Back
Home » సంబంధాలు
ఒకరినొకరు ప్రేమించుకోడానికి హైట్ అంతగా అవసరమా?
Oneindia | 31st Aug, 2019 07:00 PM

ప్రస్తుత జనరేషన్ లో కపుల్స్ ను ఒకసారి పరిశీలిస్తే సాధారణంగా పురుషుడి కంటే మహిళలు తక్కువ ఎత్తుగా ఉంటారు. లేదా పురుషులే ఎక్కువ హైట్ గా ఉంటారు. కానీ చాలా అరుదైన సమయాల్లో దీనికి భిన్నంగా మనకు అక్కడక్కడా కొన్ని జంటలు కనిపిస్తుంటాయి. పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ హైట్ (ఎత్తు)గా ఉంటే సమాజం ఆ జంటను అసమతుల్యత జంటగా భావిస్తుంది. చాలా మంది ప్రజల ఆలోచనా ధోరణి కూడా అలాగే ఉంది.

కానీ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మీరు కచ్చితమైన శరీరాన్ని కలిగి ఉండాల్సిన అవసరమే లేదు. మీకు కావాల్సిందల్లా అందమైన ఆత్మ ఒక్కటే. మీరు పొట్టివారైనా సరే. పొడవుగా ఉన్నా సరే. మీరు ఒకరిని ప్రేమించడం అనే భావాలను కలిగి ఉండాలి. ఈ విషయాలను నిరూపించేందుకు మేము రెండు నిజ జీవిత జంటల అభిప్రాయాలను కూడా తీసుకున్నాము. వారి రియాక్షన్ మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది ఎత్తుతో సంబంధం లేకుండా ఉండగలదని మాకు నమ్మకం కలిగించింది.

బీహార్కు చెందిన పూర్వా(38), మహేంద్ర(45) పెళ్లి చేసుకుని 19 సంవత్సరాలు పూర్తయ్యింది. పూర్వా మహేంద్ర కంటే మూడు అంగుళాలు పొడవుగా ఉంటుంది. ఈ సందర్భంగా వారు బోల్డ్ స్కైతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ''మా వివాహంలో వచ్చిన వివాదాల్లో ఎత్తు గురించి ఇంతవరకూ ఎలాంటి ప్రస్తావనే రాలేదు. మేము వివాహం చేసుకున్న క్షణం నుండే ఒకరినొకరు ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉండాలనుకున్నాం. ఉంటున్నాం. పైగా నేను ఎత్తు ఉన్నందుకు నా భర్త సంతోషిస్తున్నాడు. ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేసే విషయంలో తప్పించుకున్నాడు కదా అందుకు. అంతే కాదు సెల్ఫ్ లను కూడా నాకు సులభంగా అందుతాయి. వాటిని కూడా శుభ్రం చేస్తాను. నా భర్త ఈ విషయంలో లక్కీ. ఎందుకంటే ఈ పని తప్పించుకున్నాడు''. మరో జంట బీహార్ కు చెందిన వాగిష్(48), స్మిత(43) వీరికి వివాహామై 21 సంవత్సరాలు పూర్తయ్యింది. వాగిష్ కంటే స్మిత నాలుగు అంగుళాలు పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా స్మిత మాట్లాడుతూ '' ఎత్తు అనేది దీర్ఘకాలిక ప్రేమ వెనుక ఒక కారణంగా ఉంటుందని నాకు ఎప్పటికీ అనిపించదు. భావోద్వేగ అవసరానికి ఎప్పుడూ మన ఎత్తు అవసరం లేదు. కాబట్టి మేము ఒకరినొకరు ఎత్తు గురించి ఎక్కువగా పట్టించుకోము''

''పెళ్లికి ముందు నా తల్లిదండ్రులు అతని ఎత్తు గురించి పట్టించుకోలేదు. పెళ్లికొడుకు సున్నితమైనవాడు మరియు దయగలవాడు అని చెప్పారు. అందుకనే నేను అతడిని నా భర్తగా పొందాను'' అని ఆమె అని చెప్పారు. ప్రజలు మీ జంటను వినోదభరితంగా చూస్తారా అని ఆమెను ప్రశ్నించగా స్మిత బోల్డ్ స్కై తో ఇలా అన్నారు. ''చూసేవారిని చూడనివ్వండి.. ఎత్తు అనేది ప్రేమను డిసైడ్ చేస్తే అది ప్రేమే కాదు'' తర్వాత వాగిష్ మాట్లాడుతూ '' నేను చిన్నవాడిని ఇలాంటివన్నీ నేను పట్టించుకోను. మేం ఒకరినొకరు చక్కగా చూసుకుంటాం. నా భార్య నన్ను ప్రేమించడం నాకు సంతోషాన్ని ఇస్తుంది'' అని అన్నారు. చాలా మంది కపుల్స్ తమ ఎత్తు గురించి ఎగతాళి చేస్తే వారు పెద్దగా పట్టించుకోరు. వారు నిజంగా గర్వంగా జీవిస్తున్నారు. ఈ లెక్కన ప్రేమకు నిజాయితీ, రాజీ, సర్దుబాటు, సంరక్షణ మరియు సహనం అవసరం. చాలా జంటలు శారీరక స్వరూపం కంటే పై లక్షణాల కోసం వెతకాలి. వివరాలను రహస్యంగా ఉంచేందుకు వ్యక్తుల పేర్లు మరియు ఇతర గుర్తింపు వివరాలు మార్చబడ్డాయి.