Back
Home » విహారం
తెలంగాణలోని పంచముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయ మహత్యం..!!
Native Planet | 5th Jul, 2019 06:17 PM
 • పురాణాల ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో

  పురాణాల ప్రకారం నరసింహస్వామి త్రేతాయుగంలో 5 రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాలలో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహ స్వామి ఆలయాలు కొండ ప్రాంతాలలోనే ఉంటాయి. మరి పంచముఖ ఉగ్ర నరసింహ స్వామి దర్శనమిచ్చే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  P.C: You Tube


 • పూర్వం రెక్కలు గల మలయ పర్వతం ఆకాశ మార్గాన

  తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లా నుండి కొన్ని కొలోమీటర్ల దూరంలో నర్శింపల్లి అనే గ్రామంలో శ్రీ పంచముఖ నరసింహస్వామి ఆలయంలో భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పూర్వం రెక్కలు గల 'మలయ పర్వతం' ఆకాశ మార్గాన ప్రయాణిస్తుండగా దానిలోని నాలుగు భాగాలు భూమిపై పడ్డాయట. ఆ పర్వత భాగాలే 'మంగళగిరి', వేదగిరి, యాదగిరి, నందగిరి' క్షేత్రాలుగా ప్రసిద్ది చెందాయి. ఆ నందగిరిపైనే ఈ నరసింహుల పల్లె క్షేత్రం కొలువుదీరి కనిపిస్తుంది.

  P.C: You Tube


 • 0ఎకరాల విస్తీర్ణంలో గల ఈ క్షేత్రంలో కొండ గుహలో వెలసిన

  0ఎకరాల విస్తీర్ణంలో గల ఈ క్షేత్రంలో కొండ గుహలో వెలసిన ఈ స్వామివారిని ఆ తరువాత వచ్చిన రాజులు దర్శించి తరించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆది శంకరులు వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ఆధారాలున్నాయి.

  P.C: You Tube


 • ఈ ఆలయం పైకప్పుగా ఉన్న పెద్దబండపై

  ఈ ఆలయం పైకప్పుగా ఉన్న పెద్దబండపై బయటివైపు ఆకాశం చూస్తూ 16 చేతుల పంచముఖ ఉగ్ర నరసింహస్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ వెలసిన స్వామి పంచ ముఖాలతో షోడశ భుజాలతో ఉగ్ర నరసింహ స్వామిగి దర్శనమిస్తాడు.

  Nani.2018


 • ఇక్కడి విగ్రహానికి 16 చేతులు ఉండటం విశేషం

  ఇక్కడ వెలసిన స్వామివారు 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో 16 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి హిరణ్యకశిపుని తొడలపై వేసుకుని పొట్టను చీలుస్తున్న భంగిమలో స్వామివారి మూర్తి అద్భుతంగా చెక్కబడినది. అయితే పంచముఖ నరసింహస్వామికి పది చేతులు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడి విగ్రహానికి 16 చేతులు ఉండటం విశేషం. ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా విష్ణు పురాణం..బ్రహ్మ పురాణం పేర్కొన్నాయి.

  Krrish1971


 • పిల్లలు లేని వారు మొక్కు చేసుకుంటారు.

  ఈవిధంగా ఇక్కడ వెలసిన స్వామి వారికి పిల్లలు లేని వారు మొక్కు చేసుకుంటారు. అదే విధంగా పెళ్లికాని వారు మంచి భర్త, లేదా భార్యా దొరకాలని మొక్కకుంటారు. అలాగే పెళ్లి ఆలస్యం అవుతున్నా పరిహారం కోసం భక్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరితే వెండి నామాలను, వెండి మీసాలను స్వామివారి హుండీలో వేసే ఆచారం ఉంది.

  PC: Facebook


 • ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు

  ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో కొండంత దేవుడి అనుగ్రహం కోసం భక్తులు బారులుతీరుతారు. ఇంకా ఈ ఆలయంలో ఉత్సవాలు, జాతరలు జరిగే సమయంలో చుట్టు ప్రక్కల ప్రదేశాల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

  PC: Facebook
ఈ భూ మండలం పై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెబుతాయి. అందులో అత్యంత విచిత్రమైన, విశిష్టమైన రూపము నారసింహ రూపం. సగం మనిషి, సగం మగరూపంలో ఉన్న ఈ రూపంలో ఆయన హిరణ్యకసిపుడిని సంహరిస్తాడు. ఇక అదే రూపంలో విష్ణువు అనేక చోట్ల వెలిసాడు. ఈ నారసింహుడికి ఉత్తర భారత దేశంలో కంటే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి.

మన రాష్ట్రంలో నరసింహ స్వామి వెలిసిన క్షేత్రాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇవి నిత్యం భక్తులతో, హరినామస్మరణలలతో, పూజలతో ఆధ్యాత్మిక భావనను రేకెత్తించే విధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అహోబిలం. ఇది రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనూ ప్రసిద్ధి చెందినది. అందుకే ఇక్కడికి దేశంలోని నలుమూలల నుండి పెద్ద పెద్ద ప్రముఖులు సైతం వస్తుంటారు. మన రాష్ట్రంలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నరసింహ ఆలయాల చాలానే ఉన్నాయి. అయితే అన్నింటిలోకి విభిన్నంగా ఉన్న ఆలయం పంచముఖ నరసింహ ఆలయం మన రాష్ట్రంలోనే ఉంది.