఆమెకు దూరంగా ఉండమని కోరాను. నా భార్యకు నాకంటే నీపై ఎక్కడ ఎక్కువ ప్రేమ కలుగుతుందేమోనని భయం నన్ను వెంటాడుతుంది. ఈ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకు బ్రదర్ అంటూ అతను వెళ్లిపోయాడు.

  MostRead : నా భార్య బొమ్మలా పడుకుంటుంది, నేను ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు


 • పెళ్లికానంత వరకు

  అవును.. గీత భర్త చెప్పింది నిజమే. పెళ్లికానంత వరకు ఏ అమ్మాయితోనైనా స్నేహం కొనసాగించొచ్చేమోగానీ.. ఒక్కసారి పెళ్లయ్యాక ఆ అమ్మాయితో అలాగే ఫ్రెండ్ షిప్ కొనసాగించాలంటే మాత్రం చాలా కష్టం.


 • దూరంగా ఉంటేనే మంచిది

  దీనివల్ల సంసారాలు నాశనం అయ్యే అవకాశం ఉంది. అందుకే బాస్.. ఏ అమ్మాయితోనైనా పెళ్లికానంత వరకే ఫ్రెండ్ షిప్ జర్నీ ఉండాలి. పెళ్లయ్యాక ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా దూరంగా ఉంటేనే మంచిది.
నాకు స్కూల్ డేస్ నుంచి ఒక అమ్మాయితో మంచి పరిచయం ఉంది. తన పేరు గీత. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో చిన్నప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మా తల్లిదండ్రులు కూడా మాపై ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. మేము కూడా ఎప్పుడూ మా హద్దులు దాటలేదు.

కాలేజీ రోజుల్లో కూడా గీత నా బైక్ పైనే కాలేజీకి వచ్చేది. అందరూ మమ్మల్ని మంచి ఫ్రెండ్స్ అనేవారు. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యలో ఎంత మంచి స్నేహం ఉన్నాకూడా దానికి ప్రేమ అనే పేరు పెడుతుంది ఈ సమాజం.