Back
Home » ഏറ്റവും പുതിയ
PM KISAN పథకానికి తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్లు
Gizbot | 12th Jun, 2019 02:16 PM
 • పీఎం కిసాన్ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్

  పీఎం కిసాన్ పథకానికి కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా కావాలి. ఇందులో ప్రధానంగా పట్టాదార్ పాస్ పుస్తకం తప్పనిసరి. ప్రస్తుతం పొలంలో ఏం పండిస్తున్నారు? భూమి ఎవరి పేరు మీద ఉంది? పొలం కుటుంబ సభ్యులందరికీ కలిపి ఉంటే షేరింగ్ సర్టిఫికెట్ కావాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి. మొదటి రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌కు ఆధార్ నెంబర్ అడగలేదు కేంద్రం. అయితే రైతులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో కొన్ని సమస్యలొచ్చాయి. రైతులు కానివారితో పాటు ఒకే రైతుకు రెండుసార్లు డబ్బులు జమ కావడం లాంటి సమస్యలు వచ్చాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసింది.


 • రిక్వయిర్ మెంట్స్

  పేరు
  వయస్సు
  జండర్
  కేటగిరి
  ఆధార్ నంబర్
  బ్యాంక్ అకౌంట్ నంబర్
  IFSC Code
  Land ownership


 • పీఎం కిసాన్ పథకం వీరికి వర్తించదు

  సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పరమైన పదవులు కలిగిన రైతు కుటుంబాలు, సర్వీసులో ఉన్న లేదా పదవీ విరమణ పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం రంగ, స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సిద్ధి (పీఎం-కిసాన్‌) పథకం కిందకి రారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వంటి వృత్తి విద్యా నిపుణలు, అలాగే నెలకు రూ.10 వేలకు పైగా పెన్షన్‌ పొందేవారు, గత మదింపు సంవత్సరంలో ఆదాయ పన్ను కట్టినవారికి కూడా ఈ పథకం వర్తించదు. రూ.75 వేల కోట్ల పీఎం-కిసాన్‌ పథకాన్ని మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. దీంతో దీని అంచనా వ్యయం కూడా 2019-20లో రూ.87,217.50 కోట్లకు పెరుగుతుంది.


 • 60 ఏళ్లు దాటిన తర్వాత

  రైతులందరికీ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. దీన్ని అమలు చేసేందుకు ఉన్నతాధికారులు కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు . పీఎం కిసాన్ పథకంలో రైతులందరికీ నెలకు రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది కేంద్రం. ఇక పెన్షన్ స్కీమ్‌లో చేరే రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ అందించనుంది. 18-40 ఏళ్ల వయస్సు గల రైతులు పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు.


 • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

  ప్రస్తుతం చాలావరకు దరఖాస్తులు తప్పుల వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఐదు ఎకరాల నిబంధన కూడా లేదు కాబట్టి రైతులు ఎవరైనా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మొత్తం 3.66 కోట్ల మంది రైతులు ఎన్‌రోల్ చేసుకుంటే వారిలో 3.03 కోట్ల మంది రైతులకు మొదటి వాయిదా, 1.99 కోట్ల మంది రైతులకు రెండో వాయిదా రూ.2,000 చొప్పున అకౌంట్‌లో జమ అయ్యాయి.
ఎన్నికల హామీని నెరవేరుస్తూ.. రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్‌ పథకం వర్తింపజేయాలనే నిర్ణయంపై కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందజేస్తారు. మే 31న జరిగిన కొత్త ఎన్డీయే ప్రభుత్వ తొట్టతొలి సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు.

ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.దీనిపై నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు ప్రస్తుతమున్న మినహాయింపు అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుతమున్న భూయాజమాన్య విధానాన్ని ఉపయోగించి లబ్ధిదారులను గుర్తించాలని, పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో కుటుంబసభ్యుల వివరాలు అప్‌లోడ్‌ చేసిన తర్వాత ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించే బాధ్యత, వారి డేటా పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం.