Back
Home » సంబంధాలు
మీ భాగస్వామితో మీరు ఇబ్బంది పడుతున్నారా? దీనికి ఉత్తమ పరిష్కారమేంటో తెలుసా..
Oneindia | 4th Oct, 2019 01:00 PM
 • 1) మీ భాగస్వామి మీ సలహా తీసుకోరు..

  మీరు ఇష్టపడే వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం పట్ల మీరు స్పష్టంగా ఉంటారు. మీ భాగస్వామి మీ నుండి ఏదైనా సలహాలు తీసుకోవటానికి లేదా మీకు సలహా ఇవ్వడాన్ని పట్టించుకోకుండా ఉంటారు. మీరు వారికి విలువైన సలహాలు ఇచ్చినప్పుడు మీ భాగస్వామి కూడా మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉంది.


 • 2) మీతో విషయాలు పంచుకోరు..

  సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్నప్పుడు, వారు తమ సమస్యలను మరియు ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం ఉంది. కానీ మీ భాగస్వామి తన ఆలోచనలు లేదా భావాలను మీతో పంచుకోవడం ఆపివేస్తే, అతను లేదా ఆమె మిమ్మల్ని ఇకపై విశ్వసించరని అర్థం. అంతేకాదు మీ భాగస్వామి మీతో విషయాలను పంచుకోరు. ఇది కూడా ఒక సూక్ష్మ సంకేతం కావచ్చు.


 • 3) మీ భాగస్వామి కోల్డ్ బిహేవియర్..

  అతను లేదా ఆమె మీ పట్ల ఆసక్తి చూపటం లేదు. మరియు మరికొంత గ్యాప్ కోరుకుంటున్నారు. మీరు లేదా మీ భాగస్వామి ఇలా భావిస్తే తప్పు ఏమీ లేదు. కానీ ఇలాగే నిత్యం జరుగుతుంటే దాన్ని మీరు తీవ్రంగా పరిగణించాలి.


 • 4) మీ స్నేహితులను ఇష్టపడతారు..

  మన జీవితంలో స్నేహితులు ముఖ్యమైన భాగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ స్నేహం కోసం రిలేషన్ షిప్ ను విస్మరించడం ఎల్లప్పుడూ మంచిది కాదు. మీ భాగస్వామి ఎల్లప్పుడూ అతని లేదా ఆమె స్నేహితులను కలిసేందుకు మరియు మీతో ప్లాన్ చేసిన వాటిని క్యాన్సిల్ చేస్తే అతను లేదా ఆమె స్నేహితులతో మాత్రమే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లయితే ఇది మీకు ఆందోళన కలిగించే విషయం కావచ్చు.


 • 5) మీ భాగస్వామి సహాయం చేయరు..

  భార్యాభర్తలు అన్నాక ఇంటి పని, వంట పని, ఒంటి పనులలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇలా ఒకరికొకరు అన్యోన్యంగా జీవిస్తారు. కానీ మీ భాగస్వామి మీరు చేసే పనులకు సహాయం చేయడానికి ఇష్టపడకపోతే, అతని లేదా ఆమె పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ఇష్టపడితే ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది.


 • 6) అరుదుగా మాట్లాడతారు..

  ఎవరైనా మిమ్మల్ని నిజంగా విలువైన వారిగా భావించినప్పుడు అతను లేదా ఆమె మీతో కమ్యూనికేట్ చేయడమే కాకుండా కొంత అర్థవంతమైన ముచ్చట్లలో మునిగి తేలుతారు. అతను లేదా ఆమె వంటి వారు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తుంటారు. మీరు మీ రోజును ఎలా గడిపారు అనే దాని గురించి అడుగుతారు. మీ సంబంధంలో ఇవన్నీ జరగకపోతే మీ భాగస్వామి మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నట్టే.


 • 7) మీ భాగస్వామి రొమాంటిక్ కాదు..

  మీ భాగస్వామి మీతో సమయాన్ని గడపడానికి లేదా మీపై ప్రేమను చూపించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం లేదని మీరు భావిస్తుంటే, మీరు రొమాంటిక్ యాంగిల్ లోకి తీసుకురావడానికి చిలిపి పనులు చేసినా, మీ భాగస్వామి మీతో రొమాంటిక్ గా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే, మీరు అతని గురించి లేదా ఆమెతో మాట్లాడినప్పటికీ ఫలితం ప్రతికూలంగా వస్తే కష్టంగా అనిపిస్తుంది.


 • 8) కఠినమైన రిలేషన్ షిప్..

  సాధారణంగా ప్రతి జంట ఇష్టాలు మరియు అయిష్టాలను చూసుకోవడానికి ఇష్టపడతారు. వారి రిలేషన్ షిప్ కొనసాగాలని వారు కోరుకుంటే వారు తమ భాగస్వాములకు నచ్చని పనులు చేయకుండా చూసుకోవాలి. కానీ, మీ భాగస్వామి ప్రతిసారీ దీనిని విస్మరిస్తే మీ సంబంధం కఠినమైన రహదారి వైపు వెళ్తుందని మీరు గ్రహించాలి.

  మీ భాగస్వామి తీసుకున్న ఈ సమస్యను అధిగమించడానికి ఉత్తమ మార్గం సమర్థవంతమైన కమ్యూనికేషన్. మీ ఆందోళన మరియు చింతలను మీ భాగస్వామికి తెలియజేయండి . మీ భాగస్వామి మిమ్మల్ని అరవడం మరియు నిందించడం మరియు విస్మరించడం కంటే అతను లేదా ఆమె ఏమి చేస్తున్నారో తెలుసుకోండి.
మీరు మీ భాగస్వామి కోసం ఏదైనా మధురమైన మరియు ప్రత్యేకమైన పనిని చేసినప్పుడు గొప్పగా అనిపిస్తుంది. అందుకు బదులుగా మీ భాగస్వామి మీ ప్రయత్నానికి కృతజ్ఞతా భావాన్ని చూపుతుంది. ఆరోగ్యంగా ఉంచడానికి నమ్మకం, ప్రేమ, తాదాత్మ్యం మరియు పరస్పర గౌరవం ఉండాలి. కానీ, మీ భాగస్వామి మిమ్మల్ని సందేహిస్తేనే మీకు హానికరం.

భాగస్వాముల్లో ఒకరు రిలేషన్ షిప్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటే, మరొకరు దానిని గమనించకపోతే అది అసంబద్ధంగా, చేదుగా మారవచ్చు. సమయం బాగోలేనప్పుడు భాగస్వాముల్లో ఒకరు ప్రశంసలు మరియు గౌరవాన్ని చూపించడాన్ని పట్టించుకోరు. ఇది మీ భాగస్వామి మిమ్మల్ని సందేహాస్పదంగా తీసుకుంటుందనడానికి ఓ సంకేతం కావచ్చు. ఇలాంటి సంకేతాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏవో ఈరోజు స్టోరీలో తెలుసుకోండి.