Back
Home » విహారం
మోక్షాన్ని ప్రసాధించే ఆనెగుడ్డే చతుర్భుజ వినాయక టెంపుల్
Native Planet | 6th Jun, 2019 10:27 AM
 • పురాణాల కథ ప్రకారం

  తులనాడు సప్తక్షేత్రాలలో ఇది ఒకటి. దీనినే ముక్తి స్థల అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ పరశురాముడు సృష్టించిన ఏడు యాత్రా ప్రదేశాలున్నాయి. సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగుద్దె లేక కుంభాషి. ఉడిపికి ముప్పై కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు. గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనేగుద్దే ( ఏనుగు తల).


 • పురాణాల కథ ప్రకారం

  పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట. తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట. దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట. కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది.


 • పురాణాల కథ ప్రకారం

  యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట. యాగారంభములో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అందుకుంటున్నారు.


 • ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగా నది అంత ర్వాహినిగా

  ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగా నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు. దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.


 • ఈ వినాయక దేవాలయాన్ని దర్శిస్తే మోక్షం సిద్దిస్తుంది

  హిందువుల పవిత్ర దేవుడు ఉన్న ఈ యాత్ర ప్రదేశం యాత్రికులకు ఎంతో ప్రధానమైనది. ఈ వినాయక దేవాలయాన్ని దర్శిస్తే మోక్షం సిద్దిస్తుందని భావిస్తుంటారు.


 • చతుర్భుజ గణపతి

  ఆనె అనగా ఏనుగు, గుడ్డె అనగా కొండ అని అర్థంగా చెబుతారు. ఇక్కడ ఆలయంలో గణపతి దేవుడి విగ్రహానికి నాలుగు చేతులుంటాయి. అందువల్ల ఈయన్ను చతుర్భుజ గణపతి అని పిలుస్తుంటారు. రెండు చేతులు కోరికలు తీర్చే వరద హస్తాలుగాను, మరో రెండు చేతులు ఆయన పాదాలను చూపిస్తూ ముక్తి ప్రసాధించేవిగాను ఉంటాయి. ఇక్కడ గణేష చతుర్థి, సంకష్ట చతుర్థి చేస్తారు.


 • ఈ దేవాలయంలో తులాభారం ద్వారా కానుకలు సమర్పిస్తారు

  ఈ దేవాలయంలో తులాభారం ద్వారా కానుకలు సమర్పిస్తారు. ఒక వ్యక్తి బరువుకు సమానంగా ఈ కానుకలు ఇస్తారు. ఈ క్షేత్రంలో భార్గవ పురాణంలోని అంశాలు శిల్పాలుగా చూపబడతాయి. డిసెంబర్ నెలలో రధోత్సవం జరుగుతుంది.


 • మరవంతే ఇలా చేరండి !!

  వాయు మార్గం :
  మరవంతే సమీపాన 110 కి.మీ ల దూరంలో మంగళూరు విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో మరావంతే బీచ్ చేరుకోవచ్చు.
  రైలు మార్గం :
  18 కి. మీ ల దూరంలో కుందాపుర స్టేషన్ కలదు. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులలో బీచ్ చేరుకోవచ్చు.

  రోడ్డు మార్గం :
  రోడ్డు మార్గం ద్వారా మరావంతే చేరుకోవటానికి కర్ణాటకాలో గోకర్ణ, బెంగళూరు, గోవా, కుందాపుర, ఉడుపి, మంగళూరు మరియు ఇతర ప్రాంతాల నుంచి మరవంతే కు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.
  చిత్రకృప : vivek raj


 • రధోత్సవం

  శ్రీ మన్మథనామ సంవత్సర మార్గశిర శుద్ద చతుర్థి నాడు రధోత్సవం జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో లక్షదీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే గణేష్ చతుర్థిని ఆలయంలో అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తారు. పల్లకి ఉత్సవం కూడా నిర్వహిస్తారు. చిన్న పల్లకిలో ఉత్సవ మూర్థిని అందంగా అలంకరించి నిర్వహించే పల్లకి ఉత్సవాలు ప్రసిద్ది.
కర్ణాటక రాష్ట్రంలో కుందాపుర వద్దనున్న మరావంతే తీరం ఉడిపికి 50కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకి 450కిలోమీటర్ల దూరంలో మరావంతే ఒక చిన్న పట్టణం. ఈ పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక నది ఉన్నాయి. కుందాపూర్ మరావంతే బీచ్, అనెగుడ్డే వినాయక ఆలయం, కోడిబీచ్, ఒట్టినానే లు చూడదగ్గ ప్రదేశాలు. ముఖ్యంగా ఇవి ఇండియాలో ప్రసిద్ది చెందిన బీచ్ రోడ్లు

ప్రశాంత జీవనం కోరేవారి మరావంతే ఒక స్వర్గం ఈ తీరాన్ని వర్జిన్ బీచ్ (కన్యత్వ బీచ్) అని పిలుస్తారు. దానికి కారణంఈ మొత్తం ఏ మాత్రం కలుషితం కాకుండా తెల్లటి ఇసుకతో ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉన్నది. ఇక్కడినుండి జాతీయ రహదారి సుమారు 100 మీటర్ల దూరం మాత్రమే. బీచ్ ను చేరుకోవటం ఎంతో తేలిక.

బీచ్ లో కల అంతు లేని ఇసుక ప్రదేశం, చల్లటి సముద్రపు గాలి, తాటి చెట్లు వంటివి ఎంతో ప్రశాంతతనిచ్చి జీవితంలో మరువలేని మధుర అనుభూతులను మిగుల్చుతాయి. ఈ బీచ్ కు దక్షిణ భాగంలో ట్రాసి అనే ప్రదేశం మరోవైపునున్న సౌపర్ణిక నదికి ఆనుకుని పడుకొనే గ్రామం ఉంటుంది.

మరావంతే వచ్చిన పర్యాటకులు ఆనెగుడ్డ వినాయక మందిరం తప్పక చూడాలి. ఇది పట్టణానికి 21. 6 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో గణేషుడు ప్రధాన దేవత. ఇక్కడ ప్రధాన విగ్రహం వినాయకుడు వెండి విగ్రహంగా ఉంటుంది. ఇది నిలబడి ఉండటం ఒక విశేషం.