Back
Home » ഏറ്റവും പുതിയ
ధరల తగ్గింపుతో నోకియా6.1 ఇప్పుడు Rs.6999కే మొదలు
Gizbot | 8th Jul, 2019 04:40 PM
  • ఇండియాలో నోకియా 6.1 ధర:

    నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లోని లిస్టింగ్ ప్రకారం ఇండియాలో నోకియా 6.1 3 జిబి + 32 జిబి బేస్ వేరియంట్‌ ధర ఇప్పుడు 6,999 రూపాయలు.మరోవైపు నోకియా 6.1 యొక్క 4 జిబి + 64 జిబి వేరియంట్‌ సవరించిన ధర ట్యాగ్ 9,999రూపాయల వద్ద ఉంది.


  • లభ్యత:

    అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్‌లలో తాజా ధరల సవరణ ఇంకా అప్డేట్ చేయలేదు. అదేవిధంగా ఆఫ్‌లైన్ రిటైలర్లు హ్యాండ్‌సెట్‌ను దాని మునుపటి ధరలతో అందించవచ్చు.

    నోకియా 6.1 ను గత ఏడాది ఇండియాలో 16,999రూపాయల ధర వద్ద లాంచ్ చేశారు. ఇటీవల నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో 3 జీబీ + 32 జీబీ వేరియంట్‌ ధర 8,999రూపాయలు కాగా, 4 జీబీ + 64 జీబీ మోడల్ ధర 10,999రూపాయలు.


  • స్పెసిఫికేషన్స్:

    నోకియా 6.1 ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది.ఇది 16: 9 కారక నిష్పత్తితో 5.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి (1080x1920 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 4 జీబీ ర్యామ్‌తో జతచేయబడిన స్నాప్‌డ్రాగన్ 630Soc తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

    ఫోటోలు మరియు వీడియోల కోసం నోకియా 6.1 వెనుకవైపు 16-మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్‌తో ఒకే ఒక కెమెరాను కలిగి ఉంది.ఇది f/2.0 లెన్స్ మరియు ఎల్‌ఇడి ఫ్లాష్‌తో వస్తుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఎఫ్ / 2.0 ఫిక్స్‌డ్ ఫోకస్ లెన్స్‌తో లభిస్తుంది.


  • కనెక్టివిటీలు:

    నోకియా 6.1 లో 32 జిబి మరియు 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా128 జిబి వరకు విస్తరించబడతాయి. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, FM రేడియో, USB టైప్-సి (v2.0) మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.ఇది స్పటికల్ ఆడియో టెక్నాలజీని కలిగి ఉంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.




ఇండియాలో ప్రస్తుతం నోకియా 6.1 మొబైల్ పై తగ్గింపు ధరతో కేవలం రూ. 6.999 ధరకు ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రతిబింబిస్తోంది. గుర్తుచేసుకుంటే నోకియా 6.1 అకా నోకియా 6 (2018) గత ఏడాది ఏప్రిల్‌లో 3 జిబి + 32 జిబి మరియు 4 జిబి + 64 జిబి అనే రెండు వేర్వేరు వేరియంట్లలో తిరిగి విడుదల చేయబడింది.

ముఖ్యాంశాల విషయానికొస్తే నోకియా 6.1 గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో భాగం అంటే ఇది సకాలంలో అప్డేట్లు మరియు గూగుల్-ఆప్టిమైజ్ చేసిన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. నోకియా 6.1 పూర్తి-హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 SoC ఆన్‌బోర్డ్ ద్వారా శక్తిని పొందుతుంది. భారతదేశంలో నోకియా 6.1 యొక్క కొత్త ధర గురించి మరిన్ని వివరాల కోసం చదవండి.