Back
Home » విహారం
నెల్లూరులో మైమరపించే మైపాడు బీచ్‌ సాగర సౌందర్యం..!!
Native Planet | 16th Jul, 2019 12:38 PM
 • పచ్చని వరిపొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలకరిస్తాయి.

  పచ్చని వరిపొలాలు, కొబ్బరి తోటలు దారంతా పలకరిస్తాయి. మైపాడు పర్యాటక కేంద్రంలో విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తీరం పక్కనే శివాలయం ఉంది. ఆదివారాలు, సెలవులు పండగ రోజుల్లో బోటు షికారు, సముద్ర ఇసుక తిన్నెల మీద హార్స్‌ రైడింగ్‌ చేసేందుకు వీలుంటుంది.


 • సూరీడి కిరణాల ఆటల్లో పడి వింతగా కనిపిస్తుంది

  మైపాడు బీచ్ నెల్లూరు నగరం నుండి 25 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడి ఇసుక బంగారంలా చెణుక్కుమనడమే కాదు నీలి రంగు నీరు కూడా సూరీడి కిరణాల ఆటల్లో పడి వింతగా కనిపిస్తుంది.


 • బీచ్ ఇసుక తిన్నెలతో, పచ్చదనంతో ప్రశాంతంగా

  బీచ్ ఇసుక తిన్నెలతో, పచ్చదనంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు చేపలు పట్టుటకు మరియు సముద్రవిహారానికి అనువైన ప్రదేశం.


 • బీచ్ ప్రాంతం ఎంతో అందంగా వుండి

  బీచ్ ప్రాంతం ఎంతో అందంగా వుండి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పర్యాటకులు సముద్రంలో స్నానాలు చేసి సంతోషంగా గడుపుతారు.


 • ఏ కోనసీమ లోనో, కేరళ లోనో విహరిస్తున్న

  ఏ కోనసీమ లోనో, కేరళ లోనో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడి వాతావరణం.


 • బీచ్ ప్రాంతం పొడవుగా వుండి

  బీచ్ ప్రాంతం పొడవుగా వుండి అనేక రిసార్ట్ లు మరియు హోటళ్ళు వుంటాయి.


 • బీచ్ ప్రశాంతంగా వుండి

  బీచ్ ప్రశాంతంగా వుండి సాయంకాలం 6 గం. వరకు తెరచి వుంటుంది. బీచ్ లో సూర్యాస్తమయం చాలా బాగుంటుంది.


 • అంత ప్రమాదకరం కాని అలలతో

  అంత ప్రమాదకరం కాని అలలతో అందర్నీ ఆకర్షించే సాగరం మైపాడు సొంతం. పిల్లలకు గుఱ్ఱపు స్వారి ఉన్నది.


 • ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ స్పోర్ట్స్

  ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ స్పోర్ట్స్ మరియు రిసార్ట్స్ వంటి వాటిని అభివృద్ధి చేయటం ద్వారా, వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయటం ద్వారా మైపాడు బీచ్ ను ప్రోత్సహించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటోంది.


 • పెంచలకోన జలపాతం

  ఇంకా నెల్లూర్ జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో శ్రీహరికోటను, పులికాట్‌ సరస్సును త్వరగా చూసిరావొచ్చు. నెల్లూరులో మైపాడు బీచే కాదు నేలపట్టు పక్షి కేంద్రం కూడా ఫేమస్సే. ఉదయగిరి, వెంకటగిరి కోటలు, పెంచలకోన జలపాతం, కండలేరు డ్యామ్‌ అందాలిక్కడివే.


 • ఎలా చేరుకోవాలి?

  నెల్లూరు పట్టణానికి 25 కి.మీ. దూరంలో మైపాడు బీచ్‌ ఉంది. ఆర్టీసీ బస్సులు నేరుగా బీచ్‌ వరకూ వస్తాయి.

  రోడ్ మార్గం: అన్ని ప్రధాన నగరాల నుండి నెల్లూరుకు జాతీయ మరియు రాష్ట్రీయ హైవే మార్గాలను చక్కగా అనుసందానించబడినది. చెన్నై నుండి 180కిలోమీటర్ల దూరంలో నెల్లూరు ఉంది.
  రైలు మార్గం: చెన్నై మరియు హైదరాబాద్ వంటి ప్రదాన నగరాల నుండి నేరుగా నెల్లూరు రైల్వేష్టేషన్ రెగ్యులర్ ట్రైన్స్ ను అనుసందానించబడినది.
  విమాన మార్గం: నెల్లూరుకు సమీప విమాన మార్గం చెన్నై (180కి.మీ). ఈ ప్రదాన నగరం నుండి డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సౌకర్యం ఉంది.
కొండలు.. కోనలు.. నదులు... సాగర తీరాలతో కూడిన ప్రకృతి సౌందర్యం... చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ప్రదేశాలూ... మతసామరస్యాన్ని చాటే వందల ఏళ్ల నాటి దర్గాలు, ఆలయాలు.. దేశ శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినువీధుల్లో నిలుపుతున్న అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు.. ఇలాంటి ఎన్నో ఆకర్షణీయమైన పర్యాటక స్థలాలకు కేంద్రం నెల్లూరు జిల్లా.

నెల్లూరు జిల్లాలోని మైపాడు సాగరతీరం రమణీయ ప్రకృతి దృశ్యాల సమాహారం. మరో కోనసీమగా పేరు గాంచిన ఇందుకూరుపేట మండలంలోని మైపాడుకు జిల్లా కేంద్రం నుండి ప్రయాణించడం గొప్ప అనుభూతి. మైపాడు నెల్లూరుకి దగ్గర్లో ఉన్న ఈ మైపాడు బీచ్, రాష్ట్రంలోనే చూడవలసిన బీచ్ ల లో ఒకటి.