Back
Home » విహారం
తిరునల్లార్ శనేశ్వరాలయం దర్శిస్తే శని ప్రభావం నుంచి విముక్తి.
Native Planet | 11th Jun, 2019 10:38 AM
 • నలుడు అంటే నలమహారాజు శని ప్రభావం నుంచి విముక్తిపొందిన ప్రదేశం

  నలుడు అంటే నలమహారాజు శని ప్రభావం నుంచి విముక్తిపొందిన ప్రదేశం ఇది .ఇక్కడి స్వామివారు 'దర్భారణేశ్వరుడు' గా పిలవబడుతున్నాడు. స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్భలను ముడి వేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శనిదోషాలు నివారించబడతాయని భావిస్తారు


 • ప్రమిదలలో దీపాలు వెలిగించి

  ప్రమిదలలో దీపాలు వెలిగించి స్వామివారి ముందుంచుతారు. గర్భగుడిలో దర్భారణ్యేశ్వరుని పేరుతో పూజలందుకుంటున్న పెద్ద శివలింగం , దర్భారణ్యేశ్వరుని పూజించుకొని యెడమవైపునున్న అమ్మవారి కోవెలకు వెళుతూవుంటే గర్భగుడి ఆనుకొని వున్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం వుంటుంది . అంటే ద్రభారణ్యేశ్వరునికి ద్వారపాలకునిగా వున్నట్లుగా శనీశ్వరుడ వుంటాడు.


 • శనీశ్వరుని దర్శించుకొని తరువాత అమ్మవారిన దర్శించుకోవాలి

  శనీశ్వరుని దర్శించుకొని తరువాత అమ్మవారిన దర్శించుకోవాలి . ఇక్కడ భక్తులు యిచ్చే దానాలు , తైలాభిషేకాలు పూజారులు నిర్వర్తిస్తారు. అమ్మవారిని 'భోగామృత పొన్ మొళియాశ్' అని పిలుస్తూ వుంటారు.దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో ఒకటిగా భావిస్తారు. శని గ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాలలో ఇది ఒకటి.


 • నల తీర్థంలో స్నానం

  భక్తులు దేవునికి ప్రార్థనలు చేయటానికి ముందు నల తీర్థంలో స్నానం చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శనీశ్వరన్ ఆలయంలో దేవుడు ఒక చేయి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది.


 • శ్రీ దర్బరన్యేశ్వర ఆలయంలో

  శ్రీ దర్బరన్యేశ్వర ఆలయంలో శివున్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభు లింగంగా ఉన్నారు. తిరునల్లార్ లార్డ్ శివ లార్డ్ బ్రహ్మ యొక్క దీవెనలతో వర్షాన్ని కురిపించిన పవిత్ర ప్రదేశం.


 • బద్రకలియమ్మన్ ఆలయం

  బద్రకలియమ్మన్ ఆలయం తిరునల్లార్ లో మరొక ప్రసిద్ధ ఆలయం బద్రకలియమ్మన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలోని దేవత టెర్రా కొట్టా తో తయారుచేయబడి, నాలుగు చేతులు కలిగి ఉంటుంది. భక్తులు అమ్మవారికి పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కారైకాల్ కు పశ్చిమ దిశలో 15 కిలోమీటర్ల దూరంలో భద్రకాళీ యమ్మన్ ఆలయం ఉన్నది. ఆలయాన్ని అమ్బగారతుర్ కాళీ యమ్మన్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు. అంతేకాకుండా పెద్ద నిశ్చలంగా ఉన్న రెండు పవిత్ర రథాలు తిరునల్లార్ లో ఉన్నాయి. ఈ రథాలు ఊరేగింపుగా వెళ్లిన్నప్పుడు భక్తులకు దేవుళ్ల దర్శనం అందిస్తుంది.


