Back
Home » సంబంధాలు
మీకు ఆ అలవాటు ఉందా? అయితే మీ జీవితం నాశనమైనట్టే..
Oneindia | 3rd Oct, 2019 05:14 PM
 • 1) మీకు అవమానకరంగా ఉంటుంది..

  ఒక వ్యక్తి మనసులో ఏమి జరుగుతుందో ఎవరూ చూడలేరు లేదా చదవలేరు. అందువల్ల మీ భాగస్వామి మీకు ఎప్పుడు ఎదురు తిరుగుతారో గ్యారంటీ లేదు. కాబట్టి మీరు మీ నగ్న లేదా అర్ధనగ్న ఫొటోలను లేదా వీడియోలను ఎవరితోనైనా పంచుకుంటున్నప్పుడు మీరు సమస్యకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టే. మీతో ఉన్నంతసేపు అలాంటి ఫొటోలు లేదా వీడియోలు గోప్యతగానే ఉంటాయి. మీ రిలేషన్ షిప్ ముగిసిన క్షణం మరియు మీ భాగస్వామి మీపై కోపంగా ఉంటే, అతను లేదా ఆమె మీ ఫొటోలను లేదా వీడియోలను ప్రతీకార చర్యగా ఇంటర్నెట్ లో పెట్టొచ్చు. ఇది మీకు చాలా అవమానకరంగా ఉంటుంది.


 • 2) ఒంటరితనానికి దారి తీస్తుంది..

  ఈరోజుల్లో కేవలం సందేశం లేదా వార్తలు ఇంటర్నెట్ లో ధావనంలా వ్యాపిస్తున్నాయి. మీ సున్నితమైన చిత్రాలు మరియు వీడియోలు ఆన్ లైన్ లోకి వెళ్లిన వెంటనే, మీ స్నేహితులు దీనికి ప్రాప్యత కలిగి ఉండొచ్చు. వారు మిమ్మల్ని మరియు మీ పాత్ర గురించి తీర్పు చెప్పే అవకాశం ఉంది. ఫలితంగా వారు మీతో అన్ని రకాల కనెక్షన్లను కట్ చేయొచ్చు. అలాగే, మీ తల్లిదండ్రులు మీ నుండి దూరంగా ఉండమని వారిని అడగవచ్చు. ఇది ఒంటరితనానికి దారితీస్తుంది.


 • 3) బెదిరింపులకు దారి తీస్తుంది..

  మీ నగ్న లేదా అర్ధనగ్న చిత్రాలు మరియు వీడియోలు ఇంటర్నెట్ లోకి వెళ్లినప్పుడు, మీరు బెదిరింపును ఎదుర్కొంటారు. ముఖ్యంగా సైబర్ - బెదిరింపుల్లో ఇంటర్నెట్ ద్వారా మిమ్మల్ని వేధిస్తారు. మీకు అసభ్యకరమైన సందేశాలను పంపవచ్చు. కొన్ని లైంగిక డిమాండ్లు కూడా చేయొచ్చు. ఇది మాత్రమే కాదు, మీ సహచరులు, స్నేహితులు మరియు మీ చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులు కూడా మీకు అభ్యంతరం చెప్పొచ్చు. లైంగిక వేధింపులకు గురిచేయొచ్చు.


 • 4) విశ్వాసం కోల్పోవచ్చు.

  మీకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్ లో మొత్తం అప్ లోడ్ అయితే మీరు కచ్చితంగా వేధింపులకు గురవుతారు. దీన్ని ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం మొత్తం అతనిని లేదా ఆమెను అసహ్యించుకుంటుంది. ఇది మీకు చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. మీరు మీ ఆత్మగౌరవం మరియు విశ్వాసం కోల్పోవచ్చు. కొన్ని సమయాల్లో ప్రజలు పరిణామాలను ఎదుర్కొనేంత ధైర్యంగా ఉండలేరు. తీవ్ర నిరాశనకు గురవుతారు.


 • 5) చట్టపరమైన పరిణామాలు...

  సెక్స్ టింగ్ చట్టపరమైన పరిణామాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి మిమ్మల్ని చాలా వెంటాడుతాయి. మీకు తెలియకపోయినా, మీరు లేదా మీ భాగస్వామి, ఎవరు తప్పు చేసినా, నగ్నత్వం మరియు అశ్లీల చిత్రాలను వ్యాప్తి చేసినందుకు అభియోగాలు మోపవచ్చు. ఆ ప్రైవేట్ చిత్రాలు మరియు వీడియోలను స్వీకరించిన మరియు ఫార్వార్డ్ చేసిన వ్యక్తి అశ్లీల చిత్రాలను స్వీకరించడానికి మరియు సరఫరా చేసేందుకు డబ్బు వసూలు చేయొచ్చు. మీరు చిత్రాలను ఇంటర్నెట్ లో ప్రసారం చేశారా లేదా అనే దానితో సంబంధం ఉండదు. మీరు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటారు.


