Back
Home » సంబంధాలు
మీ ఫస్ట్ డేట్ లో అతను/ఆమె ఆకట్టుకునేందుకు కొన్ని చిట్కాలు..
Oneindia | 7th Sep, 2019 10:00 AM
 • 1) మంచి దుస్తులు ధరించండి..

  మీరు డేటింగ్ వెళ్తుంటే, మీరు స్మార్ట్ అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ చర్మానికి సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించండి. ఆత్మవిశ్వాసంతో మీ భాగస్వామిని కలవండి. అయితే దీనికి ముందు మీరు సరిగ్గా బ్రష్ చేసుకుని స్నానం చేయడం కూడా చాలా అవసరం. ఎందుకంటే శుభ్రంగా చూడటం చాలా ముఖ్యం. అలాగే మీ శరీరానికి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ లను వాడటం మంచింది.


 • 2) సమయానికి వెళ్లండి..

  మీరు ఫస్ట్ డేటింగ్ కు వెళ్తుంటే మీ భాగస్వామి కంటే ముందు వెళ్లండి. లేదా సరైన సమయానికి అయినా వెళ్లండి. ఫస్ట్ డేటింగ్ కే గంటల తరబడి వెయిట్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు కాబట్టి సమయస్ఫూర్తి ఎల్లప్పుడూ పని చేస్తుంది. మీరు మంచి బట్టలు వేసుకుని, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నా, ఆలస్యం వెళ్లడం వల్ల ప్రతిదీ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ డేట్ గురించి ఇలా చెప్పారు. శేఖర్ (24) '' డేట్ లో వేచి ఉండటం అనేది చాలా విసుగు తెప్పిస్తుంది. ఎవరైనా డేట్ కు వెళ్లేటప్పుడు ఎందుకు సరైన సమయానికి వెళ్లలేరని నేను ఆశ్చర్యపోతున్నాను'' అని చెప్పారు.


 • 3) స్పష్టత కలిగి ఉండాలి..

  మీరు కేకలు వేసే ముందు లేదా వారి భుజం మీద చేయి వేసే ముందు వారు ఇబ్బందికరంగా మరియు నిరాశగా ఉంటున్నారా అనే దానిపై మీరు స్పష్టత కలిగి ఉండాలి. మీరు మీ రిలేషన్ షిప్ ఎందుకు మెయింటెయిన్ చేయాలనుకుంటున్నారో, మీరు ఎందుకు డేట్ వెళ్తున్నారనే దానిపైనా మీకు స్పష్టత ఉందని నిర్ధారించుకోండి. ఇలాంటివి మీ డేట్ ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. అంతేకాక మీరు కూడా ఓపికగా మరియు ప్రశాంతంగా కనిపిస్తారు.


 • 4) మీ దృష్టితో ఆకట్టుకోండి..

  మీరు డేటింగ్ లో ఉన్నప్పుడు మీ చూపులు, సంజ్ఞలు, మీ వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయి. కాబట్టి మీరు మీ ఫస్ట్ డేట్ లో నమ్మకంగా మీ భాగస్వామిని చూడండి. మీరు మీ చూపును పక్కకు తిప్పుకోకుండా మీ భాగస్వామి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే మీరు దాదాపు సక్సెస్ అయినట్టే. దానికంటే మీ డేట్ లో మీ చూపులు అసౌకర్యంగా లేకుండా చూసుకోండి.


 • 5) పొగడ్తలను అస్సలు మరచిపోవద్దు..

  పొగడ్తలకు పడిపోని వారు ఎవరైనా ఉంటారా? పొగడ్తలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. డేట్ కు సంబంధించి ఢిల్లీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మితాలి(23) ఇలా అన్నారు. ''మీరు డేట్ లో ఉన్నప్పుడు అభినందనలు, ప్రశంసలు అందుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాక, మీ గురించి వ్యక్తి నిజంగా గమనించారని కూడా దీని అర్థం'' అని చెప్పారు. మీ డేట్ లో అందాన్ని చూసి మురిసిపోకుండా కూర్చోవడానికి బదులు, మీరు అతని/ఆమె అందాన్ని గుర్తించడానికి ఏదైనా అందమైన వస్తువులతో కాని ఇతర వాటితో పోల్చి చెప్పొచ్చు. ఉదాహరణకు ''వావ్ మీరు ఈ దుస్తులలో ఏంజిల్ లా ఉన్నారు. నేను నిజంగా మీ రింగ్స్ ని ఇష్టపడుతున్నాను'' వంటి అభినందనలు అతనిని/ఆమెను ఆకట్టుకుంటాయి.


