Back
Home » సంబంధాలు
ఈ లక్షణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే భర్తలకు అదృష్టం కలసివస్తుందట..
Oneindia | 5th Oct, 2019 05:36 PM
 • 1) మతాన్ని అనుసరించేవారు..

  పురాణాల ప్రకారం తమ మతాన్ని నిజమైన మనస్సుతో, విశ్వాసంతో అనుసరించే వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. అలాంటి మహిళలు పెళ్లి తర్వాత మెట్టినింటికి వచ్చి అత్తగారిని ఆనందంగా ఉంచుతారు. అలాగే భర్తకు జీవితాంతం తోడ్పాటును అందిస్తారు. కుటుంబాన్ని సైతం కష్టపెట్టకుండా ఉంటారు.


 • 2) పరిమిత కోరికలు..

  పరిమిత కోరికలు ఉన్న మహిళలు, తమ కోరికలను ఎలా నియంత్రించాలో తెలిసిన మహిళలను అదృష్టవంతులుగా భావిస్తారు. వీరంతా ఎవరి కోరికలను వారు అవధుల్లో ఉంచుకుంటారు. తమ భర్తను అదృష్టవంతుడిగా భావిస్తారు. ఇలాంటి కొత్త వాటి కోసం అన్వేషించినా భర్తను ఏ మాత్రం ఇబ్బంది పెట్టరు. ఇవన్నతీ నిర్వహించడం వల్ల వారి ఇంట్లో దేనికీ కొరత ఉండదు.


 • 3) సహనం ఉండే స్త్రీలు.

  పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత ఏ మహిళకు అయితే ఓపిక, సహనం, ఓర్పు ఇలాంటి ఉంటే వారు అదృష్టవంతులుగా భావించబడతారు. అలాగే ఇలాంటి మహిళలు భర్త ఏదైనా సమస్యలో సామరస్యంగా పరిష్కరించేందుకు తమ వంతు సహాయం చేస్తారు. ఇలాంటి వారు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటారు. కానీ సహనం, ఓర్పు, ఓపిక లేని ఇంట్లో మాత్రం అశాంతి నెలకొనేలా చేస్తారు.


 • 4) నిర్వహణ విధానం..

  పెళ్లికి ముందు కాని, పెళ్లి అయిన తర్వాత గానీ చిన్నపిల్లలను, పెద్దలను చూసుకునే బాధ్యతలను తెలిసిన వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. వీరు పెళ్లి అయితన తర్వాత పెద్దలతో మర్యాదగా మాట్లాడతారు. మర్యాదను ఇచ్చిపుచ్చుకోవడమే కాక వారి మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తారు. నలుగురిలో ఎలా మెలగాలో, కుటుంబ నిర్వహణ ఎలా చేయాలో ఇలాంటి మహిళలకు బాగా తెలుసు. ఈమె ఉన్నంతవరకు కుటుంబంలో ఎల్లప్పుడూ ఏ చిన్నపాటి గొడవను కూడా అనుమతించరు.


 • 5) అప్రమత్తత..

  తన భర్త పరిస్థితిని జాగ్రత్తగా చూసుకునే వారు, భర్త స్థితిని అత్యంత జాగ్రత్తగా చూసుకునే స్త్రీలను ధర్మవంతులుగా భావిస్తారు. వీరు భర్త ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఎలాంటి గందరగోళాన్ని సృష్టించారు. అంతేకాదు ఇలాంటి మహిళలు తమ భర్తను ఆ ఇబ్బందుల నుండి తప్పించడానికి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తారు.


 • 6) కోపం రాని భార్యకు..

  మీకు కాబోయే భార్యకు మధురమైన స్వరం ఉంటే.. మాత్రం నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే భార్య యొక్క మధురమైన స్వరం వస్తే అది భర్త ఒక్కడికే కాకుండా మీ కుటుంబం మొత్తానికి ఆనందం కలిగిస్తుంది. మీ భార్యకు కోపం రాకుండా ఉంటే కూడా మంచిది. ఎందుకంటే ఇలాంటి మహిళలు ముందు ఏమి జరిగిందో తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ భార్య కఠినమైన, అసభ్యకరమైన మాటలు వంటివి వాడితే అవి వివాదానికి కూడా కారణమవుతాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇంద్రధనస్సులో ఏడురంగులు..

ఈ ప్రపంచంలో ఏడు వింతలు..

సంగీతంలో ఏడు స్వరాలు..

ఈ విశ్వంలో ఏడు సముద్రాలు..

శ్రీవారివి ఏడు కొండలు..

పెళ్లితో వేసేది ఏడు అడుగులు..

వివాహం అయిన తర్వాత భర్త అడుగులో అడుగేస్తూ నడిచేది భార్య. మన భారతీయ సమాజంలో భార్యభర్తల సంబంధం ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క విషయంతో వివాహానికి మన దేశంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు వారి జీవితంలో పెళ్లి అయిన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ వివాహ జీవితంలో ప్రేమ, గౌరవం మరియు నమ్మకాన్ని కొనసాగించిన నాడే ఈ ప్రయాణం చాలా సులభం అవుతుంది. లేకపోతే దాని గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అందుకు సంబంధించిన కథలు మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. కొన్ని ప్రత్యక్షంగా చూశాం. చూస్తున్నాం కూడా. అందుకే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే మీకు కూడా మంచి లక్షణాలున్న వ్యక్తి దొరికితే, ఆ వ్యక్తిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకునే మహిళల్లో ఏయే లక్షణాలు ఉండాలో తెలుసుకోండి. భర్తగా మారి సంతోషకరమైన జీవితాన్ని పొందండి..