Back
Home » సంబంధాలు
అక్కడ మగాళ్లకు ప్రవేశం నిషేధం.. కానీ మహిళలు గర్భం దాలుస్తున్నారు.. అదెలా సాధ్యమంటే?
Oneindia | 19th May, 2020 08:46 PM
 • ఉమాంజాలో..

  పురుషులకు ఇప్పటికీ ప్రవేశం లేని గ్రామం పేరు ఉమాంజా. ఇది ఆఫ్రికా ఖండంలోని ఓ మారుమూల గ్రామం. ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. అక్కడ ఆడవారు చెప్పిందే వేదం.. వారి మాటే శాసనం.. అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయట.

  PC : The Guardian


 • బలవంతంగా కోరికలు..

  రవి అస్తమించని సామ్రాజ్యమైన బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో కెన్యా మహిళలు అష్టకష్టాలు పడ్డారట. ఆ సమయంలో బ్రిటీష్ సైనికులు అక్కడున్న మహిళలను బలవంతంగా లాక్కెళ్లి మరీ వారిని అనుభవించేవారట.

  PC : The Guardian


 • రోడ్డున పడేవారట..

  అయితే బ్రిటీష్ సైనికులు అనుభవించిన మహిళలను వారి భర్తలు అస్సలు వారి దగ్గరకు రానిచ్చేవారు కాదట. వారి ఇంటి నుండి బయటకు గెంటివేసేవారట. దీంతో దిక్కు తోచని ఆ మహిళలు ఏమి చేయాలో తెలియక రోడ్డు మీదే ఉండేపోయేవారట.

  PC : The Guardian


 • కొత్త ప్రపంచాన్ని..

  అప్పటి నుండి ఇలాంటి వాటి నుండి విముక్తి పొందేందుకు సంబురు వర్గానికి చెందిన మహిళలంతా స్వయంగా ఓ కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారట. దాని పేరే ఉమెజా గ్రామం. అది ఏర్పాటు చేసుకున్నాక పురుషులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదని తీర్మానం కూడా చేసుకున్నారట.

  PC : The Guardian


 • ఓ మహిళ నుండి..

  ఆడవారి కోసం ఆడవారే ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన ఉమెజా గ్రామంలో ఇంటి నుండి ఎవరైతే గెంటి వేయబడతారో, ఎవరైతే పుట్టింట్లో లేదా మెట్టినింట్లో అవమానాలను ఎదుర్కొంటారో అలాంటి వారందరినీ ఇక్కడ చేరదీస్తారట. ఇలాంటి అనుమానాలన్నీ ఎదుర్కొన్న రెబెకా అనే మహిళకు ఈ ఆలోచన వచ్చిందట.

  PC : The Guardian


 • అనేక విప్లవాలు..

  ఆమె సారథ్యంలో ఏర్పాటైన ఆ రాజ్యంలో పురుషుల చేతిలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారట. వారు ఎదుర్కొన్న అవమానాలు ఇంకెవ్వరూ ఎదుర్కోకుండా అనేక విప్లవాలను తీసుకువచ్చారట. అలాగే వారు స్వాధీనం చేసుకున్న భూములలో కూరగాయలను ఉత్పత్తి చేయడం, వివిధ రకాల ఆభరణాలు, వస్తువులు తయారీ చేసి, వాటిని అమ్మడం ద్వారా జీవనాన్ని కొనసాగించేవారట.


 • తాము రక్షించుకోవడానికి

  ఆ గ్రామంలోని మహిళలు తమ ఇళ్లను మట్టి, పేడలను కలిపి నిర్మించుకున్నారట. గుడిసెల చుట్టూ ముళ్ల కంచెలను ఏర్పాటు చేసుకున్నారట. ఇతర ప్రాంతాల వారి వల్ల ప్రమాదాలు రాకుండా తమను తాము రక్షించుకోవడానికి వీటిని ఏర్పాటు చేసుకున్నారట.


 • మహిళల గర్భం ఎలా అంటే?

  అక్కడ పురుషులు నివసించడానికి లేదు కానీ, పురుషులు వచ్చి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉందట. అలా కొందరు పురుషులు వచ్చి వెళ్లే సమయంలోనే అక్కడి మహిళలు వారితో రహస్యంగా ఆ కార్యంలో పాల్గొని గర్భం దాల్చుతున్నారట.


 • అక్కడ పుట్టిన మగ పిల్లలకు..

  అయితే అక్కడ పుట్టిన మగపిల్లలకు మాత్రం నివసించే హక్కు ఉంటుందట. అయితే అది కూడా కేవలం 18 సంవత్సరాల వయసు వచ్చే వరకేనట. ఆ తర్వాత అక్కడి మహిళలే వారిని బలవంతంగా వారిని ఆ ఊరి నుండి బయటికి సాగనంపుతారట. అలా 15 ఏళ్ల క్రితం అక్కడ 30 మంది మహిళలు, 50 మంది చిన్న పిల్లలు ఉండేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం 50 మంది మహిళలు, 200 మందికి పైగా పిల్లల వరకు పెరిగింది.
ప్రస్తుత కాలంలో కలయిక గురించి తెలుసుకోవాలని యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుకునే వారు కాదు. అయితే ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు కూడా శరవేగంగా మారుతున్నాయి. కలయిక, రొమాన్స్ వంటి విషయాల గురించి యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ సాధారణ విషయాల మాదిరిగానే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆ కార్యం జరిగితేనే పిల్లలు పుడతారు. ఈ విషయం గురించి యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు.

అయితే ఇలా స్రుష్టికి విరుద్ధంగా ఎప్పటికీ జరగలేదు. జరగదు కూడా. అయితే ఓ గ్రామంలో మాత్రం కేవలం మహిళలే నివసిస్తూ ఉంటారు. అక్కడ కనీసం మగాడు కూడా కనిపించడు. ఒకవేళ మగాడు కనిపిస్తే అతని పని అంతేనట. ఎందుకంటే అక్కడ పురుషులకు ప్రవేశం లేదంట. వారిని నిషేధించారట. అయితే మగపిల్లల్లో చిన్నపిల్లలు మాత్రం నివసించొచ్చు అంట. అయితే ఇక్కడే చాలా మందికి ఓ సందేహం వస్తుంది. మగవారిని రాకుండా నిషేధం విధించారు. కేవలం ఆడవారే నివసిస్తూ.. వారిని వారే పరిపాలించుకుంటున్నారు. మరి మగవారి ప్రమేయం లేకుండానే పిల్లలు ఎలా పుడుతున్నారు? అసలు వారు ఆ కార్యంలో పాల్గొనకుండా ఇది ఎలా సాధ్యమైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...