Back
Home » సంబంధాలు
తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయి #mystory406
Oneindia | 12th Feb, 2019 09:36 PM
 • ఎన్నో ఆటలు ఆడుకున్నాం

  ఇక ఆ ఇంటి ఆవరణలో నేను మహి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. అవన్నీ మదిలో మెదలాడాయి. కానీ అప్పుడున్న సందడి ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో లేదు. సరే మహిని పలకరిద్దామని గుమ్మందాకా వెళ్లాను. తలుపుకొడదామంటే ఎందుకో మనస్సు ఒప్పుకోలేదు. ఎందుకంటే తను నన్న ఎంతో ప్రేమించినా నేను మాత్రం తనని నా స్వార్థం కోసం ఒంటరిగా వదిలేసి వెళ్లాను.


 • మొహమాటపడడం ఎందుకని

  గుమ్మందాకా వెళ్లి మొహమాటపడడం ఎందుకని తలుపుకొట్టాను. ఇంట్లో ఏదో పనిలో ఉన్నట్లుంది. త్వరగారాలేదు. అందుకే ఒకట్రెండు సార్లు గట్టిగా కొట్టాను. అప్పుడు వచ్చింది. నన్ను చూడగానే బొమ్మలా అలా నిలబడిపోయింది. నేను మళ్లీ తన దగ్గరకు వస్తానని తను అస్సలు ఊహించలేదు. అందుకే అంత షాక్.


 • కనుసైగలతోనే చెప్పాను

  ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అంటూ కళ్లతోనే మాట్లాడింది. అవును అన్నట్లుగా కనుసైగలతోనే చెప్పాను. తనకు నాకు ఏదో తెలియని ఎమోషనల్‌ కనెక్షన్ ఉంది. మేమిద్దరం మాట్లాడుకోకపోవడానికి కారణం ఒక్కటే. తను రెండేళ్ల క్రితమే నన్ను పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. నేనేమో కాస్త ఆగుదాం అన్నాను. అప్పటికి నేను లైఫ్ లో అస్సలు సెటిల్ కాలేదు.

  Most Read :నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు


 • నుదుట ముద్దు పెట్టి

  అప్పుడప్పడే జాబ్ లో నిలదొక్కుకుంటున్నాను. కానీ తను వినలేదు. నేనా జాబా అంది. జాబ్ ఉంటేనే నిన్ను పోషించగలను అని తనకు దూరమయ్యా. మనిషిని దూరం అయ్యానుగానీ నా మనసంతా తన దగ్గరే ఉంది. తనని చూడగానే నుదుట ముద్దు పెట్టి తన తనువంతా తడమాలనిపించింది.


 • మంచి టీ చేసుకుని తీసుకొచ్చింది

  మా మధ్య ఎక్కువ సేపు మౌనం ఉండలేకపోయింది. తను మాటలు కలిపించిది. ఎన్నో కబుర్లు చెప్పింది. తర్వాత తనే ఒక మంచి టీ చేసుకుని తీసుకొచ్చింది. నా జాబ్ గురించి అడిగింది. అన్నీ చెప్పాను. నన్ను తన దగ్గరకు తీసుకుంది. ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటావా అంది.


 • తనని నలిపేశాయి

  బయటే నిలబెట్టి మాట్లాడతావా అన్నాను. బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది. నన్ను తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది. నా చేతులు తనని నలిపేశాయి. బుగ్గలు కందిపోయేలా నా పెదాలు తనపై ప్రేమ చూపాయి. తనంటే నాకు ఎప్పడూ ప్రేమనే. గదిలో నుంచి బయటకు వచ్చాం. తను నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను ప్రతి ఫిబ్రవరి 14 వతేదీన ఇచ్చిన గులాబీ మొక్కలన్నీ మా వైపు చూస్తున్నట్లు అనిపించింది.

  Most Read : నా భర్త నా కోర్కె తీర్చడం లేదు, సుఖాన్ని ఇవ్వడం లేదు, పెళ్లయిన కొత్తలో రోజుకు మూడుసార్లు చేసేవాడు


 • గులాబీ మొక్కలు మాతో మాట్లాడినట్లు

  ఈ వాలెంటెన్ డే కన్నా మీరిద్దరూ కలవండి అన్నట్లు గులాబీ మొక్కలు మాతో మాట్లాడినట్లు అనిపించింది. మా మనస్సులు ఏనాడు విడిపోలేదు. జీవితంలో స్థిరపడ్డాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంత వరకు నన్ను డిస్ట్రబ్ చేయకు అని చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి ఉంది మహి. నాపై ఏరోజు కూడా తను అనుమానపడలేదు. ఎప్పటికైనా నేను తనని పెళ్లాడతనని తనకు తెలుసు. అందుకే ఇన్నాళ్లు వేచిచూసింది.


 • ప్రేమికుల దినోత్సవం రోజు

  మరొకరైతే వీడు కాకుంటే ఇంకొకరు అని మరో దారి చూసుకునేవారు. కానీ నా మహి అలా కాదు. మనం ప్రేమించిన అమ్మాయి మనపై నమ్మకం ఉంచాలిగానీ అనుమానం కాదు. నాపై నమ్మకం నా మహిలో టన్నుల కొద్దీ ఉంది. ఈ కాలంలో ఇలాంటి అమ్మాయి నాకు ప్రేయసిగా దొరకడం నిజంగా నా అద్రుష్టం. ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు తనకు మూడు ముళ్లు వేసి నాదాన్ని చేసుకోనున్నాను.

  Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు
ఆ రోజు ఆదివారం. ఆఫీస్ కు సెలవు. అందుకే మా ఊర్లోని ఒక ఇంటికి వెళ్లాను. ఇళ్లు ఊర్లో ఉన్నా అక్కడికి నేను వెళ్లక చాలా రోజులైంది. ఇంటి బయట ఉన్న గులాబీ మొక్కలు నాకు స్వాగతం పలుకుతూ చిరునవ్వు చిందిస్తున్నట్లుగా గాలికి కదలాడుతున్నాయి.

ఆ చెట్లకు పూలే లేవు. అవన్నీ నేను ఆ ఇంట్లోని అమ్మాయికి కొన్ని ఏళ్ల క్రితం ఫిబ్రవరి పద్నాలుగు వాలెంటైన్ డేస్ సందర్భంగా ఇచ్చిన మొక్కలే. తన పేరు మహిమ. మహి అని నేను ముద్దుగా పిలుచుకునేవాణ్ని. తను నాకే సొంతమనుకునేవాణ్ని. తను నాది అన్నట్లుగా తనపై అధికారం చెలాయించేవాణ్ని.