Back
Home » ഏറ്റവും പുതിയ
Rs.10,000 ధర లోపు ఆన్‌లైన్ సేల్స్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే...
Gizbot | 23rd May, 2020 04:14 PM
 • స్మార్ట్‌ఫోన్‌

  చాలా రకాల సంస్థలు ఇటువంటి ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నప్పటికీ అవి అధిక మొత్తంలో ధరను కలిగి ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇటువంటి ఫీచర్లతో సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరల వద్ద కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసారు. WhatsApp QR Code ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు...


 • స్మార్ట్‌ఫోన్‌లు

  ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. లోక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంటి వద్ద నుండి పనిచేసే వారు అధికంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కంటే అధికంగా మొబైల్ డేటాను వాడుతున్నట్లు చాలా వెబ్ సైట్లు కూడా ప్రచురించాయి. మొబైల్ డేటాను అన్ని రకాల ఫోన్లలో వాడటానికి అవకాశం ఉన్నపటికీ హాట్ స్పాట్ సహాయంతో మరి కొన్ని పరికరాలను కనెక్ట్ చేయడానికి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే అనుమతిని ఇస్తాయి. అటువంటి ఫీచర్లను కలిగి ఉండి సరసమైన ధరలలో గల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Tata Sky Broadband లో ఈ కొత్త మార్పులు గమనించారా!!!


 • Redmi Note 8

  షియోమి సంస్థ గతేడాది 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే మరియు 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్‌లో లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ యొక్క 4జీబీ+64జీబీ వేరియంట్ యొక్క ధర రూ.11,499. ఇది తక్కువ ధరలో కొనుగోలు చేసే వారికి అనువుగా ఉంటుంది. ఇది స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, కాస్మిక్ పర్పుల్, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది.


 • Honor 20i

  హానర్ సంస్థ గత ఏడాది విడుదల చేసిన హానర్ 20 సిరీస్‌లో హానర్ 20ఐ యొక్క 4జీబీ+128జీబీ వేరియంట్‌ ప్రస్తుతం రూ.10,999 ధర వద్ద పొందవచ్చు. ఇది 6.21 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే , కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్‌ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. అలాగే ఇది 24+8+2మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెట్ అప్ తో పాటుగా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉన్నాయి.


 • Lenovo K10 Note

  మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ రేస్‌లో ఉన్న మరొక ఫోన్ లెనోవో కే10 నోట్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999 ఇది కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. facebook "ప్రొఫైల్ లాక్ ఫీచర్" గురించి ముఖ్యమైన విషయాలు


 • Realme Narzo 10

  లాక్‌డౌన్ తర్వాత రియల్‌మి సంస్థ రిలీజ్ చేసిన మిడ్ రేంజ్ ఫోన్లలో ఇది ఒకటి. రియల్‌మి నార్జో 10 స్మార్ట్‌ఫోన్ యొక్క 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999. దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.


 • Redmi Note 7 Pro

  రెడ్‌మీ నోట్ 7 ప్రోకు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. ఫేస్ అన్‌లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉన్న ఈ యొక్క 4జీబీ ర్యామ్ +64జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం కేవలం రూ.10,999 ధర వద్ద లభిస్తుంది.


 • మోటరోలా మోటో G8 పవర్ లైట్

  మోటరోలా మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అత్యంత సరసమైన ధరలలో విడుదల అయింది. ఇది కేవలం ఒకే ఒక వేరియంట్ లో మాత్రమే విడుదల చేసారు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ గల దీని ధర రూ.8,999. ఇది రాయల్ బ్లూ మరియు ఆర్కిటిక్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.


 • స్మార్ట్‌ఫోన్‌ సేల్స్

  స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతం అదే లాక్ డౌన్ సమయాలలో కొనుగోలు చేయాలనుకునే వారు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ సేల్స్ ద్వారా పొందవచ్చు. ఇండియాలో ప్రస్తుతం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్ లలో వీటి యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ సేల్స్ లలో కొన్ని ఫోన్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. కొనుగోలు చేయదలచిన వారు మీకు నచ్చిన ఈ-కామర్స్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అవి ఆఫర్ చేస్తున్న ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లు అంటే ప్రస్తుతం సుమారు 6 అంగుళాలకు మించిన డిస్‌ప్లేను ఫుల్‌హెచ్‌డీ+ వ్యూ కలిగి ఉండి కనీసం 4జీబీ ర్యామ్ మరియు అద్భుతమైన రియర్ కెమెరా సెట్ అప్ గల స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌లను ఇష్టపడుతూ ఉంటారు.