 • 6) మీ భవిష్యత్ సంబంధాలపై ప్రభావం..

  సెక్స్ టింగ్ మీ భవిష్యత్ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది. కొద్దిరోజుల్లో పరిస్థితులు సాధారణం అవుతాయని అనుకుంటే పెద్ద పొరపాటే. ఆ పరిణామాలు జీవితాంతం ఉంటాయి. మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో మీరు ముందుకు సాగి కొత్త రిలేషన్ షిప్ పెంచుకున్నా, మీకు సంబంధించిన వ్యక్తులు మీ ప్రైవేట్ ఫొటోలు లేదా వీడియోలను ఇంటర్నెట్ లో ప్రసారం చేసిన చాలా కాలం తర్వాత కూడా చూడొచ్చు. అది గోప్యతపై హక్కు కలిగి ఉండకపోవడం అవుతుంది. ఎందుకంటే అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. మీరు అదే అవమానం మరియు బెదిరింపు ద్వారా మరోసారి వెళ్లవచ్చు.

  అందుకే మీరు మీ స్థాయిలో సన్నిహిత్యం పంచుకోవడం అస్సలు చెడ్డ విషయం కాదు. కానీ మీరు ఏమి చేస్తున్నారో మరియు దాని పర్యవసానాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. సెక్స్ టింగ్ లో పాల్గొనడానికి బదులుగా, మీరు మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను ఆస్వాదించడానికి ఇతర మార్గాలను అన్వేషించాలి. దానికి బదులు మంచి పదాలతో టెక్స్ట్ మెసెజ్ చేయాలి. ప్రాసలతో కూడిన పదాలను రాసి అవి ఎంత విలువైనవో చూపిస్తే అంతకంటే సన్నిహితం మరొకటి ఉండదు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. దాని వల్ల వచ్చే మంచి ఫలితంతో ఆనందంగా జీవించండి.
సెక్స్ టింగ్ అనే పదాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా మంది ఇదొక బూతు పదం అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఇందులో అంతా హాట్ మెసేజ్ లే ఉంటాయనే భ్రమలో ఉంటారు. కానీ ఇవేవీ కాదు. ఇంతకీ 'సెక్స్ టింగ్' అంటే ఏమిటంటే.. మీ స్మార్ట్ ఫోన్ నుండి (ఎవరైనా) తెలియని వారికి అసభ్యకరమైన ఫొటోలను లేదా మెసేజ్ లను పంపడం. సెక్స్ టింగ్ అనేది మన దేశంలో చాలా మంది ప్రజలకు హాట్ టాపిక్ అయితే, కొంతమంది మాత్రం రిలేషన్ షిప్ లో సెక్స్ టింగ్ ను ఇష్టపడరు. కానీ ఈరోజుల్లో చాలా మంది ప్రజలు తమ రిలేషన్ షిప్ లో మసాలు జోడించేందుకు మరియు ఎక్కువ కాలం సజీవంగా ఉండేందుకు వివిధ పద్ధతులతో ముందుకు వెళ్తున్నారు. అందులో వారి భాగస్వామికి 'సెక్స్ టింగ్' ఒకటి.

సెక్స్ టింగ్ వెనుక కారణం చాలా స్పష్టంగా ఉంది. మెసెజ్ లు, ఫొటోలు లేదా వీడియోలు నగ్నత్వం లేదా అర్థనగ్నత్వం లేదా లైంగిక చర్యలను కలిగి ఉండొచ్చు. వారి లైంగిక జీవితాన్ని మరింత హాట్ చేస్తుంది. కానీ ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటుంది. అదే సెక్స్ టింగ్ కూడా చేస్తుంది. మీరు దాన్ని గ్రహించకపోవచ్చు. సెక్స్ టింగ్ వల్ల మీ జీవితంలో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అది మీ జీవిత విచ్ఛిన్నానికి దారి తీసే రీతిలో ప్రభావం చూపుతుంది. మీరు మరియు మీ భాగస్వామి సన్నిహితంగా ఉన్నప్పటికీ, సెక్స్ టింగ్ వల్ల మీకు ఎదురుదెబ్బలు తగలొచ్చు. అలాంటి సందర్భాలేవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవండి.