Back
Home » ഏറ്റവും പുതിയ
కొత్త అమెజాన్ అలెక్సా అనౌన్స్‌మెంట్ ఫీచర్‌తో అమెజాన్ ఫైర్ టీవీ
Gizbot | 11th Aug, 2019 09:30 AM
 • ది వర్జ్ నివేదిక:

  ది వర్జ్ యొక్క నివేదిక ప్రకారం అన్ని ఫైర్ టీవీ పరికరాల్లో వన్-వే మెసేజింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో అమెజాన్ ప్రస్తుతం ఫైర్ టివి స్టిక్ ను రెండు వేరియంట్లలో అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లలో మొదటిది సాధారణ ఫైర్ టీవీ స్టిక్ మరియు రెండవది 4K అవుట్‌పుట్‌కు మద్దతు ఇచ్చే మరొక వేరియంట్ ఉన్నాయి. ఈ రెండు పరికరాలు అలెక్సా అనౌన్స్‌మెంట్ ఫీచర్‌ను అందుకుంటాయి.


 • అలెక్సా అనౌన్స్‌మెంట్ ఫీచర్‌:

  ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు అలెక్సా-శక్తితో కూడిన స్పీకర్ లేదా ఆండ్రాయిడ్ లేదా iOS లోని అమెజాన్ అలెక్సా యాప్ ని ఉపయోగించి ఫైర్ టీవీ పరికరాలకు చిన్న వాయిస్ ఆధారిత సందేశాన్ని ప్రసారం చేయవచ్చు. మెసేజ్ ప్లే అవుతున్నప్పుడు ఒకవేళ టీవీలో కొంత కంటెంట్ ప్లే అవుతుంటే అది తాత్కాలికంగా పాజ్ చేయబడుతుంది. మెసేజ్ ముగిసిన తర్వాత అది కంటెంట్‌ను తిరిగి ప్రారంభిస్తుంది. వినియోగదారులు వారి స్వంత ప్రకటనలను కూడా రికార్డ్ చేయవచ్చు.


 • యూట్యూబ్ యాప్‌:

  క్రొత్త ఫీచర్‌తో పాటు అమెజాన్ అన్ని ఫైర్ టీవీ పరికరాల్లో స్థానిక యూట్యూబ్ యాప్ ని కూడా విడుదల చేస్తోంది. ఈ రోజు నుండి ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీ మరియు ఇతర ఫైర్ టీవీ పరికరాలు ప్రస్తుతం విక్రయించబడుతున్న మార్కెట్లలో స్థానిక యూట్యూబ్ యాప్ ని స్వీకరిస్తాయి. అమెజాన్ జూలై చివరి నాటి నుండి యూట్యూబ్ యాప్‌ను విడుదల చేయడం ప్రారంభించింది.


 • గూగుల్ Vs అమెజాన్ :

  ఈ సంవత్సరం జూలైలో అమెజాన్ మరియు గూగుల్ తమ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. అంటే దీని అర్థం ఫైర్ టీవీ పరికరాల్లో స్థానిక యూట్యూబ్ యాప్ తిరిగి రావడం. అలాగే Chromecast మరియు Android TV లకు ప్రైమ్ వీడియో మద్దతు రావడం.
అమెజాన్ అలెక్సా యొక్క అనౌన్స్‌మెంట్ ఫీచర్‌ ఫైర్ టీవీ పరికరాలకు సాధారణ వాయిస్-ఆధారిత సందేశాన్ని పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎకో స్మార్ట్ స్పీకర్లలో ప్రవేశపెట్టిన తరువాత అమెజాన్ ఈ ఏడాది మేలో అలెక్సా-శక్తితో పనిచేసే అన్ని పరికరాలకు మద్దతునిచ్చింది. సంస్థ ఇప్పుడు తన ఫైర్ టీవీ పరికరాలకు అలెక్సా అనౌన్స్‌మెంట్ ఫీచర్‌ను జోడిస్తోంది.

ప్రస్తుతం అలెక్సా అనౌన్స్‌మెంట్ ఫీచర్‌ అందుబాటులో ఉన్న దేశాలలో ఈ ఫీచర్ రూపొందించబడింది. మీరు మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు సరళమైన సందేశాన్ని ప్రసారం చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.