Back
Home » సంబంధాలు
ఈ కొత్త రకమైన కండోమ్ ల గురించి మీకు తెలుసా..
Oneindia | 26th Sep, 2019 06:22 PM
 • ఇది వాడితే ఇన్ ఫెక్షన్ ను నివారించొచ్చు.

  శృంగారంలో మీకు కావాల్సినంత సుఖం దొరుకుతుంది. కానీ అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీకు సుఖవ్యాధులు వచ్చే ప్రమాదముంది. అందుకే సురక్షితమైన శృంగారం కోసం కండోమ్స్ ను ఉఫయోగించాలి. దీని వల్ల అవాంఛిత గర్భం, ఇన్ ఫెక్షన్ వంటి మొదలైన వ్యాధులను నివారించవచ్చు.


 • ఓరల్ సెక్స్..

  ఈ మధ్య శృంగార ప్రియుల కోసం సురక్షితమైన సెక్స్ కోసం సాధారణ కండోమ్ ల మాదిరిగానే ఇప్పుడు డెంటల్ డ్యామ్ (దంత ఆనకట్ట) అంటే నోటి కండోమ్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. దీనిని ఓరల్ సెక్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంతకీ ఓరల్ సెక్స్ అంటే ఏమిటో తెలుసా. మీరు మీ భాగస్వామి యొక్క జననాంగాలను మీ నోరు, పెదాలు లేదా నాలుకతో ఉత్తేజపరిచే విధానాన్నే ఓరల్ సెక్స్ అంటారు. దీన్ని వారి పురుషాంగం (ఫెలాషియో అని కూడా అంటారు), యోని, వల్వా లేదా క్లిటోరిస్ (కన్నిలింగస్), లేదా పాయువు (అనిలింగస్)ను పీల్చడం లేదా నొక్కడం వంటివి కలిగి ఉంటుంది.


 • రక్త ప్రసరణను నిరోధించవచ్చు.

  స్త్రీ పై నోటితో సెక్స్ చేస్తున్నప్పుడు మీ భాగస్వామి యొక్క యోనిలోకి గాలిని ఊదకుండా చూసుకోండి. ఆ గాలి అకస్మాత్తుగా మీ రక్తనాళంలోకి వెళితే రక్తం గడ్డకట్టి రక్త ప్రసరణను నిరోధించవచ్చు. (ఎయిర్ ఎంబోలిజం), అందువల్ల మీ భాగస్వామికి మరియు గర్భంలోని పిండానికి కూడా ఇది ఒక ప్రమాదకరిగా ఉంటుంది. ఇది తరచుగా జరగదు. కానీ మౌత్ సెక్స్ చేసే జంటలు ఇలాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి.


 • సుఖ వ్యాధుల నుండి రక్షణ..

  డెంటల్ డ్యామ్ ల తయారీలో రబ్బరు పాలు లేదా పాలియురేతిన్ వంటి సాగిన పదార్థాలను ఉపయోగిస్తారు. దీని ద్వారా సుఖవ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. ఓరల్ సెక్స్ సమయంలో యోని, పురుషాంగం చుట్టూ నోరు, నాలుక మరియు పెదవులతో స్పర్శ ఉంటుంది గనుక దీని వల్ల లైంగిక సంక్రమణ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే దీని నివారణకు డెంటల్ డ్యామ్(నోటి కండోమ్)లను ఉపయోగిస్తారు.


 • కలర్ ఫుల్ గా..

  డెంటల్ డ్యామ్ చాలా సన్నగా మరియు పరిమాణంలోనూ చాలా చిన్నగా ఉంటుంది. నోటితో సంబంధం ఉన్న ఈ వస్తువును, దీని ఉపయోగం నోటికే ఎక్కువగా ఉంటే దానిని నోటి కండోమ్ అంటారు. ఇది ఓరల్ సెక్స్ సమయంలో ఇన్ఫెక్షన్లు మరియు లైంగిక సంక్రమణల వ్యాధుల నుండి రక్షిస్తుంది. అంతేకాదు ఈ డెంటల్ డ్యామ్ అనేక రంగులలో ఉండి రసిక ప్రియులను బాగా ఆకర్షిస్తుంది. ఇది సాధారణంగా స్కైర్ డిజైన్ లో ఉంటుంది. ఇందులో నుండి సుగంధభరితమైన వాసన వస్తుంది. దీనిపై ఎలాంటి ల్యూబ్ వేయకుండా చేయవచ్చు.


 • ఇదొక ప్రత్యామ్నాయం..