 • తడిబట్టలతో శివుని దర్శించుకుంటారు

  సంతుష్టుడైన శని నలుని తలపై చెయ్యవేస్తాడు , పూర్వజ్ఞానం కలిగిన నలుడు శనీశ్వరుని రకరకాలుగా స్థుతించి తనకు శని ప్రభావమునుంచి ముక్తి కలిగించిన ప్రార్ధించగా శనీశ్వరుడు ధర్భలతో కూడుకొని యున్న అరణ్యంలో స్వయంభూ శివలింగానికి యెదురుగా వున్న కొలనులో స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకుంటే నలునకు వినతి కలిగి పూర్వపద వైభవం కలుగుతుందని చెప్తాడు . నలుడు శనీశ్వరుడ చెప్పిన ప్రదేశం వెతుకుంటూ వెళ్లి అక్కడ స్వయంభూ లింగాన్ని కనుగొని యెదురుగా వున్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి ముక్తి పొందేడు . ఇప్పటికీ భక్తులు నలతీర్ధం లో ( నలుడు స్నానం చేసిన కొలను ) స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకొని , శనీశ్వరున దర్శనం చేసుకొన తిరిగి నలతీర్ధం లో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్తబట్టల ధరించి వెనుకకు తిరిగిచూడకుండా వెళ్లిపోతారు .


 • వేలలో భక్తులు సందర్శిస్తుంటారు.

  వేలలో భక్తులు సందర్శిస్తుంటారు.ఈ కోవెల రెండు ప్రాకారాలలో వుంటుంది , అయిదంతస్థుల గోపురంతో చాలా విశాలమైన కోవెల . ముఖ్యద్వారం దాటుకొని లోపలకి వెళితే విశాలమైన ఆవరణ ఓపక్క ఆఫీసులు , మరో పక్క అర్చన మొదలైన సేవలకు కావలసిన టికెట్ల కౌంటర్లు వుంటాయి . మరోపక్క నూనెదీపాలు వెలిగించి వుంచడానికి వెదురుకర్రలతో నిర్మించిన ప్రదేశం వుంటాయి .


 • ఈ కోవెలకూడా 274 పాతాళ పేత్ర స్థలాలలో ఒకటి

  ఈ కోవెలకూడా 274 పాతాళ పేత్ర స్థలాలలో ఒకటి . ఇక్కడి స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతూ వుంటాయి. ఇక ప్రతి రెండున్నర సంవత్సరాలకు 'శని పెయెర్చి' ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. నలమహారాజు ఇక్కడే శని దేవుడి అనుగ్రహాన్ని సంపాదించాడని స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడ నలదమయంతుల విగ్రహాలతో పాటు, 'నలతీర్థం' ... 'నల కూపం' కనిపిస్తూ వుంటాయి. వీటిని దర్శించడం వలన దోషనివారణ జరిగినట్టుగా భక్తులు విశ్వసిస్తుంటారు.


 • తిరునల్లార్ ఎలా చేరుకోవాలి ?

  విమాన మార్గం
  ట్రిచీ ఎయిర్ పోర్ట్ తిరునల్లార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. ఇది 150 కిలోమీటర్ల దూరంలో కలదు. దేశంలోని ప్రధాన నగరాల నుండి మరియు చెన్నై నుండి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానించనబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

  రైలు మార్గం
  తిరునల్లార్ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. సమీపాన మైలదితిరై అనే రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనంలో ఎక్కి కొద్దీ నిమిషాల్లో తిరునల్లూర్ చేరుకోవచ్చు.

  బస్సు / రోడ్డు మార్గం కారైకాల్ పట్టణం దాదాపు తమిళనాడు లోని ప్రతి పట్టంతో, నగరంతో చక్కగా కలపబడి ఉంటుంది. కనుక, కారైకాల్ నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులో ఎక్కి రోడ్డు మార్గాన తిరునల్లూర్ సులభంగా చేరుకోవచ్చు.
సాధారణంగా 'శని దేవుడు' అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంటుంది. చాలా మంది నవగ్రహాల దగ్గరకి రావడానికి కూడా భయపడుతుంటారు. అయితే దూరంగా వున్నా ... దగ్గరగా వున్నా ఆయన బారి నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయనను శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు.

శనీశ్వరుని మందిరాలలలో అతి పురాతనమైన మందిరం పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారైకాల్ జిల్లాలో ' తిరునల్లారు ' పట్టణం లో వుంది . ఈ మందిరం సుమారు 3వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లుగా తెలుస్తోంది .

ముందుగా ఈ వూరు పేరుకి అర్దం తెలుసుకుందాం . నల + ఆరు నల్లారు , నల అంటే నలుడు , ఆరు అంటే విముక్తి అని అర్దం , ఆరు అన్నది తమిళపదం.

pc:rajaraman sundaram