Back
Home » సంబంధాలు
ఈ టిప్స్ ఫాలో అయితే అమ్మాయిలు మీతో డేటింగుకు సిద్ధమవుతారని తెలుసా..
Oneindia | 27th Sep, 2019 01:58 PM
 • 1) డేటింగ్ అంటే..

  డేటింగ్ ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది. అయినా తెలియని వారి కోసం డేటింగ్ అంటే మరోసారి తెలియజేస్తున్నాం. అమ్మాయి లేదా అబ్బాయి తమకు నచ్చిన లేదా తెలియని కొత్త వ్యక్తితో బయటకు వెళ్లి మనసు విప్పి ముచ్చట్లను పంచుకుంటూ తమ ఇష్టఇష్టాలను తెలుసుకోవడాన్నే డేటింగ్ అంటారు. ఈ డేటింగ్ సహాయంతో చాలా మంది తమకు నచ్చిన వారిని ప్రేమిస్తున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు సైతం చేసుకుంటున్నారు. అయితే ఎంత కాదన్నా ఈ డేటింగ్ ద్వారా ఓ వ్యక్తిని అసలు చూడకుండానే, అసలు ఎలా ఉంటారో తెలియకుండానే వారితో మాట్లాడటం లేదా డేటింగ్ చేయొచ్చా లేదా అనేది మీరే విచారించుకుని నిర్ణయించుకోవాలి.


 • 2) మైండ్ లో ముందే ప్రీపేర్ కండి..

  మీరు ఎవరైన మహిళ దగ్గరికి వెళ్లడానికి ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో గందరగోళానికి గురి కావొద్దు. డేటింగ్ కోసం ఓ మహిళను అడగాలనుకుంటే మీరు మీ మైండ్ ను ముందే ప్రిపేర్ చేసుకోండి. మీరు మీ మైండ్ ముందే ప్రిపేర్ చేసుకోలేకపోతే ఆమె వద్ద మీరు సరైన మాటలను మాట్లడలేరు. గందరగోళంగా మాట్లాడొచ్చు. ఇలా మీరు ఆమెను డేటింగ్ కు వచ్చే అవకాశాన్ని కోల్పోవచ్చు.


 • 3) సంతోషంగా ఉండండి..

  ఎలాంటి అమ్మాయి అయిన సంతోషంగా ఉండే వారిని సులభంగా ఇష్టపడతారు. మీరు ఆమెను డేటింగ్ కోసం అడగడానికి వెళ్ళినప్పుడు మీరు సంతోషంగా ఉన్నట్లు నవ్వుతూ ఉన్నట్లు నిర్ధారించుకోండి. ఒకటికి రెండు సార్లు మీ ఫేసులో స్మైల్ కనిపించేలా అద్దంలో చెక్ చేసుకోండి. ఇది ప్రశాంతంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. అప్పుడే ఆమె మీకు దగ్గరగా నడవడం చేస్తారు. అంతేకాదు మీరు చెప్పే విషయాలను కూడా చక్కగా వింటారు. ఒకవేళ ఆత్రుతగా మరియు ఆందోళనగా ఉంటే మీరు ఒకేలా కనిపించే ప్రమాదం ఉంది.


 • 4) డేటింగ్ అన్న పదాన్ని వాడొద్దు..

  మీరు డేటింగ్ అడగాలనుకుంటున్న అమ్మాయిలకు డైరెక్టుగా డేటింగ్ కు వెళదామా అని మాత్రం అడగకండి. ఒకవేళ మీరు ఇలా అడిగితే ఇదివరకే మీకు ఈ అలవాటు ఉందని, మీరు చాలా హద్దు మీరుతున్నారని అనుకుంటారు. ఇందుకు ఆమె భయపడొచ్చు. అంతేకాదు అప్పటివరకు మీతో ఉన్న రిలేషన్ షిప్ ను కట్ చేయొచ్చు. ఎందుకంటే వారు మీలాగా ఆలోచించరు. అందుకనే డేటింగ్ అన్న పదానికి బదులు మీరు ఇలా అడగొచ్చు 'మనం టీ లేదా కాఫీ కోసం వెళదామా?' లేదా 'మీరు నాతో విందు చేయాలనుకుంటున్నారా' అని అడిగితే అమ్మాయిలు అద్భుతంగా ఫీలవుతారు. వెంటనే మీతో పాటు బయటకు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తారు.


 • 5) రెస్పాన్స్ కోసం వెయిట్ చేయండి..

  మీరు మీతో పాటు బయటకు వెళదామని ఆమెను కోరిన వెంటనే మీరు అసహనానికి గురవ్వొద్దు. మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నా లేదా ఇంకేదైనా ఇతర కారణం అయినా సరే మీరు ఆమె స్పందన కోసం వేచి ఉండండి. ఆమె బాడీ లాంగ్వేజ్ లో రియాక్షన్ కోసం వెతకండి. ఎందుకంటే మీతో ఆమె బయటకు వచ్చే ముందు ఆమె ఆలోచించుకోవడానికి కొంతసమయం కావాలి. లేదా ఆమె తన తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. అందువల్ల, ఆమె దగ్గర మనం వికారంగా ప్రవర్తించే కంటే ప్రశాంతంగా ఉండటం మంచిది. ఆమె టైమ్ తీసుకుని ఆమె ఆలోచనలను పంచుకోవడం సరైందేనని చెప్పండి. అప్పుడు మీరు ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నారని, ఇందుకు ప్రతిఫలంగా ఆమెను డేటింగ్ కోసం బయటకు తీసుకెళ్లేందుకు అవకాశాలు పెరుగుతాయి.


