Back
Home » సంబంధాలు
కరోనా టైమ్ లో మీ భాగస్వామికి శృంగారంలో బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఊగిపోవాలంటే...!
Oneindia | 21st May, 2020 04:22 PM
 • కిక్కిచ్చే కిస్..

  మీ భాగస్వామిపై మీకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, దాన్ని వ్యక్తీకరించడానికి మీరు వారిని ప్రేమతో కిస్ ఇస్తేనే వారిలో కిక్ అనేది పెరుగుతుంది. అలాంటి వ్యక్తీకరణ మీ మనసు లోతుల్లోంచి వస్తున్నట్లయితే, దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ శ్రీవారు పనిలో బిజీగా ఉన్నప్పుడు, వారి దగ్గరగా నిలబడి తలపై చేతులు తిప్పి తేలికపాటి కిస్ ఇవ్వండి. అంతే మీ భాగస్వామి మీ ప్రేమను వెంటనే గ్రహిస్తారు. వెంటనే మీకు ప్రతిస్పందన కనబరుస్తారు.


 • మసాజ్ చేయండి..

  మీ భాగస్వామి ఇంట్లో ఏవైనా పనులు చేసేటప్పుడు మసాజ్ గురించి మాట్లాడకండి. అయితే వారి శరీరాలు ఎప్పుడైతే విశ్రాంతి కోరుకుంటాయో, అప్పుడు వారికి మాంచి మసాజ్ చేయండి. అదే సమయంలో మంచి సంగీతాన్ని వినిపించండి.


 • అలా ప్రారంభించండి..

  అప్పుడు వారి మెడ మరియు వెనుక భాగంలో తేలికపాటి మసాజ్ తో ప్రారంభించండి. మీరు వారికి హెడ్ మసాజ్ కూడా చేయొచ్చు. వారికి దగ్గరగా ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయంలో వారిని విశ్రాంతి తీసుకోనివ్వండి. అదే సమయంలో కొన్ని కొంటె చర్యలు చేయడం ద్వారా మీరు వారిని ఉత్తేజపరచవచ్చు.

  షాకింగ్ సర్వే! లాక్ డౌన్ వేళ వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగాయట... అది కూడా 10 లక్షలకు పైనే...!


 • రొమాన్స్ బాధ్యతలను..

  మీరు రొమాన్స్ ప్రారంభించిన ప్రతిసారీ అదే ఉత్సాహం ఉండాలనుకోవడం సరైనది కాదు. కొన్నిసార్లు మీరు రొమాన్స్ విషయంలో బాధ్యత తీసుకోవాలి. మీరే చొరవ తీసుకోవాలి. మీరే వారికి కొన్ని శృంగార సంకేతాలను పంపాలి.


 • ఇద్దరికీ ప్రయోజనం..

  ఇలా మీరు చేస్తే వారు ఎప్పటికీ అస్సలు తిరస్కరించలేరు. మీ ప్రయత్నాలకు వారు ఫిదా అయిపోతారు. దీని వల్ల మీరిద్దరూ ప్రయోజనం పొందుతారు.


 • రొమాంటిక్ డిన్నర్..

  ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఎవ్వరికీ బయట డిన్నర్ చేసే అవకాశం రావటం లేదు. ఇప్పట్లో అసలు ఇది సాధ్యం కాదు కూడా. అందుకే మీరు ఉంటున్న ఇంట్లోనే డిన్నర్ ప్లాన్ చేయండి.

  OMG! గర్భం పొందడానికి ఆ లెస్బియన్లు ఎంత పని చేశారంటే...!


 • మీ మనసుకు నచ్చినట్టు..

  మీ డైలీ బోరింగ్ జీవితంలో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే మీరే స్వయంగా మీ భర్తకు ఇష్టమైన వంటలను తయారు చేయండి. మీ మనసుకు నచ్చిన విధంగా డైనింగ్ టేబుల్ ను అలంకరించండి.


 • అలాంటి సమస్యలేవీ..

  మీరు ఎక్కడ బయట ఉన్న రెస్టారెంట్ కు వెళ్లిన సమయంలో అక్కడ నైట్ డిన్నర్ తర్వాత రొమాన్స్ చేయడంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీ ఇంట్లో అలాంటి సమస్యలేవీ ఉండవు.


 • గట్టిగా కౌగిలించుకోవడం..

  చాలా జంటలు సన్నిహిత సంబంధంలో ఉన్నప్పుడు, వారు గట్టిగా కౌగిలించుకోవడం వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కూడా శృంగారానికి ముందు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవచ్చు.


 • నిద్రకు ముందు ముచ్చట్లు..

  ఆ తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోకండి.. అలాగే శృంగారాన్ని మొదలుపెట్టకండి. ముచ్చట్లను మొదలుపెట్టండి. ముఖ్యంగా రొమాన్స్ గురించే మాట్లాడుకోండి. ఆ సమయంలో వారి ఒడిలో కూర్చుని ఉండండి. ఇలాంటి వాటి వల్ల వారి మానసిక స్థితి మారిపోతుంది.


 • సెక్సీ డ్రెస్..

  రాత్రి వేళలో మీరిద్దరు మాత్రమే బెడ్ రూమ్ లో ఉంటే, మీ శ్రీవారిని కవ్వించడానికి లేదా ఆకర్షించడానికి మంచి సెక్సీ డ్రెస్సులను వేసుకోండి. మీ బెడ్ రూమ్ వాతావారణాన్ని వేడేక్కించండి. ముఖ్యంగా మీ భర్తకు ఇష్టమైన లాంజర్ ధరించి వారిని ఆశ్చర్యపరచండి. ఇలాంటి చర్యల వల్ల మీ వారు మీకు ఫిదా అయిపోతారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా మంది జంటలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మిగిలిన వారు గోళ్లు గిల్లుకుంటూ కరోనాతో సహ జీవనం, సంసారం, షికార్లు చేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో చాలా మంది అమ్మాయిలు తమ భాగస్వామితో ఈ సమయంలో ఎంచక్కా గడపాలని ఎన్నెన్నో ప్లాన్లు వేస్తున్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదని సంతోషంగా ఉన్నారు.

కానీ అలాంటి వివాహిత మహిళలు తమ భర్తలు శృంగారంలో విసుగు చెందుతున్నారని బాధపడుతున్నారు. వారు రోజంతా పనిలోనే మునిగిపోతున్నారు. శృంగారానికి అస్సలు సహకరించడం లేదని చిరాకు పడుతున్నారు.

ఇంకో మాటలో చెప్పాలంటే ఇలాంటి సమయంలో పురుషులకు తమ భార్య పట్ల అతనికి ఉన్న ప్రేమ, ఆకర్షణ తగ్గుతుంది. రిలేషన్ షిప్ లో గొడవలు కూడా పెరుగుతాయి. అయితే ఈ విషయం వారికి తెలియదు.

ఇలాంటి సమయాల్లో మీరిద్దరూ విసుగు చెందితే భార్యభర్తల సంబంధంపై ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు. కరోనా కాలంలోనూ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే శృంగారంలో మీరు మీ శ్రీవారిని ఉత్సాహంగా మేల్కొలపవచ్చు. అవేంటో మీరే చూడండి...

లాక్ డౌన్ వేళ.. టాలీవుడ్ లో పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!