Back
Home » ഏറ്റവും പുതിയ
ఎయిర్‌టెల్ కస్టమర్లకు శుభవార్త, ఇకపై ఉచిత డేటా
Gizbot | 12th Jun, 2019 06:20 PM
 • ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా

  దీంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా ఈ కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ యాక్స్సెస్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే రూ.499, అంతకంటే ఎక్కువ ప్లాన్ కలిగిన పోస్ట్ పేయిడ్ కస్టమర్లు దీనికి అర్హులు. మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.


 • ప్లాటినం కస్టమర్లకు ఉచిత ఆఫర్

  ఎయిర్‌టెల్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ మూడు నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 12 నెలల పాటు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ ప్లాటినమ్ కస్టమర్లు తాజాగా జీ5 విస్తృతమైన డిజిటల్ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు.ఇందులో జీ5 ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్ స్టైల్ షోలు, కిడ్స్ షోలు, ప్లేస్ ఉంటాయి. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ కు అద్భుతమైన స్పందన వచ్చిందని , ఈ సందర్భంగా జీ5 ఆఫర్‌ అందివ్వడం సంతోషంగా ఉందని భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శాశ్వత్‌ శర్మ వెల్లడించారు. ఎగ్జిస్టింగ్ ప్లాటినమ్ కస్టమర్లకు జీ5 అందిస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఎయిర్‌టెల్ ప్లాటినం కస్టమర్లకు ఉచిత ఆఫర్ జీ5తో తమ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ మరింత దృఢమవుతుందని భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎగ్జైటింగ్‌ కంటెంట్‌ అందించడంలో ఇది కీలక అడుగు అని జీ 5 బిజినెస్‌ హెడ్‌ మనీష్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానించారు.


 • వొడాఫోన్ తాజా ఆఫర్

  ఇదిలా ఉంటే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలను సవాల్ చేస్తూ వొడాఫోన్ తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. పాత కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, కొత్త యూజర్లను ఈ ప్లాన్ ద్వారా ఆకర్షించవచ్చని భావిస్తోంది. వొడాఫోన్ రూ.299 ప్రిపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. రోజుకు 3 జీబీ 4జీ డేటా పొందొచ్చు. 1,000 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అపరిమిత కాల్స్ సదుపాయం ఉంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇకపోతే ఎక్కువ డేటా కోరుకునే వారికి రూ.229 ప్లాన్ అనుగుణంగా ఉంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అపరిమిత కాలింగ్ ప్రయోజనం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.


 • నోకియా 8.1 ఆఫర్

  ఇక నోకియా 8.1 కొనుగోలు దారులకు ఎయిర్ టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో ప్రీపెయిడ్ యూజర్లు రూ. 199తో రీఛార్జ్ చేసుకుంటే.. 1TB వరకు 4G డేటా అదనంగా పొందవచ్చు. ఎయిర్ టెల్ పోస్టు పెయిడ్ కస్టమర్లు అదనంగా 120GB డేటా పొందవచ్చు. అంతేకాదు.. 3 నెలల వరకు Netflix Subscription ఉచితంగా పొందవచ్చు. ఒక ఏడాది వరకు Amazon Prime సబ్ స్ర్కిప్షన్ పొందాలంటే రూ.499తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.

  కాగా ఇదివరకే రూ.249 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుందని కంపెనీ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఎక్సా సంస్థలు ఆ పాల‌సీకి బాధ్యత వహిస్తాయి. వినియోగదారుల వయసు 18 నుంచి 54 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ.249 ప్లాన్‌తో వినియోగదారులకు రోజుకు 2జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం సేవ‌లు, జీ5, లైవ్ చాన‌ల్స్‌, సినిమాలు, ఏడాదిపాటు నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సేవ‌లు, వింక్ సభ్యత్వం ఉచితంగా ల‌భిస్తాయి.


 • పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి

  రూ.249 రీచార్జి చేసుకున్న వెంట‌నే ప్రీపెయిడ్‌ క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా ఇవ్వాలి.. అనే వివ‌రాలు ఉంటాయి. వాటిని న‌మోదు చేసుకున్న వినియోగదారుడు ఫోన్ లో ఎయిర్‌టెల్ యాప్ నుంచి పాల‌సీ కాపీని పొంద‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లేదా భార‌తీ ఆక్సా నుంచి ఆ పాల‌సీ ఇష్యూ అవుతుంది. దీంతోపాటు రూ.129 కు మ‌రో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌లో క‌స్టమ‌ర్లకు రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు
ఎయిర్‌టెల్ కస్టమర్లకు కంపెనీ శుభవార్తను అందించింది. కంపెనీ తన సబ్‌స్క్రైబర్లకు ఉచిత డేటా ప్రయోజనాలు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రూ.399, రూ.448, రూ.499 ప్రిపెయిడ్ యూజర్లు ఈ అదనపు డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు.

దీని కోసం సంబంధిత యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ఈ ఉచిత డేటా లభిస్తుంది. యూజర్లు రూ.399 ప్లాన్‌ ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటాకు బదులుగా 1.4 జీబీ డేటా పొందవచ్చు. ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. రూ.448, రూ.499 ప్లాన్లకు కూడా ఇదే వర్తిస్తుంది.