Back
Home » సంబంధాలు
ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలను మీరు అస్సలు మిస్ అవ్వొద్దు.. ఎందుకంటే..
Oneindia | 1st Oct, 2019 05:46 PM
 • 1) నిన్ను నిజంగా ప్రేమించేవారు..

  నిన్ను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయి మీ గురించి మీరు చెప్పిన చిన్న సమాచారాన్ని కూడా బాగా గుర్తుంచుకుంటుంది. వారు మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిన్పుడు, మీకు ఏమి జరిగిందో వారు గుర్తుంచుకుంటారు. మొత్తం సమాచారన్ని వారి మెదడులో నిక్షిప్తం చేసి ఉంచుతారు. తర్వాత ఆ విషయాలు అన్ని చెప్పి మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని కోరుకుంటారు.


 • 2) తప్పుడు మార్గంలో వెళ్లనివ్వరు..

  నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు సలహా ఇచ్చేందుకు వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నిన్ను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయి ముఖంలో ఆ విషయం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి అవి మీకు సహాయం కూడా చేస్తాయి. అంతేకాదు వారు మిమ్మల్ని ఎప్పుడూ తప్పుడు మార్గంలో వెళ్లనివ్వరు.


 • 3) అనారోగ్యంతో ఉంటే..

  మీకు మీ గురించి ఎంత తెలుసో అన్న విషయం పక్కనబెడితే.. మీ జీవితంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటుంది. మీ స్నేహితులలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, వారు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు. వారు మీ కుటుంబానికి సొంతమని భావిస్తారు. ఇది వారి జీవితంలో అతి ముఖ్యమైన విషయం అని వారు భావిస్తారు.


 • 4) మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు..

  మీ కలలు, ఆశలు ఏంటో వారికి తెలుసు. మీ ప్రయత్నాలకు సైతం సానుకూలత వ్యక్తం చేస్తారు. మీరు సమస్యల్లో ఉన్న సమయంలో మీకు అండగా నిలబడతారు. అంతేకాదు ఎప్పటికీ విడిపోవాలని కోరుకోరు. మీ గురించే ఆలోచిస్తూ మీరు ఉండే వాతావరణంలోనే చింత చేస్తూ మీతోనే ఉండిపోతారు.


 • 5) మీ మనస్సును..

  మీ మనస్సు గురించి బాగా అర్థం చేసుకుంటారు. మీకు అవసరమైనప్పుడు ప్రేమగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు వారి నుండి ఏదైనా దాచాలని అనుకుంటే, వాటిని కూడా వారు తేలికగా తీసుకుంటారు. ఏక్షణంలోనైనా మీకు అవసరమో వారు ముందుగానే కనుక్కొంటారు.


 • 6) ఎప్పుడూ కలవరపెట్టరు..

  నిన్ను ప్రేమిస్తున్న స్త్రీ యొక్క అద్భుతమైన లక్షణాలలో ఇదొకటి. వారు ఇష్టపడే మరియు వారి ఆలోచనలు ఏమిటో తెలిపి మిమ్మల్ని ఎప్పటికీ కలవరపెట్టరు. మంచి లేదా చెడు అని వారు మీకు నేరుగా చెప్పేస్తారు. వారు మీతో మానసిక క్రీడలో ఎప్పుడూ మీ సమయాన్ని వృథా చేయరు. కాబట్టి మీరు వారితో ఉన్నప్పుడు, మీ స్థితి గురించి మీరు ఎప్పుడూ అయోమయం చెందకూడదు.


 • 7) మీరు లేనప్పుడు కూడా..

  మీరు లేనప్పుడు కూడా మిమ్మల్నే ప్రేమిస్తారు. మీ పేరు, మర్యాదలను కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే, మీతో ఉన్న వ్యక్తులు అనవసరంగా ఎగతాళి చేస్తే వారు మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతారు. ఆమె మిమ్మల్ని స్నేహితురాలిగా మాత్రమే కాకుండా భార్యగా కూడా రక్షిస్తుంది. అందుకే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి ఉంటే గమనించండి. అలాంటి వారినే వివాహం చేసుకోండి. అలాంటి మహిళలతో మీ జీవితాన్ని పంచుకోవడం వల్ల మీ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదు.
ప్రేమ, ప్యార్, ఇష్క్, ప్రీతి ఈ రెండు అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని రేపుతుందో ప్రేమలో పడ్డవారికే తెలుస్తుంది. పుస్తకాల్లో చదివినట్టు లేదా సినిమాల్లో చూసినట్టు రోమియో, జూలియట్, సలీమ్ అనార్కలి, లైలా, మజ్ను వంటి ప్రేమ కథలు ఎంత గొప్పగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రేమ అనేది విఫలమైతే అది చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ప్రేమకు చిహ్నంగా ఇప్పటికీ తాజ్ మహల్ గొప్ప ఉదాహరణగా చెప్పుకుంటాం. షాజహన్ ముంతాజ్ మీద ప్రేమతో కట్టిన ఆ తాజ్ మహల్ ఇప్పటికీ ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా నిలిచింది.

ఇక ప్రస్తుతం ప్రేమ విషయానికొస్తే చాలా మందికి తొలి చూపులోనే ప్రేమ అనేది ఏర్పడదు. మొదటగా చేదు అనుభవం లేదా ఇతర కారణాలు ఎదురవుతాయి. కానీ తర్వాత ప్రేమలో పడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది పురుషులు, స్త్రీలు ఇద్దరికీ వర్తిస్తుంది. పూర్వం తొలి చూపులోనే ప్రేమలో పడేవారు. కానీ ఇప్పుడు అలాంటి సీనే లేదు. ఎందుకంటే కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. మనుషుల్లోనూ చాలా మార్పులొచ్చాయి. ఏదీ ఏమైనా ఇప్పటికీ కొంతమంది స్త్రీలు మారలేదు. నిజాయితీగా, నిప్పులా బతుకుతున్నారు. అలా ఇప్పటికీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్న స్త్రీ మీ కోసం ఏమి చేస్తుందో.. ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోండి.. అలాంటి అమ్మాయిలను ఎప్పటికీ వదులుకోకండి.