Back
Home » సంబంధాలు
కామంతో కట్టుకున్నోన్నే చంపుకున్నా, నా భర్త మెడను రంపంతో కోసేశా #mystory266
Oneindia | 11th Oct, 2018 05:38 PM
 • మా ఆయన డ్రైవర్

  మా ఇంటికి రోజూ మా ఆయన డ్రైవర్ గా పని చేసే ట్రాక్టర్ ఓనర్ వచ్చేవాడు. ఆ ఓనర్ కు ఊర్లో మంచి పలుకుబడి ఉండేది. బాగా డబ్బులుండేవి. ఓనర్ వచ్చినప్పటికి కూడా మా ఆయన నిద్ర లేచే వాడు కాదు. మీ ఓనర్ వచ్చిండు.. ఇక లేసి జల్ది పనికో పో అని రోజూ మా ఆయన్ని లేపి పంపేదాన్ని.


 • మీ ఆయన కోసమే రావడం లేదు

  అలా రోజూ ట్రాక్టర్ ఓనర్ ఉదయమే మా ఇంటికొచ్చేవాడు. రోజురోజుకు తను నాకు దగ్గరయ్యాడు. ఇంత పొద్దున్నే మీరు ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది.. మా ఆయనకు కాస్త గట్టిగా చెబితే ఆయనే వస్తాడు కదా.. మీరెందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారన్నాను. నేను కేవలం మీ ఆయన కోసమే రావడం లేదు. దీంతో తను నన్ను ఇష్టపడుతున్నాడని నాకు అర్థమైంది.


 • అమాంతం వాటేసుకున్నాడు

  ఓనర్ ఇంటికిరాగానే టీ తయారు చేసి ఇచ్చేదాన్ని. నన్ను తను బాగా మెచ్చుకునేవాడు. నాకు ఎంత కావాలంటే అన్ని డబ్బులిచ్చేవాడు. తను నా జీవితంలోకి వచ్చాక ఏదో తెలియని ఆనందం పెరిగింది. ఒకసారి నా భర్తలేనప్పుడు ఏకంగా ఇంట్లోకి వచ్చాడు. నన్ను అమాంతం వాటేసుకున్నాడు.


 • అక్రమ సంబంధానికి అడ్డుగా

  అలా మా మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరం ఒకరం లేకుండా ఒకరం ఉండలేనంత పరిస్థితికి మా బంధం చేరుకుంది. కానీ మా అక్రమ సంబంధానికి మా ఆయన మాకు అడ్డుగా అనిపించేవాడు. మా ఆయన నా అక్రమ సంబంధం గురించి తెలియడంతో నాపై కోప్పడేవాడు. అతన్ని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నాం.


 • నా భర్త మెడను రంపంతో కోసి

  ఇద్దరం కలిసి పథకం ప్రకారం నా భర్తను చంపేశాం. నా భర్త మెడను రంపంతో కోసి అతి కిరాతకంగా చంపేశాం. తర్వాత జలశయంలో పడేశాం. ఇక ఇద్దరం హ్యాపీగా ఉందామనుకున్నాం. కానీ తర్వాత పోలీసులకు దొరికాం. మా పరువు మొత్తం పోయింది. అందరూ మా ముఖాలపై థూ అని ఉమ్మేశారు. నా పిల్లలు ఒంటరి వాళ్లు అయ్యారు.


 • కామంతో పెద్ద తప్పు చేశాను

  నేను కామంతో పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నా భర్తను చంపుకున్నాను. అయితే ఆ ట్రాక్టర్ ఓనర్ తర్వాల ప్లేట్ తిరిగేశాడు. నాతో సంబంధం లేనట్లు నటించాడు. కానీ నేను మాత్రం అతన్నే వదలిపెట్టే ప్రసక్తే లేదు. అతన్ని నమ్మే నా మొగుణ్ని చంపుకున్నా. కానీ ఒళ్లు మరిచి నేను చేసినా తప్పుకు నేను పెద్ద శిక్షనే అనుభవిస్తున్నా. ప్రతి క్షణం నరకం చూస్తున్నా.
నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు. పిల్లల్ని కూడా బాగానే చూసుకునేవాడు. కానీ ఎందుకో నాకు ఆయనపై అసంతృప్తిగా ఉండేది. అప్పుడప్పుడు నా మీద కోప్పడేవాడు. మా ఆయన ట్రాక్టర్ డ్రైవర్. దీంతో ఆయనపై నాకు అంత మోజు ఉండేది కాదు. కానీ అతనితో మనస్సు చంపుకుని కాపురం చేసేదాన్ని. పిల్లలు కూడా పుట్టారు.