Back
Home » ഏറ്റവും പുതിയ
ఫేస్‌బుక్ గేమ్ షో, రూ. 3 లక్షల వరకు గెలుచుకోండి
Gizbot | 12th Jun, 2019 05:25 PM
 • చిన్నపాటి ప్రశ్నలు

  Confetti అనే ఇంటరాక్టీవ్ గేమ్ షోను Facebook తొలిసారిగా అమెరికాలో లాంచ్ చేసింది. ఈ గేమ్ షోలో పాల్గొనే వారిని పాప్ కల్చర్ కు సంబంధించి చిన్నపాటి ప్రశ్నలను అడుగుతారు. Game Showలో పాల్గొన్నవారు ఈ ప్రశ్నల్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలా ప్రశ్నలకు సమాధానం చెబితే ప్రతిరోజు రూ.3 లక్షల వరకు క్యాష్ ప్రైజ్ గెలిచే అవకాశం ఉంది.


 • లైవ్ స్ట్రీమింగ్ Game Show

  ఇండియాలో మా ఫస్ట్ అధికారిక గేమ్ షో ఇది. యూజర్ల ఎంగేజ్ మెంట్ ఎంతవరకు ఉంటుందో, ఈ గేమ్ షో ద్వారా యూజర్లు ఎంత వరకు ఇంటరాక్టీవ్ అవుతారో చూడాలి. అన్ని కమ్యూనిటీలు కలిసి గేమ్ షోలో ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నామని ఫేస్ బుక్ పార్టనర్ షిప్స్ హెడ్, డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు.ఫేస్ బుక్ సోషల్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ సందర్భంగా ఈ లైవ్ స్ట్రీమింగ్ Game Show ను ముంబైలో ప్రకటించినట్టు చోప్రా తెలిపారు.


 • Facebook Watch

  ఫేస్ బుక్ వాచ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ గేమ్ షో ఇప్పటికే ప్రపంచంలోని కెనడా, యూకే, మెక్సికో, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్ఫైన్స్ సహా పలు దేశాల్లో అందుబాటులో ఉంది. సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ 2018లో ప్రపంచవ్యాప్తంగా వీడియో ఆన్ డిమాండ్ సర్వీసు 'Facebook Watch'ను ప్రవేశపెట్టింది. యూట్యూబ్ కు పోటీగా ఫేస్ బుక్ ఈ సర్వీసు అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో సర్వీసు ద్వారా ఫేస్ బుక్ యూజర్లు ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్, న్యూస్ వంటి కేటగిరీల వీడియోలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. రీసెంట్ వీడియోలను 'Watch Feed' కలెక్షన్ పేజీలపై యూజర్లు చూసి ఫాలో అయ్యేలా సర్వీసును రూపొందించారు


 • లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోలపై పలు ఆంక్షలు

  ఇదిలా ఉంటే తమ లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియోలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. తీవ్రవాదం, విద్వేషాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. 'క్రైస్ట్‌చర్చ్‌'మసీదు కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాదం పెచ్చుమీరకుండా ఉండేందుకు ఆ సంస్థలపై న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్, ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌లు ప్రపంచవ్యాప్తంగా 'క్రైస్ట్‌చర్చ్‌'పిలుపునివ్వాలని సిద్ధమవుతున్నారు.


 • ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌

  మార్చిలో శ్వేత జాతీయుడు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 51 మంది చనిపోయారు. కాల్పులు జరుపుతూ దుండగుడు ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేశాడు. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా జుకర్‌ బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఫేస్‌బుక్‌ వినియోగదారులు తీవ్రవాద సంబంద వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. 'న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమం తర్వాత తీవ్రవాదం వ్యాప్తిచేసేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపాం'అని ఫేస్‌బుక్‌ తెలిపింది.


 • క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను

  యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే దిశగా సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ ప్లాట్‌ఫామ్‌లో యూజర్ల వ్యక్తిత్వంపై క్విజ్‌లను నిర్వహించే యాప్‌లను నిషేధిస్తున్నామని తెలిపింది. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా సేకరించేలా ఉన్న యాప్‌లకు చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వీటితోపాటు పలు అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ల(ఏపీఐ)ను తొలగిస్తున్నామనీ, కంపెనీ విధానాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. కేంబ్రిడ్జి అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి 8.7 కోట్ల మంది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన సంగతి తెలిసిందే. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సమాచారాన్ని వాడుకున్నట్లు తేలడంతో ఫేస్‌బుక్‌ పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త లైవ్ స్ట్రీమింగ్ గేమ్ షోను ప్రవేశపెట్టింది. ఇండియాలోని యూజర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్..'Confetti' అనే టైటిల్ తో ఫస్ట్ ఇంటరాక్టీవ్ గేమ్ షోను ప్రకటించింది.

ఈ గేమ్ షో జూన్ 12 నుంచి ఫేస్బుక్ వీడియో ప్లాట్ ఫాంపై ఫేస్ బుక్ వాచ్ లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టుకంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గేమ్ షో ద్వారా యూజర్లు కళ్లు చెదిరే బహుమతులతో పాటు అనేక రకాల ఫ్రైజులను గెలుచుకునే అవకాశాన్ని సోషల్ మీడియా దిగ్గజం కల్పిస్తోంది. ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎలా బహుమతులు గెలుచుకోవాలనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి.