Back
Home » సంబంధాలు
ఆన్ లైన్ డేటింగులో అన్ని అబద్ధాలేనా..?
Oneindia | 10th Sep, 2019 06:07 PM
 • యువత అనుభవాలేంటో చూద్దాం..

  ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల వయసున్న శ్రుతి అనే ఒక విద్యార్థి బోల్డ్ స్కైతో తన అనుభవాన్ని పంచుకుంది. ''నేను ఫేస్ బుక్ లో ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నాను. మరియు ప్రారంభంలో అతను చాటింగ్ కు చాలా వ్యసనపరుడని నిర్ధారించుకున్నాను. అంతలోనే మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించాము. ఆ వ్యక్తి తనకు 22 సంవత్సరాల వయస్సు అని చెప్పుకున్నాడు. తను ఒక బ్యాంకులో పని చేస్తున్నానని చెప్పాడు. నేను అతనిని కలవమని అడిగినప్పుడు మాత్రం అతను అబద్ధాలు చెప్పేవాడు. నేను చాలా బిజీగా ఉన్నానని, లేదా సిటీకి దూరంగా ఉన్నాను అని చెప్పేవాడు. అలా కలవడానికి తిరస్కరించేవాడు. నాకు అనుమానం వచ్చింది. వీడియో కాల్ చేయమని చెప్పాను. వీడియో కాల్ చేశాడు కాని అతను ఎప్పుడూ తన ముఖాన్ని వీడియోలో చూపించలేదు. నాకు అనుమానం ఇంకా ఎక్కవ అయ్యింది. అందుకే నేను అతనికి తెలియకుండా రహస్యంగా అతని అడ్రస్ కు వెళ్లాను. అంతే అతనిని చూసి తీవ్ర షాక్ కు గురయ్యాను. ఎందుకంటే అతని వయస్సు 32 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీంతో నాకు చాలా కోపం వచ్చింది. నేను వెంటనే అతన్ని నిలదీశాను. ఎందుకు ఇలా అబద్ధమాడారు అని అడగగా, అతను 'తన జీవితంలో కొంత ఆనందం కోరుకున్నాను' అని చెప్పాడు. అంతే కాదు ఆయన వయస్సు ఎంత అని కూడా అడిగాను. భయపడిన అతను తన నిజమైన వయసును కూడా చెప్పాడు. అంతే వెంటనే అతన్ని రిజెక్ట్ చేసి వచ్చేశాను'' అని ఆ యువతి చెప్పింది.

  బీహార్ రాజధాని పాట్నాకు చెందిన అనిత (20) అనే మరో యువతి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒక అబ్బాయిని కలిసిన మరో కథ ఇది. ఒక బాలుడు అనితకు పరిచమయ్యాడు. దీంతో ఆ బాలుడు అనితను సంప్రదించాడు. వారు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒకరితో ఒకరు చాట్ చేయడం ప్రారంభించారు. చివరికి మొబైల్ నెంబర్లను కూడా మార్చుకున్నారు. ఆ బాలుడు కూడా తన పేరు, ఉద్యోగం, చిరునామా గురించి అబద్ధం చెప్పాడని మరియు ఇతర అనేక అబద్ధాలను చెప్పాడని అనితకు తరువాత తెలిసింది. '' ఆ బాలుడు నన్ను ఎప్పుడూ సందర్శించలేదు మరియు అతని వయస్సు మరియు అతని ఉద్యోగం గురించి నాకు తెలిపేందుకు ఆసక్తి చూపలేదు. అంతేకాదు, అతను తన ఫొటోలను షేర్ చేసుకోవడానికి కూడా నిరాకరించాడు'' అని ఆమె గుర్తు చేసుకుంది. ఇంతటి ఘోరమైన అబద్ధాలను తట్టుకోలేక విసిగిపోయిన ఆమె ఆ బాలుడితో సంబంధాన్ని తిరస్కరించడమే కాకుండా శాశ్వతంగా ముగించింది. ఆమె ప్రకారం ''బాలుడు కేవలం కాలక్షేపం చేయాలని కోరుకున్నాడు. అందుకే అతని వాస్తవ వివరాలను వెల్లడించలేదు''.

  ఢిల్లీకే చెందిన రోహిత్ (25) బోల్డ్ స్కైతో మాట్లాడుతూ, ''నేను నా ప్రస్తుత ప్రేయసిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కలుసుకున్నాను. మేము ఒకరితో ఒకరు చాట్ చేయడం ప్రారంభించాము. మేము డేటింగ్ ప్రారంభించినప్పుడు, ఆమె తన చిరునామాను వెల్లడించలేదు. వ్యక్తిగతంగా కలవడానికి కూడా నిరాకరించింది. కానీ మేము ఫొటోలు ఇతర వివరాలను పంచుకున్నాము. కానీ నేను మోసం చేస్తానేమో అని ఆమెకు అనుమానం వచ్చింది. అయితే, చివరికి మేము కలుసుకున్నాము. ఇప్పుడు ఆమె బాగానే ఉంది. ''కాబట్టి పైన పేర్కొన్న అనుభవాల నుండి, ఈ క్రింది కారణాల వల్ల ఆన్ లైన్ లో డేటింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది అబద్ధాలు చెప్పవచ్చు.


