Back
Home » ഏറ്റവും പുതിയ
మీ డేటా స్లోగా ఉందా, ఇన్‌స్టా‌గ్రామ్‌లోని ఈ ఫీచర్‌పై ఓ లుక్కేయండి
Gizbot | 11th Jun, 2019 06:40 PM
 • Data Saver ఫీచర్

  డేటా నెట్ వర్క్ తక్కువగా ఉండే ప్రాంతాల్లోని యూజర్లకూ తమ సర్వీసు ఈజీగా చేరవేసేందుకు ప్రముఖ సోషల్ మీడియా సొంత ఫొటో యాప్ ఇన్ స్టాగ్రామ్ లో Data Saver ఫీచర్ పేరుతో కొత్త డేటా ఫీచర్ను తీసుకువచ్చింది.


 • త్వరలో ఐఓఎస్ యూజర్లకు

  దీని ద్వారా ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు ఈజీగా లోడ్ అవుతాయి. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇన్ స్టాగ్రామ్ ఈ కొత్త డేటా సేవర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లో నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో యాప్ డేటా వాడకాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. గ్లోబల్ వారీగా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.


 • యాప్ లో ప్రీ లోడింగ్ వీడియోలు

  సాధారణంగా యూజర్లు తమ నెలవారీ డేటా బిల్లు తక్కువగా ఉండాలని, డేటా నెట్ ఫాస్ట్ లోడింగ్ స్పీడ్ ఉండాలని కోరుకుంటారు. ఈ తరహా యూజర్ల కోసం ఇన్ స్టాగ్రామ్ కొత్త డేటా సేవర్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ డేటా సేవర్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే చాలు. యాప్ లో ప్రీ లోడింగ్ వీడియోలు ఆగిపోతాయి. అయితే హై రెజ్యులుషన్ ఇమేజ్ లు డౌన్ లోడ్ కావు. స్లో నెట్ వర్కింగ్ ఉన్న ప్రాంతాల్లోని యూజర్లకు ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్టు ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్ అండ్ ఎడ్ ఆఫ్ పార్టనర్ షిప్స్ మనీష్ చోప్రా తెలిపారు.


 • ఎనేబుల్ చేయడం ఎలా ?

  డేటా సేవర్ ఫీచర్ కోసం యూజర్లు ఇవి చేయాల్సి ఉంటుంది. ముందుగా డేటా సేవర్ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. తర్వాత ఇన్ స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే అకౌంట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతసెల్యులర్ డేటా యూజ్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ డేటా సేవర్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.


 • పూనమ్ పాండేకి ఇన్‌స్టా‌గ్రామ్‌ వార్నింగ్

  ఇదిలా ఉంటే ఇటీవల పూనమ్ పాండేకి ఇన్‌స్టా‌గ్రామ్‌ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల పసుపు రంగు స్విమ్ సూట్ ధరించి ఓ ఫొటో‌షూట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె స్విమ్ సూట్ జిప్ తీసి తన ఎద అందాలను ప్రదర్శించింది. కాసేపు చేతులు అడ్డుపెట్టుకుని ఊరించిన ఆమె.. చివరికి చనుమొనలను ప్రదర్శించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోను 13,62,193 మంది వీక్షించారు. దీంతో ఆమె పనైపోయిందని, ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌‌లో పూనమ్ పాండే కనిపించదని అంతా భావించారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌ ఆ వీడియోపై ఆమెకు వార్నింగ్ పంపింది. ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తే భవిష్యత్తులో అకౌంట్ నుంచి తొలగిస్తామని పేర్కొంది. దీంతో పూనమ్ ఆ వీడియోను తొలగించక తప్పలేదు.


 • పూనమ్ స్వయంగా ఓ యాప్‌ను

  సినిమాలు, మోడలింగ్ కంటే ఇలాంటి అశ్లీల ఫొటోలు, వీడియోలతోనే బాగా పేరు సంపాదించిన పూనమ్ స్వయంగా ఓ యాప్‌ను నిర్వహిస్తోంది. అందులో ఆమె అందాల ప్రదర్శనకు అడ్డే ఉండదు. తన అందాలను దాచుకోకుండా చూపిస్తుండటంతో కుర్రకారు ఆమెకు బానిసలవుతున్నారు. ఆ యాప్‌లో పెట్టే వీడియోల టీజర్లను పూనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. ఇటీవల సొంతంగా మరో వైబ్‌సైట్‌ లింక్ కూడా షేర్ చేసిన పూనమ్ అందులో కూడా తన హాట్ వీడియోలను పోస్టు చేస్తుంది. దీంతో ఆమెకు ఇన్‌స్టా‌గ్రామ్‌ వార్నింగ్ ఇచ్చింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సెలబ్రెటీలు వారి ఫ్యాన్స్‌తో అనుసంధానమై ఉండేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సెలబ్రెటీలు అలాగే సామాన్యలు ఇన్‌స్టాగ్రామ్‌ను చాలా ఎక్కువగా వాడుతున్నారు. కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేసుకునేందుకు కూడా ఈ సోషల్ మీడియాని ఓ వేదికగా ఉపయోగించుకుంటున్నాయి.

అయితే ప్రమోట్ చేసినవి యూజర్ల చెంతకు చేరాలంటే డేటా తప్పనిసరిగా ఉండాలి. కొన్ని సమయాల్లో సిగ్నల్స్ వీక్ గా ఉన్న సమయంలో ఈ ఉత్పత్తులు వినియోగదారులకు చేరవు. ఇలాంటి సమయంలో కూడా ప్రొడక్ట్స్ వినియోగదారుల చెంతకు చేరేందుకు సోషల్ మీడియా దిగ్గజాలు సరికొత్త వ్యూహాలకు తెరలేపుతున్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్టా‌గ్రామ్‌ సరికొత్త ఫీచర్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.