 • 6) మీ ఫోన్ ను పక్కన పడేయండి..

  మీ డేట్ ను కనుగొనేందుకు మీ ఫోన్ మీకు సహాయం చేసినా, మీరు డేట్ లో ఉన్న సమయంలో ఫోన్ స్క్రీన్ ను చూడటం అస్సలు బాగుండదు. మీ ముచ్చట్లను కూడా అది నాశనం చేస్తుంది. మీ డేట్ లో ఉన్నట్లు మీరు దాన్ని విస్మరించినట్లు అనిపిస్తుంది కూడా. అందుకనే మీరు డేట్ లో ఉన్నప్పుడు ఫోన్ ను పక్కన పెట్టడం మంచిది. మీ డేట్ లో అందమైన క్షణాలను అస్వాదించమే ఉత్తమమైన పని. మీకు నిజంగా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, మీరు రెస్ట్ రూమ్ ను ఉపయోగించుకోవాలి. అందుకు మీరు మీ భాగస్వామిని ముందే అనుమతి తీసుకోవాలి. దానికి గాను మీరు ముందు క్షమించమని అడగాలి. దీంతో కొంతసేపు మీరు మీ ఫోన్ ను ఉపయోగించవచ్చు.


 • 7) ముచ్చట్లలో మునిగిపోండి..

  మీరు ఇంటర్వ్యూ కోసం డేట్ కు వెళ్లలేదు. ఎందుకంటే ప్రశ్నలు అడగడం వంటివి ఆ సమయంలో విసుగు తెప్పిస్తాయి. అలాగే నిశ్శబ్దంగా ఉండటం లేదా ప్రశ్నకు ఒకటి లేదా రెండు మాటలలో సమాధానం ఇవ్వడం కూడా సమయాన్ని పాడు చేస్తుంది. దీనికి సంబంధించి మితాలి ఇలా అంటున్నాడు '' మేము కలిసి ఉన్నప్పుడు మాట్లాడని ఈ అబ్బాయితో నేను డేట్ లో ఉన్నాను. బహుశా అతను సిగ్గు పడొచ్చు. రెస్టారెంట్ లో కూర్చున్న వ్యక్తుల వైపు చూస్తూ మేము రెండు గంటల పాటు గడిపాము. అంతేకాదు, మేము గోడల వైపు చూస్తూ ఉన్నాము. అలాగే, నేను అతని జీవితం మరియు పనికి సంబంధించిన ప్రశ్నలను అడిగినప్పుడు అతను చాలా తక్కువ మాటలలో స్పందించాడు.'' అని తెలిపారు.


 • 8) హాస్యాస్పదంగా మాట్లాడుకోండి..

  నవ్వు అనేది ఎవరైనా ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జోక్ గాని వ్యంగ్య మాటలను కాని, పంచ్ లను గానీ పేల్చండి. అది మీ భాగస్వామిని నవ్వించగలిగితే మీ డేట్ కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కానీ దారుణమైన పంచ్ లు, బోరింగ్ జోకుల జోలికి మాత్రం అస్సలు పోవద్దు. ఎందుకంటే అలాంటి వాటి వల్ల మొదటికే మోసం రావచ్చు. ఇందుకు సంబంధించి శేఖర్ ఇలా అంటున్నాడు. ''కొన్ని జోకులు మరీ దారుణంగా ఉంటాయి. నాకొక అమ్మాయితో డేట్ కు వెళ్లడం బాగా గుర్తుంది. ఆమె తన జోకులకు తానే నవ్వుకునేది. అప్పుడు నాకు చాలా బోరింగ్ గా అనిపించింది'' అని చెప్పాడు.

  గమనిక : వ్యక్తుల గోప్యత దృష్ట్యా పేర్లు మరియు వివరాలు మార్చబడ్డాయి.
మీరు మీ భాగస్వామితో తొలిసారి డేటింగ్ కు సిద్ధమవుతున్నారా? డేటింగ్ కు ఫస్ట్ టైమ్ వెళుతున్నామని ఆందోళన చెందుతున్నారా? మీరు ఏమి ధరించాలో, లేదా ఏమి మాట్లాడాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారా? అయితే మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ భాగస్వామిని ఫస్ట్ డేటింగ్ లో ఎలా ఆకట్టుకోవాలో చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాం.