Back
Home » సంబంధాలు
భార్యభర్తల బంధం బలపడాలంటే ఈ చిట్కాలు పాటించండి..
Oneindia | 3rd Sep, 2019 08:15 PM
 • పెంపుడు జంతువులను ఇంటికి తీసుకురండి..

  మీరు మీ భాగస్వామి సమ్మతితో సంతోషంగా పెంపుడు జంతువును దత్తత తీసుకోవచ్చు. కుక్క, పిల్లి, కుందేలు, పక్షులు, చిట్టెలుక వంటివి కాకుండా ఇంకా ఏవైనా మీరు ఎంచుకోవచ్చు. ఇది మీ సంబంధానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది.


 • కలిసి పని చేయండి..

  ఆడుతూ పాడుతూ పని చేయండి.. అందుకోసం పనిని ఇద్దరు షేర్ చేసుకోండి. మీరిద్దరూ డైలీ వ్యాయామం చేసే చోట నుండి
  ఈ పనిని ప్రారంభించండి. దీనిని దినచర్యగా మార్చుకోండి. దీంతో మీ జంట ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. మిమ్మల్ని సమాజంలో ఆరోగ్యకరమైన జంటగా కూడా అభివర్ణిస్తారు.


 • ఒకరినొకరు అర్థం చేసుకోవాలి..

  భార్యభర్తలు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. అలాంటప్పుడే ఎవరో ఒకరు ఒక మెట్టు దిగాలి. లేదా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడే మీ భాగస్వామికి ఇష్టమైన వంటకాన్ని చేసి పెట్టాలి. మీలోని చెఫ్ లక్షణాలను బయట పెట్టాలి. మీ భాగస్వామిని ఆశ్చర్యపరచాలి. ఇది మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాదు మిమ్మల్ని మరోసారి ప్రేమలో పడేలా చేస్తుంది. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.


 • పరస్పరం అభిరుచులను అభివృద్ధి చేసుకోండి..

  మీరిద్దరు ఎప్పటికప్పుడు అభిరుచులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇది మీకు మరియు మీ భాగస్వామికి ఇద్దిరికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే మీకు అనుకూలంగా ఉండే ఏవైనా అభిరుచులను మీరు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్ ఆడటం, పుస్తకం చదవడం, తోటపని, పాటలు పాడటం, కథలు చెప్పడం ఇలా ఏవైనా మీకు మరియు మీ భాగస్వామికి ఒకరి ఆసక్తి, ఇష్టానికి కనిపెట్టేందుకు మార్గం సులభమవుతుంది.


 • ‘ఐ లవ్ యూ‘ చెప్పడం..

  మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నట్లయితే ఖరీదైన బహుమతులే ఇవ్వనవసరం లేదు. ప్రేమతో 'ఐ లవ్ యు' అని చెప్పవచ్చు. లేదా మీరు మీ భాగస్వామికి వారి పేరు ఉన్న ఉంగరం లేదా కాగితంలో తయారు చేసిన ఏదైనా వస్తువును అయినా బహుమతిగా ఇవ్వొచ్చు. దీంతో మీ భాగస్వామికి మీపై ఉన్న విలువ, మరియు గౌరవం అమాంతం పెరుగుతాయి.


 • హాస్యం పండించండి..

  జీవితంలో నవ్వు అనేది లేకపోతే ఆ జీవితమే వృథా అని ఎందరో మహానుభావులు ఇప్పటికే చెప్పారు. హాస్యం అనేది లేకపోతే మీ జీవితం చాలా బోరుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మీ భాగస్వామి జీవితంలో మరియు మీ సంబంధంలో కొంత హాస్యాన్ని కలపండి. ఇది వారు అందంగా నవ్వడానికి, వారి చిరునవ్వును మీరు చూడటానికి కూడా మీకు సహాయపడుతుంది. అంతేకాదండోయ్ ఆ నవ్వు ద్వారా కాస్త ఒత్తిడి కూడా దూరమవుతుంది. అందుకే నవ్వు అనేది మన జీవితంలో చాలా ముఖ్యం.


 • స్థానికంగా ప్రయాణించండి..

  మీ భాగస్వామితో కలిసి ప్రయాణించడానికి ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు వేలకు వేల రూపాయలు లేదా లక్షలు ఖర్చు చేయాల్సిన పని అస్సలు లేదు. మీరు మీ భాగస్వామితో కలిసి స్థానికంగా సమీపంలో ఉండే ప్రాంతాలను కూడా అన్వేషించవచ్చు. అక్కడికే వెళ్లి ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఎక్కడికి వెళ్తున్నారనేది సంబంధం లేకుండా ఎవరితో వెళ్తున్నారు. ఎలా అక్కడికి చేరుకుంటున్నారు. మీరు మీ భాగస్వామితో ప్రయాణించినప్పుడు, మీరు ఇలాంటి అనుభవాన్ని పంచుకుంటారు. ఇలా మీ బలమైన బంధాన్ని పెంచుకుంటారు.


 • ఒకరి కుటుంబాన్ని సందర్శించండి..

  మీరు, మీ భాగస్వామి అప్పుడప్పుడు ఎవరైనా ఒకరి కుటుంబాన్నిసందర్శించండి. వారితో కాసేపు కలిసి గడపండి. దీంతో మీరు ఒకరి కుటుంబ సంప్రదాయలు మరియు నిబంధలను తెలుసుకోగలుగుతారు.ఇది మీ భాగస్వామినే కాకుండా వారి కుటుంబాన్ని కూడా మీరు విలువైన వారిగా భావిస్తారు. ఇలాంటివి మీ భాగస్వామితో మరింత ప్రేమను పెంచుతాయి. అంతేకాదు మీరు ఇతర జంటలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు.
భార్యభర్తల బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే జంటగా ఏదైనా రెస్టారెంట్లో కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుని ఆశ్చర్యపరచడం, లేదా ఎక్కడైనా అందమైన ప్రదేశాలకు వెళ్లడం, సెలవులకు టూర్ ప్లాన్లు చేయడం వంటి జంటలను మీరు ఇప్పటికే చూసుంటారు.

కానీ ప్రతి ఒక్క జంట మాల్దీవులు, బాలి, గోవా ఇతర సెలవు గమ్యస్థానాలకు వెళ్లలేరు లేదా భాగస్వామికి డైమండ్ రింగ్ బహుమతిగా ఇవ్వలేదు. కాబట్టి దాంపత్య జీవితాన్ని జీవితాంతం సంతోషంగా గడిపేందుకు ఏయే అంశాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.