Back
Home » సంబంధాలు
బ్యాడ్ టైమ్ వస్తే బంధాలు తెగిపోవాల్సిందేనా..
Oneindia | 31st Aug, 2019 12:33 PM

జీవితం నీటి బుడగ లాంటిది. అది కనుమరుగయ్యేలోపే అన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. అది కష్టమైనా.. నష్టమైనా.. అలాగే మీ జీవితంలోని సంతోషాన్ని, సుఖాన్ని, బాధలను పంచుకునేందుకు మీకు ఎవరైనా ఉంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీనికి తమ భాగస్వామి అర్హులు అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు వారి అంచనాలు, ప్రాధాన్యతలు తగ్గిపోతుంటాయి. ఆ క్షణంలో రిలేషన్ షిప్ (సంబంధం) గురించి కఠినమైన వాస్తవాల్ని మాట్లాడతాయి. రిలేషన్ షిప్ లో కఠినమైన నిజాల్ని చాలా మంది అంగీకరించకపోవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) ఎప్పటికీ 'ఒకటి'..

ప్రతి ఒక్కరి కోసం కనీసం 'ది వన్' తయారు చేయబడి ఉంటుంది. డేట్ కు వెళ్లడానికి చాలా సింగిల్స్ వేచి ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితిలో 'ది వన్' మీరు ఎలా గుర్తించాలంటే మీకు మంచిగా అనిపించే వ్యక్తిని మీరే కొనుగొంటారు. ఆపై మీరే మంచిగా ఉండటానికి మీరిద్దరూ ఒకటిగా కలిసి పని చేస్తారు.

2) మిమ్మల్ని క్రేజీగా నడిపించే వారు ఒకరిని మించి రావచ్చు..

మిమ్మల్ని క్రేజీగా నడిపించే వారు ఒకరిని మించి రావచ్చు. మీరు ఒక ఆర్గనైజ్ డ్ మరియు డిసిప్లేన్ గల వ్యక్తి అయితే మీ భాగస్వామితో మీరు ఉన్నట్టుండి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవితంలో మీ లాంటి వ్యక్తిని మీరు కలిసిన ఆ క్షణం, మీరు ఆ వ్యక్తి పట్ల కచ్చితంగా ఆకర్షితులవుతారు.

3) అభిరుచిపై అనాసక్తి పెరుగుతుంది..

మనలో దాదాపు 90 శాతానికి పైగా గొప్ప శృంగార భరితమైన, ఉద్వేగభరితమైన ప్రేమ జీవితాన్ని పొందాలనుకుంటాము. కానీ మీ భాగస్వామికి మీకు ఉన్న అభిరుచి ద్వారా అనాసక్తి పెరిగే ఆస్కారం ఉంటుంది. మీరు అదే సాన్నిహిత్యాన్ని కూడా అనుభవించలేరు. మీ మీ రిలేషన్ షిప్ లో ఒక బ్యాడ్ ఫేస్ లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. ఇందుకు మీరు అతిగా స్పందించే అవకాశమూ ఉంది.

4) బ్యాడ్ టైమ్స్ విడిపోవడానికి దారి తీస్తుంది..

మీరు మరియు మీ భాగస్వామి ఒకరినొకరు పిచ్చిపిచ్చిగా ప్రేమించినప్పటికీ, బ్యాడ్ టైమ్స్ వల్ల మీరు విడిపోవాల్సి ఉంటుంది. ప్రతిదీ గొప్పగా అనిపించినప్పటికీ, పరిస్థితులు దారిలో రావడం కష్టంగా అనిపిస్తుంది. ఆ పరిస్థితులు ఏంటంటే కుటుంబ సమస్యలు, ఉద్యోగ పరిస్థితి, ప్రాధాన్యతలు లేదా మరేదైనా ఇతర కారణాలు కావచ్చు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఇవి మీకు మరియు మీ భాగస్వామి విడిపోవడానికి దారి తీస్తాయి.

5) అంచనాలు అనవసరంగా పెంచుకుంటారు..

మీ జీవితాన్ని గడపడానికి తగినంత మంచి వ్యక్తిని కనుగొన్న కాలంలో మీరు అంచనాలను అమాంతం పెంచుకుంటారు. కానీ మీ అంచనాలు వైఫల్యాలకు దారి తీసినప్పుడు, మీరు మోసపోయినట్లు భావిస్తారు. ఇది మీ సంబంధమైన చాలా కఠినమైన దశకు తీసుకెళ్తుంది. అదెలా ఉంటుందంటే ఒక్కోసారి కోలుకోలేనంతగా ఉంటుంది.

6) దయనీయంగా అనిపించవచ్చు..

మీ సంబంధంలో మీరు తక్కువ మరియు దయనీయంగా భావించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అది తలచుకుని మీరు మీ భాగస్వామితో ఉన్నందుకు చాలా చింతిస్తారు. అప్పుడే మీ మీద మీకు దయనీయంగా అనిపిస్తుంది. అందుకు కారణామేమిటంటే మీ ఆలోచనలు మరియు దృక్పథాలు రెండింటిలోనూ తేడాలు ఉండొచ్చు.

7) సమానత్వ సమస్యలు..

మీ రిలేషన్ షిప్ కు సంబంధించి కఠినమైన వాస్తవాలలో ఇది ఒకటి. మీరు మరియు మీ భాగస్వామి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆకర్షణీయంగా అనిపించినా సమానత్వ తేడాల వల్ల బాధగానే అనిపిస్తుంది. కానీ సరైన కమ్యూనికేషన్ మరియు అవగాహనతో, మీరు దీన్ని క్రమబద్దీకరించవచ్చు. చిన్న బేబీలా ఒక సంబంధాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సమయంలో అస్సలు నిర్ల్యక్ష్యం చేయరాదు. మీ సంబంధం మీ భాగస్వామితో శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు ఇలాంటి ప్రయత్నాన్ని కచ్చితంగా చేయాలి.