Back
Home » ഏറ്റവും പുതിയ
ఫైబర్ డేటా వార్ మొదలైంది,పోటీపడుతున్న కంపెనీలు ఇవే
Gizbot | 9th Sep, 2019 12:12 PM
 • రిలయన్స్ జియో గిగాఫైబర్

  జియో ఫైబర్‌లో మొత్తం ఆరు రకాల ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఇందులో బ్రాంజ్ (రూ.699), సిల్వర్ (రూ.849), గోల్డ్ (1,299), డైమండ్ (రూ.2,499), ప్లాటినం (రూ.3,999), టైటానియం (రూ.8,499) ప్లాన్లు ఉన్నాయి. బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లలో డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్ కాగా, గోల్డ్, డైమండ్‌ ప్లాన్లలో రూ.250/500 ఎంబీపీఎస్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో 1జీబీపీఎస్ డేటా స్పీడ్ లభిస్తుంది. ఈ ప్లాన్లలో మూడు నెలలు, 6 నెలలు, ఏడాది ప్లాన్లు ఉన్నాయి. జియో ఫైబర్‌లోని అన్ని ప్లాన్లలోనూ డేటాను అపరమితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, బ్రాంజ్ ప్లాన్‌లో 100జీబీ నుంచి టైటానియం ప్లాన్‌లో 5000 జీబీ వరకు పీయూఎఫ్ పరిమితి ఉంది. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌తోనూ హోం ల్యాండ్‌లైన్ సర్వీస్ లభిస్తుంది. టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, 5 డివైజ్‌ల వరకు నార్టన్ యాంటీ వైరస్ లభిస్తుంది.


 • Airtel V-Fiber 

  ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును నెలకు రూ.799 నుంచి ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ద్వారా 40Mbps స్పీడ్ తో నెట్ ను యూజర్లు పొందవచ్చు.అలాగే ఎంటర్ టైన్ డేటా ప్లాన్ కింద నెలకు రూ.1,099 చెల్లిస్తే 100Mbps స్పీడ్‌తో 300GB వరకు డేటా లిమిట్ పొందవచ్చు. అదనంగా 1000GB బోనస్ డేటాను ఢిల్లీ సర్కిల్ లో ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 ప్రీమియం, ఎయిర్ టెల్ టీవీ ప్రీమియం వంటివి ఉచితంగా పొందవచ్చు.


 • Tata Sky బ్రాడ్ బ్యాండ్

  టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రారంభ ధర నెలకు రూ.999 నుంచి ఆఫర్ చేస్తోంది. రూ.999తో రీఛార్జ్ చేసుకుంటే 25Mbps స్పీడ్ డేటాను పొందవచ్చు. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసు కంటే ఇది తక్కువనే చెప్పాలి. ఈ డేటా ప్లాన్‌లో ఎలాంటి డేటా లిమిట్ ఆఫర్ లేదు. ఉచితంగా రూటర్ పొందవచ్చు. రూ.1599 డేటా ప్లాన్ ద్వారా 100Mbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందులో జియో ఫైబర్ సర్వీసు మాదిరిగా ఉచితంగా ఇన్ స్టాలేషన్ ఆఫర్ లేదు.


 • ACT Fibernet : 

  యాక్ట్ ఫైబర్ నెట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో కూడా మంచి డేటా ఆఫర్లు ఉన్నాయి. యాక్ట్ సిల్వర్ ప్రొమో కింద ప్రారంభ ధర రూ.749 ప్లాన్ పొందవచ్చు. ఈ డేటా ప్లాన్ పై 100Mbps స్పీడ్‌తో 500GB వరకు డేటా లిమిట్ పొందవచ్చు. యాక్ట్ ప్లాటీనం ప్రొమో ప్లాన్ కింద ACT ఫైబర్ నెట్ 150Mbps స్పీడ్ తో 1000GB డేటా లిమిట్ అందిస్తోంది. అంతేకాకుండా ACT ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ యాక్టివేషన్ ద్వారా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం సర్వీసులైన Netflix సబ్ స్రిప్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.


 • BSNL Bharat Fiber

  బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ స్పీడ్ 50Mbps నుంచి 100Mbps వరకు ఉంటుంది. దీని ప్రారంభ ప్లాన్ ధర రూ. 777. ఈ ప్లాన్లో 50Mbps స్పీడుతో 500 జిబి డేటాను అందించడం జరుగుతుంది. రెండవ ప్లాన్ రూ.849లో 50Mbps స్పీడుతో 600 జిబి డేటాను అందించడం జరుగుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్ తన భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికల జాబితాలో రూ.849, రూ .1,277, రూ .2,499, రూ .4,499, రూ .5,999, రూ .9,999, రూ .16,999 ప్రణాళికలను అందించింది. .1,277 భారత్ ఫైబర్ ప్లాన్ ఇది వినియోగదారునకు 100 Mbps వేగంతో 750GB డేటాను మరియు FUP వేగంతో 2 Mbps ను అందిస్తుంది.రూ .2,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లో 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 40 జిబి డేటాను మరియు ఎఫ్‌యుపి వేగం తరువాత 4 ఎమ్‌బిపిఎస్‌ వేగంతో అందిస్తుంది. అలాగే రూ.4,499 ప్లాన్ కూడా 55 జీబీ డైలీ డేటాను అందిస్తుంది. రూ.5,999 ప్లాన్‌లో 80 జీబీ డైలీ క్యాప్ ఉంటుంది. రూ.9,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యూజర్‌కు 120 జీబీ డైలీ డేటాను అందిస్తుంది. చివరగా రూ.16,999 ప్లాన్ 170 జీబీ డైలీ డేటాతో వస్తుంది. పైన పేర్కొన్న అన్ని బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాలింగ్ సర్వీస్ ను అందిస్తాయి.
ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ప్రారంభించారు. ఇక వాటికి గాను ఫోన్ ల్యాండన్ లైన్ సర్వీసులు, సెట్‌టాప్ బాక్స్, కంటెంట్ పార్టనర్‌షిప్స్, ప్రివ్యూప్లాన్ మైగ్రేషన్ ఇతర పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. మరి జియో ఫైబర్ తో పోటీపడే ప్లాన్లు మార్కెట్లో ఏమైనా ఉన్నాయోమో ఓ సారి చెక్ చేద్దాం.