  సాధారణ కండోమ్ ల మాదిరిగానే డెంటల్ డ్యామ్ కండోమ్ లను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇదొక సురక్షితమైన ప్రత్యామ్నాయం గనుక. ప్రారంభంలో ఇది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ మీ సన్నిహితులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


 • దీన్ని వాడేటప్పుడు ఈ విషయాలను గుర్తంచుకోండి..

  డెంటల్ డ్యామ్ ను ఉపయోగించేటప్పుడు ఏ విషయాలను గుర్తంచుకోవాలంటే.. అది చాలా సున్నితమైన ప్రదేశాలలో ఉపయోగించబడుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఈ కండోమ్ ల ప్యాకెట్ ను తెరిచి, చదరపు లేదా దీర్ఘచతురస్రకారపు షీట్ ను మీ భాగస్వామి యొక్క ప్రైవేట్ పార్ట్ పైన ఉంచండి. ఈ స్థలాన్ని నోటితో ప్రత్యక్ష సంబంధంలోకి రాకుండా చేస్తుంది. రబ్బరు పాలతో చేసిన డెంటల్ డ్యామ్ లను మాత్రమే వాడండి. డెంటల్ డ్యామ్ ను ఉపయోగించిన తర్వాత, దాన్ని మరోసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. నేరుగా డస్ట్ బిన్ లోనే వేసేయండి.


 • సంపర్కానికి ముందు..

  సాధారణంగా చాలా మంది లైంగిక సంపర్కానికి ముందు లేదా అందుకు బదులుగా ఓరల్ సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. మీరు మీ భాగస్వామితో ఓరల్ సెక్స్ చేయడానికి నిర్ణయించుకుంటే, మీకు ఇద్దరికి ఇందులో సుఖం కలిగేంత వరకు విభిన్ని పద్ధతలను ప్రయత్నించొచ్చు. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా గర్భవతి అయ్యే ప్రమాదం లేదు.


 • మీరు చేయాల్సినవి..

  మీరు ఓరల్ సెక్స్ లో పాల్గొనే ముందు ప్రతిసారీ ఆ ప్యాకెట్ లోని ఎక్స్ పైరీ డేట్ ను తప్పకుండా చెక్ చేసుకోవాలి.
  అందులో ఎలాంటి లోపాలు, కన్నీళ్లు లేవని నిర్ధారించుకోవాలి.
  ఓరల్ సెక్స్ ప్రారంభించే ముందు ధరించండి మరియు పూర్తయ్యే వరకు ఉంచండి.
  విచ్ఛిన్నతను నివారించడానికి నీటి ఆధారిత లేదా సిలికాన్ ఆధారిత కందెనను వాడండి.
  ఈ కండోమ్ ప్యాకెట్లను చల్లని, పొడి ప్రదేశాలలో మాత్రమే నిల్వ చేయండి.
  మీ భాగస్వామి యొక్క శరీరం గురించే ముందే తెలుసుకోవాలి.
  మీ భాగస్వామి కాన్పుకు దగ్గరగా ఉన్న సమయంలో మౌత్ సెక్స్ ను మానివేయాలి. ఎందుకంటే ఉద్వేగం కారణంగా ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.


 • మీరు చేయకూడనివి..

  డెంటల్ డ్యామ్ కండోమ్ ను తిరిగి అస్సలు ఉపయోగించొద్దు.
  దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విస్తరించడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఇది చిరిగిపోయేలా చేస్తుంది.
  చికాకు కలిగించే నోనాక్సినాల్-9(స్పెర్మిసైడ్)ను ఉపయోగించొద్దు.
  బేబీ ఆయిల్, పెట్రోలియం జెల్లీ, లేదా వంట నూనె వంటి చమురు ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించొద్దు. ఎందుకంటే వాటి దెబ్బకు డెంటల్ డ్యామ్ లు విరిగిపోతాయి.
రిలేషన్ షిప్ లో తమ ప్రేమను వ్యక్తీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది ప్రేమ లేఖలతో, మరికొంతమంది మంచి బహుమతులతో, ఇంకొంతమంది ప్రియుడు లేదా ప్రియురాలిని ఆశ్చర్యపరిచే ప్రాంతాలకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తారు.

ఈ శృంగార బంధంలో చిక్కుకున్న పురుషులు, స్త్రీలు ఆ సమయంలో మాత్రం ప్రపంచాన్నే మరచిపోతారు. కేవలం తమ సుఖాన్నే వారు కోరుకుంటారు. అది వారికి అందమైన అనుభూతిలా అనిపిస్తుంది. కానీ అలా నిత్యం చేస్తే మహిళలకు ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చదవండి.