Back
Home » విహారం
పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే మైసూర్ బృందావన్ గార్డెన్స్!!
Native Planet | 7th Jun, 2019 10:57 AM
 • కృష్ణరాజసాగర డ్యామ్

  బృందావన్ గార్డెన్స్ కు నీటి కొదువలేదు. పక్కనే డ్యాం ఉండటంచేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్ లు కలవు.
  PC : PP Yoonus


 • ఉద్యానవనం

  ఉద్యానవనం మొత్తం చూసిరావటానికి రెండు - మూడు గంటల సమయం పడుతుంది. ఇది సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించింది.
  PC : Joe Ravi


 • ఆహ్లాదకరమైన సంధ్యాసమయం

  ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ సందర్శన ఉత్తమం. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విదుద్దీపాలతో అలంకరిస్తారు. ఆహ్లాదకరమైన సంధ్యాసమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనం లో లైట్లు ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి.

  PC : Rishabh Mathur


 • లైట్ కాంతులు

  చిన్న,పెద్ద ఫౌంటైన్ ల నీటి పొంగులు మరియు లైట్ లతో అలంకరించబడిన వివిధ ఉద్యానవనాలు మొదలైన ప్రత్యేకతలు ఎన్నో పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.
  PC : Rohin


 • ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు.

  దీనిని ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927 వ సంవత్సరంలో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932 వ సంవత్సరంలో పూర్తి చేశారు. కె. ఆర్. ఎస్. డ్యాం ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే, ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ కట్టించెను.

  PC : Ashwin Kumar


 • మ్యూజికల్ ఫౌంటెయిన్

  ఈ బృందావన్ గార్డెన్స్ లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.


  సరస్సు గార్డెన్ లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ మరియు సరస్సులు కలిగి ఉన్నది. సరస్సులలో బోట్ రైడ్ ను ఎంజాయ్ చేయవచ్చు.

  PC: MikeLynch


 • చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు

  చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు బృందావన్ గార్డెన్స్ కు పక్కనే 2 హార్టికల్చర్ పొలాలు, 75 ఎకరాలలో పండ్ల తోటలు ఉన్నాయి. ఇవేకాక నగవన 30 ఎకరాలలో, చంద్రవన 5 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి.
  PC : Sumanth Vepa


 • టైమింగ్స్

  బృందావన్ గార్డెన్స్ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ప్రతిరోజూ బృందావన్ గార్డెన్స్ తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. శని, ఆది వారాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అనుమతిస్తారు.
  PC : Ishan Manjrekar


 • ప్రవేశ రుసుము

  బృందావన్ గార్డెన్స్ లోనికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. పిల్లలకు (5 నుండి 10 సంవత్సరాలు) - రూ. 5/-, పెద్దలకు - రూ. 15/- ప్రవేశ రుసుము ఉంటుంది. గార్డెన్స్ లో అనుమతి లేనిదే కెమెరా వాడరాదు. పెనాల్టీ 50 రూపాయలు.
  PC : Abgpt


 • వారాంతంలో

  శని, ఆది వారాలలో మరియు సెలవు దినాలలో బృందావన్ గార్డెన్స్ కు వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ సమయంలో విద్యుద్దీపకాంతులు మరింతగా జిగేల్ మంటూ ప్రకాశిస్తాయి.
  PC : Rishabh Mathur


 • ఫౌంటైన్ షో

  ఫౌంటైన్ షో ప్రతి రోజూ సాయంత్రం 6: 30 నుండి 7: 30 వరకు (సోమవారం - శుక్రవారం), 6: 30 నుండి 8: 30 వరకు (శని, ఆదివారాలలో, సెలవు దినాలలో) ప్రదర్శిస్తారు.

  PC : Rishabh Mathur


 • రద్దీ కనుక,

  రద్దీ కనుక, పర్యాటకులకు చెప్పొచ్చేదేమిటంటే సాయంత్రం 4: 00 - 4 : 30 అయ్యేసరికి బృందావన్ గార్డెన్స్ చేరుకొని 6 : 00 - 6 : 30 వరకు సౌత్ గార్డెన్స్ చూసేయండి. 6: 30 కల్లా నార్త్ గార్డెన్స్ కు వచ్చేసి ఫౌంటైన్ షోను 7 : 30 వరకు తిలకించి తిరుగుప్రయాణమవ్వండి. ఈ విధంగా టైమింగ్ పాటిస్తే రద్దీ నుండి బయటపడవచ్చు. PC : Rishabh Mathur


 • బృందావన్ గార్డెన్స్ చేరుకోవడం ఎలా ?

  మైసూర్ నగరం రవాణా పరంగా అన్ని విధాలా అనుకూలం. ఇక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి తరచూ విమానాలు, రైళ్ళు వస్తుంటాయి. మైసూర్ నుండి కే. ఆర్. ఎస్ డ్యాం వరకు అనేక ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు ఎల్లప్పుడూ తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి డ్యాం వరకు, మైసూర్ వరకు కూడా కె. ఎస్. ఆర్. టి. సి బస్సులు నడుస్తుంటాయి.
  PC : RanjithSiji
అది మహారాజుల తోట ... సాయంత్రం అయ్యిందంటే అక్కడ రాజ కుటుంబాలు వాలిపోతుంటారు. రాజ కుటుంబీకుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన తోట నేడు దేశ, విదేశ పర్యాటకులకు ఒక గమ్యస్థానం. ఏటా ఆ తోటలను సందర్శించటానికి పాతిక లక్షలు పైగా వస్తుంటారని అంచనా. మైసూర్ దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే ... బృందావన్ లేదా బృందావనం !!

బృందావనం (మైసూరు) - కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలో కావేరి నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బృందావన్ గార్డెన్స్ అను ఒక ఉద్యానవనం.ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. 1927 సంవత్సరమున ఈ ఉద్యానవనం పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు. మైసూర్ వచ్చే ప్రతి పర్యాటకుడు బృందావనం గార్డెన్ చూడనిదే పర్యటన పూర్తికాదు. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ... !