 • కాంటాక్ట్ కట్ అవుతుందని భయం..

  చాలా మంది వ్యక్తులు వారి వయస్సును కరెక్ట్ గా చెబితే కాంటాక్ట్ ఎక్కడ కట్ అవుతుందో అన్న భయంతో వారు సరైన వయస్సు చెప్పకపోవచ్చు. అందుకనే వారి నిజమైన ఫొటోలను షేర్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. వారు వారి వయస్సు, నిజమైన వయస్సు కంటే చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతుంటారు.


 • సాధారణ సంబంధాలనే ఇష్టపడతారు..

  కొన్నిసార్లు చాలా మంది వ్యక్తులు సాధారణ సంబంధం కలిగి ఉండేందుకే ఇష్టపడతారు. లోతైన లేదా దగ్గర సంబంధాల కోసం అంతగా ఆసక్తి చూపరు. ఈ కారణంగా, వారి నిజమైన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం వారికి రాకపోవచ్చు. ఇలాంటి వ్యక్తులు కొంతకాలం తర్వాత నిజాలు మాట్లాడవచ్చు. కానీ అతను/ఆమె అబద్ధాల గురించి తెలుసుకుంటే వారు తమ ఆన్ లైన్ డేటింగ్ భాగస్వామిని బాధపెడతారు. అసభ్యంగా మాట్లాడుతూ అర్థం లేకుండా ఒకరిని డంప్ చేయడానికి కొత్త బ్రేక్ - అప్ స్ట్రాటజీగా మారుతుందని భావిస్తారు.


 • భద్రతా పరమైన ఆందోళనలు..

  చాలా మంది తమ గురంచి, తమ భద్రత గురించి ఆందోళన చెందుతారు. మరియు వారి వివరాలను పంచుకోవటానికి ఇష్టపడరు. కానీ వారు ఆన్ లైన్ లో డేటింగ్ చేస్తున్న వ్యక్తుల గురించి కచ్చితమైన వివరాలు తెలియగానే వారి వివరాలను కూడా వెల్లడిస్తారు.


  గమనిక : వ్యక్తుల గోప్యతను కాపాడటానికి పేర్లు, వారి వివరాలు మార్చబడ్డాయి.
మీరు ఆన్ లైన్ డేటింగ్ లో ఉన్నారా? లేదా కొత్తగా ఆన్ లైన్ డేటింగ్ ను ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే ఆన్ లైన్ డేటింగులో అధిక శాతం అబద్ధాలే ఉంటాయని, అసలు వివరాలు అక్కడక్కడా కనిపిస్తాయని, అవి కూడా వ్యక్తిగతంగా కలిసేంత వరకు నమ్మలేమని పలువురు చెబుతున్నారు. సో ఈరోజు స్టోరీలో ఈ ఆన్ లైన్ డేటింగ్ లో ఎలాంటి అబద్ధాలు మాట్లాడుకుంటారో.. ఏయే వివరాలు ఫేక్ గా ఉంటాయో తెలుసుకుందాం.

ఒకవేళ మీరు ఆన్ లైన్ లో కలిసిన వ్యక్తిని మీరే ప్రస్తుతం కలవడానికి వెళ్లారని అనుకుందాం. అతను/ఆమెను దృష్టిలో పెట్టుకుని మీరు మంచి బట్టలను వేసుకుంటారు. మంచి పరిమళం వెదజల్లే స్ప్రే లేదా సెంట్లను వాడతారు. మంచిగా టిప్ టాప్ గా తయారవుతారు. అంతే కాదు మీరు వారిని కలిసినపుడు ఎలాంటి పంచ్ లు లేదా జోక్స్ వేయాలో రిహార్సల్ కూడా చేస్తారు. అలా మీరిద్దరు కలుసుకునే చోటుకు చేరుకుంటారు. అంతలోనే మీ నవ్వుతున్న ముఖం అకస్మాత్తుగా షాక్ కు గురవుతుంది. ఎందుకంటే మీరు చాట్ చేస్తున్న వ్యక్తి అతను/ఆమె మీరు అనుకున్న దాని కంటే వికారంగా ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఆ వ్యక్తి అతను/ఆమె వయసు పైబడిన వారిగా చాలా వికారంగా కనిపిస్తారు. దీంతో ఆ సమయంలో మీకు ఏమి చేయాలో అర్థం కాకపోవచ్చు. అంతేకాదు మీకు వారు ద్రోహం చేసినట్లు అనిపించవచ్చు. ఇది మనలో ఎవరితోనైనా జరగవచ్చు. ఆన్ లైన్ డేటింగ్ ప్రారంభ రోజుల్లో వ్యక్తిగతంగా కలవడం ఉండకపోవచ్చు కాబట్టి, చాలా మంది ప్రజలు తమ గురించి అబద్ధాలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు.