Back
Home » విహారం
సుష్మా స్వరాజ్ పుట్టింది ఇక్కడే: అంబాలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం..
Native Planet | 7th Aug, 2019 03:48 PM
 • అంబాలా పట్టణము చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది

  అంబాలా హర్యానా పర్యాటక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఒక చక్కటి ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలో ఒక జిల్లాగా, కంటోల్మెంట్ గా ఉన్నది. ఇక్కడ ప్రవహించే నదులలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి గంగా మరియు సింధూ నదులు. ఇవి రెండూ జీవనదులే. ఈ ప్రదేశం పంజాబ్ మరియు హర్యానా సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ పర్యటన సాహసమే అనే చెప్పుకోవాలి. అలా అని ఇక్కడ చీటికీ మాటికీ గొడవలు ఉంటాయా ? అంటే ఉండదనే చెప్పాలి. అంబాలా పట్టణము చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని మతాల వారు వారి వారి రోజువారీ దినచర్యలను ఎటువంటి ఆటంకం లేకుండా ముగించుకుంటారు.


 • ఇక్కడ పర్యాటక ప్రదేశాలు చూడాలంటే

  ఇక్కడ పర్యాటక ప్రదేశాలు చూడాలంటే మీరేం మిలిటరీ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. ఈ ప్రదేశంలో ప్రధాన ఆకర్షణ భవానీ అంబా దేవాలయం. ఆమె పేరు మీదనే ఈ నగరానికి ఆపేరు పెట్టారు. ఈ నగరంలో చూడవలసినవి కొన్నే అయినప్పటికీ సందర్శనకు విలువ ఉండే ప్రదేశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంబాలా కంటోన్మెంట్ నుండి కేవలం 3 km దూరంలో ఉన్నది.


 • నగరంలో ఇతర ఆకర్షణలుగా

  నగరంలో ఇతర ఆకర్షణలుగా బాద్షా బాగ్ గురుద్వారా, సిస్ గంజ్ గురుద్వారా, లాఖీ షా & తక్వాల్ షా, సెయింట్ పాల్ చర్చి మరియు మాతా మందిర్ కాళి ఉన్నాయి.


 • భవానీ అంబా ఆలయం

  భవానీ అంబా ఆలయం అంబాలాలో భవానీ అంబా ఆలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంది. నగరంనకు ఈ ఆలయంలో ఉన్న అంబా దేవత నుండి పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ పురాతన ఆలయంను నగరంలో ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా పరిగణిస్తారు. అంబాలాలో ఇతర ఆకర్షణలుగా మాతా మందిర్ కాళి,గురుద్వారా శ్రీ మంజీ సాహిబ్,సెయింట్ పాల్ చర్చి మరియు బాద్షాహీ బాగ్ గురుద్వారా ఉన్నాయి.

  PC: Manojkhurana


 • బాద్షాహీ బాగ్ గురుద్వారా బాద్షాహీ బాగ్ గురుద్వారా

  బాద్షాహీ బాగ్ గురుద్వారా బాద్షాహీ బాగ్ గురుద్వారా అంబాలా జిల్లా కోర్ట్ వెనుక ఉన్నది. ఈ నిర్మాణం 10 వ గురువు గురు గోబింద్ జీ సందర్శన జ్ఞాపకార్ధం నిర్మించారు. గురువు లఖ్నూర్ విహారయాత్ర సందర్భంగా ఈ నగరంను సందర్శించారు.


 • క్లాత్ మార్కెట్.

  అంబాలాలో మార్కెట్లు అంబాలా లో అన్వేషించటానికి విలువైన మరో ప్రాంతం క్లాత్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలను టోకు ధరకే విక్రయిస్తుంటారు. చేనేత వస్త్రాలు మరియు పట్టు నుండి సూట్లను మరియు ఇతర మెటీరియల్ తో చేసిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ లు సుమారు 1000 వరకు ఉన్నాయి. అంబాలాలో కూడా అన్ని రకాల శాస్త్రీయ మరియు శస్త్రచికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్న ఒక సైన్స్ మార్కెట్ ఉంది. అందువల్ల ఈ నగరంను 'సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ నగరం' అని కూడా అంటారు. అంతేకాక అంబాలా నగరం నేత వస్త్రాలు మరియు బంగారు నగల కోసం కూడా ప్రాచుర్యం పొందింది.

  PC: Abhi abhinav bakshi


 • అంబాలా ప్రాంత సందర్శనకు ఉత్తమ సమయం :

  అంబాలా నగరంను అక్టోబర్ మరియు మర్చి మాసాలలో సందర్శించవచ్చు. ఆ సమయంలో ఈ ప్రాంత సందర్శన ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు ఆనందించవచ్చు.

  PC: Kailash Mohankar


 • అంబాలా ఎలా చేరుకోవాలి ?

  రోడ్డు మార్గం
  అంబాలా ఢిల్లీ, చండీఘర్,అమృత్సర్ మరియు సిమ్లా వంటి పొరుగున ఉన్నఅన్ని ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ప్రైవేట్ బస్సులు కూడా రాష్ట్రంలో సమీపంలోని నగరాలు నుండి అంబాలాకు అందుబాటులో ఉన్నాయి.
  రైలు మార్గం
  అంబాలా నగరం ఉత్తర రైల్వే జోన్ యొక్క ప్రధాన విభాగం అందువలన రాష్ట్రంలో ఒక ప్రధాన జంక్షన్ గా ఉంది. అంబాలా కంటోల్మెట్ రైల్వే హెడ్ భారతదేశం యొక్క పురాతన శిబిరాల్లో ఒకటి. దాని భౌగోళిక స్థానం వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో నుండి మరియు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి సులభంగా చేరవచ్చు.
  విమాన మార్గం
  అంబాలాలో విమానాశ్రయం లేదు. నగరానికి 40 km దూరంలో సమీప విమానాశ్రయం చండీగఢ్ వద్ద ఉన్నది. చండీగఢ్ విమానాశ్రయం భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంటుంది.
భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. 1966 లో పంజాబ్ నుండి వేరుపడి ఈ రాష్ట్రం ఏర్పడింది. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణాన రాజస్థాన్, ఉత్తరంన హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా కలిగి వుంది హర్యానా. భారత రాజధాని డిల్లీకి ఆనుకునివున్న.. హర్యానా చాలా అందమైన, విశిష్ట పర్యాటక ప్రాంతాలను కలిగి ఉంది హర్యానాలోని పర్యాటక ప్రాంతాలు డిల్లీ నుంచి కేవలం నిమిషాల్లో చేరుకోవచ్చు.

ద్వాపరయుగంలో మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది. ఫరీదాబాద్ లోని బద్ఖల్ సరస్సు కూడా ఇక్కడ చూడదగిన మరో ఆకర్షణ. భివాని వద్ద ఉన్న నక్షత్ర నిర్మాణం కూడా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం. దేవాలయాలు, కోటలు లేక సరస్సులు, పార్కులు హర్యానా పర్యాటకంలో దర్శించవచ్చు. హర్యానాలో మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం అంబాలా. అంబాలాకు మరో పత్యేకత ఉంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలాలో జన్మించారు. మరి అంబాలా పర్యాటక పరంగా ఏలా ఉంది. అక్కడ ఆకర్షణీయ ప్రదేశాలేంటో ఒకసారి తెలుసుకుందాం..