Back
Home » ഏറ്റവും പുതിയ
Redmi ఫోన్‌లకు MIUI 10 అప్‌డేట్, లిస్టులో మీ ఫోన్ ఉందో లేదు చూసుకోండి..
Gizbot | 9th Nov, 2018 01:35 PM
 • మే 2018లో విడుదలైన MIUI 10 కస్టమ్ ROM..

  అయితే, ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మి 6 డివైసెస్ మాత్రం ఈ స్టేబుల్ అప్‌డేట్‌ను అందుకునే ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి. షావోమి తన MIUI 10 కస్టమ్ ROMను మే 2018లో విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ప్రధానంగా ఫుల్-స్ర్కీన్ ఎక్స్‌పీరియన్స్ అలానే గెస్ట్యర్స్ పై ఫోకస్ చేస్తుంది. ఈ అప్‌డేట్‌తో వచ్చే డివైసెస్ ఏఐ షాట్స్‌ను బెటర్ క్వాలిటీతో డెలివర్ చేస్తాయి.


 • సింగిల్ కెమెరాతో వచ్చే ఫోన్‌లకు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్..

  MIUI 10 అప్‌డేట్ సింగిల్ కెమెరాతో వచ్చే ఫోన్‌లకు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను చేరువచేస్తుంది. ఇదే సమయంలో కొత్తకొత్త రింగ్‌టోన్‌లను సైతం ఈ అప్‌డేట్‌ తీసుకువస్తుంది. డిజైన్ ఇంప్రూవ్ మెంట్స్ విషయానికి వచ్చేసరికి MIUI 10 కస్టమ్ ROMతో అప్ డేట్ అయ్యే డివైసెస్ లలో రీసెంట్స్ మెనూతో పాటు పిక్షర్ ఇన్ పిక్షర్ మోడ్ పూర్తిగా రీడిజైన్ కాబడి ఉంటాయి.


 • ఫోన్‌ల జాబితా ఇదే..

  MIUI 10 స్టేబుల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందుకోబోతోన్న ఫోన్‌ల జాబితాలో ఎంఐ మాక్స్ (Mi Max), ఎంఐ మాక్స్ ప్రైమ్(Mi Max Prime), ఎంఐ మాక్స్ 2 (Mi Max 2), ఎంఐ 5ఎస్ (Mi 5S), ఎంఐ 5ఎస్ ప్లస్ (Mi 5S Plus), ఎంఐ 4 (Mi 4), ఎంఐ 4ఎస్ (Mi 4S), ఎంఐ 4సీ (Mi 4C), రెడ్‌మి 5ఏ (Redmi 5A), రెడ్‌మి 5 ప్లస్ (Redmi 5 Plus), రెడ్‌మి 4 (Redmi 4), రెడ్‌మి 4ఎక్స్ (Redmi 4X), రెడ్‌మి 4 ప్రో (Redmi 4 Pro), రెడ్‌మి నోట్ 5 ( Redmi Note 5), రెడ్‌మి నోట్ 5 ప్రో (Redmi Note 5 Pro), రెడ్‌మి నోట్ 4 (Redmi Note 4), రెడ్‌మి ప్రో (Redmi Pro) ఇంకా రెడ్‌మి నోట్ 3 (Redmi Note 3)లు ఉన్నాయి.


 • అప్‌డేట్‌ను రెండు విధాలుగా పొందవచ్చు..

  షియోమి యూజర్లు ఈ అప్‌డేట్‌ను రెండు విధాలుగా పొందవచ్చు. అందులో మొదటి పద్థతిలో భాగంగా ఓవర్ ద ఎయిర్ ఫార్మాట్‌లో ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. రెండవ పద్థతిలో భాగంగా మాన్యువల్ మోడ్‌లో ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.


 • పదేపదే విసుగిస్తోన్న యాడ్స్‌..

  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూ వస్తోన్న MI యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కేవలం కొంత మంది యూజర్లు మాత్రమే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధానమైన కారణం, ఈ కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలోని స్టాక్ యాప్స్ పదేపదే యాడ్స్‌ను డిస్‌ప్లే చేయటమేనట. ఈ యాడ్స్ అనేవి నోటిఫికేషన్స్ షేడ్స్ అలానే స్మార్ట్‌ఫోన్ ఇతర భాగాల్లో కనిపిస్తుండటంతో కొందరు అసహనానికి గురువుతున్నట్లు తెలుస్తోంది.


 • రిసీవ్ రికమండేషన్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా..

  యాడ్స్‌ను డిసేబుల్ చేసే క్రమంలో యూజర్లు సంబంధిత యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి రిసీవ్ రికమండేషన్స్‌ ఆప్షన్స్‌ను టర్నాఫ్ చేయటం ద్వారా యాడ్స్‌ను డిసేబుల్ చేయవచ్చు. ఇలా కాకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మరో ప్రొసీజర్ ద్వారా షావోమి యాప్స్‌ నుంచి మొత్తం యాప్‌్ ను డిసేబుల్ చేసే వీలుంటుంది.


 • స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్...

  ఈ ప్రొసీజర్‌ను అప్లై చేసే క్రమంలో ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో Authorisation and revocation ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని disable msa to turn off system విభాగంలోకి వెళ్లాలి. ఇందులోని wide adsను సెలక్ట్ చేసుకున్నట్లయితే షావోమి యాప్స్‌ నుంచి వచ్చే మొత్తం యాప్స్ డిసేబుల్ కాబడతాయి. ఈ ఫీచర్ Poco F1 స్మార్ట్‌ఫోన్‌తో MIUI 9 లేదా MIUI 10 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టంతో రన్ అయ్యే ప్రతి షావోమి స్మార్ట్‌ఫోన్‌లోనూ అందుబాటులో ఉంటుంది.


 • హ్యాపీగా ఫీల్ అవుతోన్న యూజర్లు..

  పోటీ మార్కెట్ నేపథ్యంలో షియోమి తన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ లాభంతో విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోకొంత లభాన్ని రాబట్టుకునేందుకు తన బ్రౌజర్, సెక్యూరిటీ ఇంకా ఫైల్ మేనేజర్ యాప్స్ ద్వారా యాడ్స్‌‌ను ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. అయితే, వీటిని డిసేబుల్ చేసే ఆప్షన్‌ను షావోమి అందుబాటులోకి తీసుకురావటంతో చాలా మంది యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi), భారత్‌లోని తన యూజర్లకు తీపికబురును అందించింది. ఇటీవల లాంచ్ చేసిన MIUI 10 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను మరో 21 ఫోన్‌లకు పెంచుతూ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ స్టేబుల్ అప్‌డేట్‌ను అందుకున్న ఫోన్‌ల జాబితాలో పోకో ఎఫ్1 (Poco F1) ఉందా లేదా అన్నదాని పై ఇంకా స్పష్టమైన సమాచారమైతే లేదు.

వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేయడం ఎలా..?