 • 5) నిరాశతో ఉండటం మానుకోండి..

  మీతో పాటు ఆమె బయటకు వెళ్లడానికి అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా నిరాశంగా ఉండొద్దు. డేటింగుకు సంబంధించి ఆమె కొంత సమయం అడిగితే, కొంచెం వెయిట్ చేయండి. పదే పదే అవే ప్రశ్నలు అడిగి ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. దీని ద్వారా మీ ఉద్దేశాలు మంచివి కాదని ఆమెకు సంకేతాలు వెళతాయి. అందువల్ల భవిష్యత్తులో మీతో బయటకు రావడానికి ఆమె పూర్తిగా తిరస్కరించవచ్చు.


 • 6) ఒక మ్యూచువల్ ఫ్రెండ్..

  మీరు డ్రీమ్ గర్ల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు మ్యూచువల్ ఫ్రెండ్ సహాయాన్ని తీసుకోవచ్చు. మీతో ఆమె బయటికి రావడానికి ఆమెకు ఆసక్తి ఉందా లేదా అని వారిని అడగండి. అందుకు తగ్గట్టు పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. మీ మంచి లక్షణాల గురించి మాట్లాడటానికి మరియు ఆమెను ఒప్పించమని మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. అలాగే ఆమెకు ఇష్టమైన రెస్టారెంట్ గురించి తెలుసుకోవడానికి వారిని సహాయం అడగొచ్చు. విందు కోసం వెళ్లమని మీ తరపున అభ్యర్థించమని మీ స్నేహితులను మీరు అడగొచ్చు.


 • 7) నమ్మకంగా ఉండండి..

  మహిళలు ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉన్న పురుషులను ప్రేమిస్తారు. పరిస్థితులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి బాగా తెలుసు. అందుకే మీరు భయంగా మరియు ఆందోళనకరంగా కనిపించొద్దు. మీరు ఆమెను డేటింగ్ గురించి అడుగుతున్నప్పుడు నమ్మకంగా ఉండండి. డేటింగులో మీతో వెళ్దామని మీరు ఇప్పటికే ఆమెను కోరినప్పటికీ ఆమె ప్రతిస్పందన కోసం వేచి ఉండండి. కాన్ఫిడెన్స్ మీ ముఖం మీద కనిపించేలా చూసుకోండి. అంతేకాదు అతిగా ఆలోచించడం మానుకోండి. అందుకే నిజాయితీగా ఉండటం మంచిది.

  ఈ టిప్స్ డేటింగ్ కోసం వెళ్లాలనుకునేవారికి ఉపయోగపడతాయని భావిస్తున్నాం. ఆల్ ది బెస్ట్
డేటింగ్.. నేటి తరం యూత్ ఎంతగానో ఇంట్రస్ట్ చూపిస్తున్న ట్రెండ్.. మారిన కాలంతో పాటు యువత తీరు, ప్రవర్తనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇద్దరి మధ్య పరిచయం, ముచ్చట్లు, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు అన్ని అతి తక్కువ కాలంలోనే అయిపోతూనే ఉన్నాయి. అయితే కొంతమంది అబ్బాయిలు ఇప్పటికీ డేటింగ్ అంటే ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారు. డేటింగ్ కేవలం అదొక్కటే అనే భ్రమలో ఉన్నారు. ఆ భయంతోనే అమ్మాయిలను డేటింగ్ కు పిలవాలని ఉన్నా పిలవలేకపోతున్నారు. అలాంటి అబ్బాయిల కోసమే మేము కొన్ని టిప్స్ తీసుకొచ్చాము. ఆ అద్భుతమైన టిప్స్ ఫాలో అయితే మీరు కూడా డేటింగ్ లో డేర్ అండ్ డ్యాషింగ్ గా దూసుకుపోవచ్చు.

మహిళలను డేటింగ్ కు పిలిచేటప్పుడు ఒక మహిళ దగ్గర పనిచేసే వ్యూహం మరో స్త్రీ దగ్గర పనిచేయదు. ఎందుకంటే ఏ ఇద్దరు స్త్రీలు సమానంగా ఉండలేరు. అంటే ఆలోచనలు, అభిప్రాయాలలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కొంతమంది అబ్బాయిలు మాత్రం డేటింగ్ విషయంలో విజయవంతంగా దూసుకెళ్తుంటారు. వారితో విలువైన సమయాన్ని గడుపుతరు. కానీ చాలా మంది పురుషుల విషయంలో ఇది జరగదు. అందుకే అలాంటి అబ్బాయిల కోసమే కొన్ని చిట్కాలను సిద్ధం చేశాం.