Back
Home » సంబంధాలు
ఇప్పుడన్నీ శారీరక ప్రేమలే, డబ్బు కోసం ఏర్పడే ప్రేమలే, వాలెంటైన్‌ డేన మాత్రమే ప్రేమనా #mystory407
Oneindia | 12th Feb, 2019 09:22 PM
 • పరాయి మగాడితో ప్రేమ

  మనిషి తన జీవితంలో ఎంత ఎదిగినా సరే ఇంకా ఏదో కావాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే మరో వ్యక్తిని మీలో భాగం చేసుకోవాలనుకోవడం ప్రేమ. అది భావపరంగా ఉంటే అదొక ప్రేమ. అదే శారీరకంగా అయితే అది లైంగిక ప్రేమ.

  ఇక కొందరు ఆడవారు పెళ్లియిన కూడా పరాయి మగాడితో ప్రేమను పొందాలనుకుంటున్నారు. భర్త నుంచి ప్రేమ అందుతున్నా అది వారికి సరిపోవడం లేదు. బాయ్ ఫ్రెండ్ నుంచి కూడా మరింత ప్రేమ కావాలనుకుంటున్నారు. దీంతో పచ్చని కాపురాలు ఛిన్నాభిన్నం అయిపోయితున్నాయి.


 • మంచి బాడీ ఉండాలని

  పెళ్లికి ముందు తన భర్త స్మార్ట్‌ గా ఉండాలని, ధనవంతుడై ఉండాలని, అందరూ కోరుకునేటటువంటి మగాడై ఉండాలని, మంచి బాడీ ఉండాలని కోరుకుంటారు అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అంతే. మంచి గుణవంతురాలైన అమ్మాయి, మంచి అందమైన అమ్మాయి భార్యగా రావాలనుకుంటారు. అలాంటి వారినే ప్రేమిస్తారు.


 • ఆ లవ్ ఫేడ్ అయిపోతుంది.

  మొత్తానికి ప్రేమించిన అబ్బాయి, ఇష్టపడ్డ అమ్మాయి దక్కినా కూడా ఏదో తెలియని వెలితి అనిపిస్తూ ఉంటుంది అమ్మాయిలకు, అబ్బాయిలకు.
  కొన్నాళ్లకే ఆ లవ్ ఫేడ్ అయిపోతుంది. మళ్లీ కొత్త ప్రేమ కావాలని తనువు తలుస్తోంది. మళ్లీ నచ్చిన యువతి లేదా యువకుడితో ప్రేమలో పడుతారు. భార్య లేదా భర్తను పక్కన పెట్టేసి ప్రేమించిన వ్యక్తితో ఎక్కువగా ప్రేమలో తేలిపోతుంటారు.

  Most Read : తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయి


 • మరో పెళ్లి చేసుకుంటాడు

  అయితే ఇలాంటి విషయాల్లో ఎక్కువగా నష్టపోతున్నది అమ్మాయిలే. ఎందుకంటే అప్పటివరకు పెళ్లయిన ప్రియురాలితో బాగా ఎంజాయ్ చేసిన ఆ అబ్బాయి సడెన్ గా మరో పెళ్లి చేసుకుంటాడు. దీంతో ఆమె జీవితం గందరగోళంగా మారుతుంది. ఇక అసలు విషయం తెలిసిన భర్త కూడా ఆమెను వదిలిపెడతాడు. అలా ఉంచుకున్నోడు దూరం అవుతాడు. కట్టుకున్నోడు వదిలిపోతాడు.


 • జీవితాలను చేతులారా నాశనం...

  ఇలా చాలా మంది అమ్మాయిలు తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఒక్కఅబ్బాయితోనే ఉండడం బోర్ కొట్టిన అమ్మాయిలే ఇలా చేస్తుంటారు. అలాంటి అమ్మాయిలు వాళ్ల అంతరంగం చెప్పే మాటల్ని కూడా సరిగ్గా వినరు. పెళ్లయినా కూడా భర్త మాట కాకుండా ఎక్కువగా ప్రియుడి మాటకే విలువ ఇస్తారు. చివరకు ప్రేమంచి పెళ్లి చేసుకున్న భర్త దూరం అవుతాడు. పెళ్లయ్యాక మోజుతో పెట్టుకున్న ప్రియుడు వదిలిపోతాడు.

  Most Read : నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు


 • వాలెంటెన్ డే న మాత్రమే ప్రేమ

  ప్రేమ రకరకాలుగా ఉంటుంది. కానీ ఒకే వ్యక్తితో నిబద్దతో ఉన్న ప్రేమ మాత్రమే గెలుస్తుంది. డబ్బులున్నప్పుడు ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోవడం, అందం ఉన్నప్పుడు ప్రేమ ఉండడం అదిపోతే ప్రేమ తగ్గిపోవడం, శారీరకంగా కలిసినప్పుడు ప్రేమ ఉండడం వెంటనే ప్రేమ తగ్గిపోవడం చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రేమలు కేవలం వాలెంటెన్ డే న మాత్రమే ప్రేమ చూపించే గుణమున్న వ్యక్తులకే ఎక్కువగా ఉంటాయి.

  Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు
వాలెంటైన్‌ డే అంటే అందరికీ ఏవేవో గుర్తొస్తుంటాయి. కొందరు ఎన్నో రోజులుగా తమ మదిలో దాచుకున్న ప్రేమను ప్రేమించిన వారికి చెప్పే రోజు అనుకుంటారు. ఇంకొందరు తమ ప్రేమను ఆ రోజు పెళ్లితో శాశ్వతం చేసుకోవాలనుకుంటారు. ఫిబ్రవరి 14 రోజు మాత్రమే మనం ప్రేమించే వ్యక్తులపై ప్రేమ ఉంటే సరిపోదు. జీవితాంతం ఆ ప్రేమ ఉండాలి. అప్పుడే హ్యాపీగా ఉంటుంది మీ లవ్ లైఫ్.

మనల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకుండా జీవితాంతం ప్రేమగా చూసుకోవడం నిజమైన ప్రేమ. పెళ్లి అయిన తర్వాత కూడా ఆ ప్రేమ అలాగే కొనసాగాలి. ప్రేమను ఎన్నో రూపాల్లో చూపొచ్చు. శారీరికంగా, మానసికంగా, భావపరంగా, సామాజికంగా, ఆర్ధికంగా ఇలా ఎన్నో రకాల ప్రేమలు చూపుతుంటారు జనాలు. అన్నీ ప్రేమలు. అవసరాలను బట్టీ ప్రేమలు మారుతుంటాయి అంతే.